Latest Updates
-
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్‌లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.!
భార్యాభర్తల మధ్య ఎమోషనల్ అబ్యూస్.. ఈ సిగ్నల్స్ కనిపిస్తే చాలా డేంజర్.!
ప్రతి సంసారంలోనూ చిన్న చిన్న పొరపొచ్చాలు రావడం సహజం. ఏదో ఒక సందర్భంలో మనస్పర్థలు తొలగి కలిసిపోతుంటారు. అదే అన్యోన్య దాంపత్యం. కానీ కొన్ని బంధాల్లో భాగస్వామిపై మితిమీరిన అసహనాన్ని ప్రదర్శిస్తుంటారు. కొందరు చేతల్లో చూపిస్తే మరికొందరు మానసికంగా వేధింపులకు గురి చేస్తుంటారు. అదే ఎమోషనల్ అబ్యూస్ అని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.

వివాహ బంధం అంటే దంపతుల మధ్య స్వేచ్ఛ ఉండాలి. సలహాలు, సూచనలు, అభిప్రాయాలు, అభినందనలు, విమర్శలు ఏదైనా పంచుకునేంత స్వతంత్రం ఉండాలి. రెండు విభిన్న ప్రపంచాల నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులు కొత్త ప్రపంచాన్ని ఏర్పరుచుకోవాలి. ఆ ప్రపంచంలో ఉగాది షడ్రుచుల్లా అన్ని అనుభూతులు ఉండాలి. అప్పుడే ఆ బంధం పరిపూర్ణంగా ఉంటుంది.
అయితే వివాహ బంధంలో ఒకరిపై ఒకరు ప్రదర్శించుకునే కోపతాపాలు సహజమే అయినా.. కొన్ని సంకేతాలు చాలా ప్రమాదకరమని, అది వారి మధ్య బంధాన్ని మరింతగా బలహీనపరుస్తుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. అది ఎమోషనల్ అబ్యూస్‌కి దారి తీస్తుందని.. మానసికంగా వారి స్వేచ్ఛని హరించినట్లే అని అంటున్నారు. మరి ఆ సంకేతాలు ఏంటి ఇక్కడ చూద్దాం..
భార్యాభర్తలు అన్నాక ఏ విషయమైనా స్వతంత్రంగా చెప్పుకొనే విధంగా ఉండాలి. కానీ తనతో ఏం మాట్లాడితే ఏమంటారో, ఎలా స్పందిస్తారో అని సందిగ్ధంతో నోరు తెరవడానికే జంకుతుంటారు. భాగస్వామిని ఇలా కంట్రోల్‌లో పెట్టడం సరైంది కాదని.. వారిని మానసికంగా లొంగదీసుకోవడం ఆ వ్యక్తి స్వేచ్ఛను హరించినట్లే.
కొందరు భార్యలు భర్తతో ఏదైనా విషయం చెప్పాలన్నా పది సార్లు ఆలోచిస్తారు. అయితే ఇది తనపై గౌరవం అని అనుకుంటారు. ఇది గౌరవం కాదు ఒకరకంగా అతి భయం. భాగస్వామితో ఏ విషయమూ చెప్పాలన్నా.. ఇంట్లో అవసరాలకి ఏదైనా అడగాలన్నా భయపడటం వారిని మానసికంగా బాధించినట్లే. దంపతుల మధ్య ప్రేమతో కూడిన గౌరవం ఉండాలే కానీ.. భయంతో కూడిన రెస్పెక్ట్ ఉండకూడదు. ఇది పిల్లల పెంపకంపైనా ప్రభావం చూపిస్తుంది.
భాగస్వామితో విషయాలు పంచుకునే స్వేచ్ఛను ఇవ్వకపోవడం మానసికంగా ఒత్తిడికి గురిచేయడమే. వారిని పనిగట్టుకుని మాటల్లో, చేతల్లో కోపం ప్రదర్శించకోపోయినా.. ఇలా సైకలాజికల్‌గా భయానికి గురిచేయడం వారిని అదుపులో ఉంచడానికి చేసే ప్రయత్నాలుగా మానసిక నిపుణులు చెబుతున్నారు. భాగస్వామితో మనసు విప్పి మాట్లాడే వాతావరణం కల్పించకపోగా.. ఎప్పుడు ఏం మాట్లాడితే ఏం జరుగుతుందే అని భయానికి గురిచేయడం ఎమోషనల్ అబ్యూస్‌కి ప్రమాదకర సంకేతం.
వైవాహిక బంధంలో భార్యాభర్తల మధ్య ప్రేమ అనేది చాలా కీలకం. అది కొరవడిన చోట ఆ ప్రభావం మొత్తం కుటుంబంపైనా ప్రభావం చూపిస్తుంది. పిల్లలు సైతం ఇలాంటి మార్పులని కనిపెడుతూ వారు ఫ్యూచర్‌లో అలాగే ప్రవర్తించే అవకాశం ఉంది. ఇద్దరి మధ్య ప్రేమ, గౌరవం అనేది నమ్మకంతో ముడిపడి ఉండాలని.. సైకాలజిస్టులు సూచిస్తున్నారు. నమ్మకం లేకుండా వచ్చే ప్రేమ, గౌరవం అనేది ఎక్కువ కాలం నిలబడదు.

కొన్ని కుటుంబాల్లో భర్తలు ఇంటి వ్యవహారాల్లో తీసుకునే ఏ నిర్ణయమైనా భార్యతో మొదటగా సంప్రదించరు. తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులతో చర్చించిన తర్వాత చివరి ప్రాధాన్యతగా భాగస్వామికి విషయం తెలియజేస్తారు తప్పితే సలహాలు తీసుకోరు. ఇది చాలా తప్పు. జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చిన తర్వాత.. మీ కష్టసుఖాల్లో, సంతోషాల్లో, ఆర్థిక ఇబ్బందుల్లో తోడుండేది భాగస్వామి మాత్రమే. వారితో సంప్రదించకుండా ఏ నిర్ణయం తీసుకున్నా అది నమ్మకాన్ని దెబ్బతీయడమే కాకుండా ప్రేమ తగ్గిపోయేలా చేస్తుంది.
భాగస్వామికి మీపై నమ్మకాన్ని ఎంత మేరకు సంపాదించుకుంటున్నారు అనే దానిపైనే ప్రేమ, గౌరవం అనేవి ముడిపడి ఉంటాయి. మీ బంధంలోనూ ఇలాంటి పరిస్థితులు ఉన్నట్లయితే పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకుని దానిని సరిదిద్దుకుని అన్యోన్య దాంపత్యాన్ని ఆస్వాదించాలని సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
