Latest Updates
-
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి?
ప్రియుడితో లేచిపోయిన భార్య..పాలతో స్నానం చేసి స్వాతంత్య్రాన్ని జరుపుకున్న భర్త!..వీడియో చూడండి
ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో అంతే వేగంగా విడాకులు కూడా వచ్చేస్తున్నాయి. జీవితాంతం ఒకరికొకరు అనే కాన్సెప్ట్ క్రమంగా కనుమరుగైపోతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా విడాకులు తీసుకుంటున్నారు. అర్థం చేసుకోలేని భాగస్వామలతో కొందరు నరకం చూస్తూ ఎప్పెడెప్పుడా అని విడాకుల రోజు కోసం ఎదురుచూస్తున్నోళ్లు కూడా ఉన్నారు. పెళ్లి అయితే స్వాతంత్ర్యం కోల్పోతాము అనే భావన అటు అబ్బాయిలు, ఇటు అమ్మాయిల్లోనూ పెరిగిపోతుంది. తాజాగా భార్యతో విడాకులు వచ్చాయన్నా వార్త తెలిసిన వెంటనే 40 లీటర్ల పాలతో ఓ యువకుడు స్నానం చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇతడికి స్వాతంత్ర్యం లభించింది ఇక వీడిని ఎవ్వడూ ఆపలేడు,నీకు నరకం నుంచి విముక్తి లభించింది మాకు ఇంకా ఇలాంటి ఛాన్స్ రాలేదు అంటూ కొందరు సోషల్ మీడియాలో అతడిని విష్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
అసలేం జరిగింది
అసోం రాష్ట్రంలోని నల్బరి జిల్లాలోని ముకల్మువా గ్రామంలో మాణిక్ అలీ అనే యువకుడు నివసిస్తున్నాడు. ఇతడికి పెళ్లై ఓ కూతురు కూడా ఉంది. మాణిక్ తెలిపిన ప్రకారం అతడి భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండేది. ఈ విషయం తెలిసి మాణిక్ ఆమెను మందలించాడు. ఇదేం పని ఇలా చేయొద్దు అంటూ భార్యకు నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు. అయితే భార్య ప్రవర్తనలో మార్పు రాలేదు. భర్తతో ఉండటం ఇష్టం లేక ప్రియుడితో లేచిపోయి. అయితే ఏమైందో ఏమీ కానీ కొన్ని రోజులకే తిరిగి మళ్లీ ఇంటికొచ్చేసింది. తిరిగినొచ్చిన భార్యను తిట్టకుండా మళ్లీ చేరదీసి ఇంట్లోనే ఉంచుకున్నాడు మాణిక్ అలీ. అయితే మళ్లీ భార్య మనస్సు ప్రియుడి మీదకు మళ్లింది. భర్త,కూతురు, సంసారం ఇవేవీ వద్దు..ప్రియుడే ముద్దు అనుకొని మళ్లీ అతడితో కలిసి జంప్ అయింది. మళ్లీ కొన్ని రోజులకు ఇంటికి తిరిగొచ్చేసింది. నన్ను క్షమించండి ఇంకెప్పుడు ఇలా చేయను అని భార్య మాటలు విని నమ్మేశాడు మాణిక్ అలీ. అయితే కుక్క తోక వంకరే అన్నట్లు బాగా చూసుకునే భర్తతో అడ్జెస్ట్ కాలేకపోయింది.

చివరకు విడాకులకు అప్లై చేశారు. విడాకులు మంజూరు అయ్యాయి అని లాయర్ ఫోన్ చేసి చెప్పగానే మాణిక్ ఎగిరి గంతేశాడు. పాలతో స్నానం చేసి తన స్వేచ్ఛను సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 40 లీటర్ల పాలను తెప్పించుకొని తన ఇంటి బయట పాలతో మాణిక్ అలీ స్నానం చేశాడు. "ఆమె తన ప్రియుడితో రెండు సార్లు పారిపోయి మళ్లీ వచ్చింది..నా కూతురి కోసం ఆమెను క్షమించా..కలిసి ఉండటానికి ప్రయత్నించా.. కానీ కుదరలేదు.. విడాకులు రావడం సంతోషంగా ఉంది.. ఈరోజు నుండి నేను స్వతంత్రుడిని" అని అతను చెబుతున్నట్లు వీడియోలో కనిపిస్తుంది.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం వెస్ట్ బెంగాల్ లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. బెర్హంపూర్ లోని హరిహర్‌పర నివాసి అయిన అరిఫుల్ మండల్ అనే యువకుడు విడాకులు తీసుకున్న ఆనందంలో పాలతో స్నానం చేశాడు. ఆ వీడియో కూడా వైరల్ గా మారింది.



Click it and Unblock the Notifications
