Latest Updates
-
ఆదివారం స్పెషల్ పొటాటో చికెన్ కుర్మా..ఆ సీక్రెట్ పదార్థం కలిపారంటే తిరుగులేని రుచి.. -
Weekly Rasi Phalalu: అక్టోబర్ 11-17 వార ఫలాలు.. ఏ రాశుల వారికి అదృష్టం వరిస్తుందంటే? -
నీళ్లకు బదులు పాలతో ఇలా క్రీమీ రవ్వ కేసరి చేయండి..చాలా చాలా టేస్టీగా ఉంటది! -
దేవీ నవరాత్రులు..ఇంట్లోనే సులభంగా కలశ ప్రతిష్ఠాపన, పూజ ఎలా చేయాలి? -
పాలు తక్కువగా ఉన్నప్పుడు.. టీ చిక్కగా, రుచిగా రావాలంటే ఇలా చేయండి! -
ఛీ ఛీ ఏంటీ పని: 11 ఏళ్ల బాలుడితో సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సెర్ నిషా.. -
పిల్లల్లో జలుబు, దగ్గు తగ్గించే కషాయం..టీకి బదులుగా ఇది తాగితే ఫుల్ ఎనర్జీ.. ఇలా చేసుకోండి -
మలబద్ధకం, మొటిమల సమస్యతో బాధపడుతున్నారా? ఈ 3 ఫుడ్స్ తింటే కడుపు శుభ్రం! -
శృంగారంలో అసలైన మజా కోసం..ఈ పూర్వక్రీడ నియమాలు తెలుసుకోండి -
టిఫిన్స్ లోకి అదిరిపోయే టమాటా పల్లి కుర్మా..గిన్నెలు గిన్నెలు కుర్మానే తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే..
పెళ్లి తర్వాత జంటలకి ఎదురయ్యే సవాళ్లు.. ఎదుర్కొంటే ఆదర్శ దాంపత్యమే.!
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడం అనేది సహజం. వైవాహిక జీవితం అంటేనే సంతోషాలు, దుఃఖం, బాధ్యతలు, సవాళ్లు, ఒత్తిడి అన్నిటికీ దీటుగా నిలబడుతూ సంసార సాగరాన్ని ఈదుతూ ఉండాలి. అయితే ఇందులో భార్యాభర్తల పాత్ర కీలకం. వారిమధ్య అవగాహన, నమ్మకం, మద్దతు వారి బంధాన్ని బలపరిచి ఎన్ని సమస్యలొచ్చినా పరిష్కరించుకునే సామర్థ్యాన్ని ఇస్తుంది. ఈ క్రమంలో వివాహం తర్వాత జంట 5 సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని మనస్తత్వ నిపుణులు అంటున్నారు.

వైవాహిక బంధం మొదలయ్యాక భార్యాభర్తలిద్దరికీ కొత్త ప్రపంచం మొదలవుతుంది. ఒకరి అభిరుచులు తెలుసుకోవడం, ఇష్టాయిష్టాలు, కుటుంబీకులతో పరిచయం, వారితో కలిసిపోవడం ఇలా వీటికే చాలా సమయం తీసుకుంటుంది. ఇక ఆ తర్వాత పిల్లలు, వారి పెంపకం, బాధ్యతలు, కుటుంబ వ్యవహారాలు ఇలా అన్నిటినీ సమపాళ్లలో చూసుకుంటూ దాంపత్య జీవితం సాగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో భార్యాభర్తలిద్దరికీ అవగాహన, నమ్మకం, సహకారం చాలా అవసరమని నిపుణులు అంటున్నారు. ఇక, వివాహం తర్వాత ప్రతి దశలోనూ దంపతులకు కొన్ని సవాళ్లు ఎదురవుతుంటాయి. ఆ సవాళ్లు ఏంటో చూద్దాం..
ఆర్థిక సంక్షోభం
జీవితంలోకి కొత్త వ్యక్తి వచ్చాక బాధ్యతల కారణంగా ఆర్థిక పరిస్థితులు తలెత్తడం సర్వసాధారణం. కొన్ని సందర్భాల్లో ఉద్యోగంలో అస్థిరత, వ్యాపారంలో నష్టాలు వంటి ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో భార్యాభర్తల మధ్య పారదర్శకత, పరస్పర నమ్మకం తప్పనిసరిగా ఉండాలి. ఇదే బలమైన సంబంధాలకు చిహ్నంగా నిపుణులు చెబుతున్నారు. ఇద్దరూ ఎలాంటి దాపరికాలు లేకుండా కలిసి నిలబడాలి. అప్పుడే నమ్మకానికి బలమైన పునాది వేసుకోవచ్చు.
పిల్లల పెంపకం
వైవాహిక జీవితంలో భార్యాభర్తలిద్దరికీ అత్యంత అందమైన, అద్భుతమైన ఘట్టం బిడ్డను కనడం. బిడ్డ పుట్టాక ఎలాంటి అనుభూతి పొందుతారో, ఇక ఆ బిడ్జను పెంచడంలో అన్నే సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. తల్లి ప్రసవ వేదన అనుభవిస్తూ పగలూ, రాత్రి మేల్కొని ఉంటే.. పెరిగిన ఆర్థిక బాధ్యతలు తండ్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. ఈ క్రమంలో ఆర్థిక బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకుంటూ ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో అవగాహన ద్వారా మాత్రమే కాపురాలు నిలబెడతాయి.
వృత్తిపరమైన సవాళ్లు
ఉద్యోగం, వ్యాపారాల విషయంలో భార్యాభర్తలు ఒకరి అభిప్రాయాలను మరొకరు తప్పనిసరిగా గౌరవించుకోవాలి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ పొజిషన్‌లో ఉన్న సందర్భాల్లో వారి మధ్య అసూయ ఏర్పడితే అది బంధంలో పగుళ్లకు దారితీస్తుంది. పోటీకి దూరంగా ఉండి ఒకరి అభిరుచులను మరొకరు గౌరవించుకుంటేనే అది పరస్పర ఎదుగుదలకు దారితీస్తుంది.

వృద్ధాప్యం
వైవాహిక జీవితంలో చివరి దశ వృద్ధాప్యం. ఈ దశలో ఒంటరితనం ఎదుర్కోవచ్చు. అనారోగ్య పరిస్థితులు ఇబ్బంది పెట్టవచ్చు. దంపతులు ఎంత ఆదర్శంగా ఉంటారో ఈ దశనే తెలియజేస్తుంది. సమయానికి మందులు ఇవ్వడం, మాట్లాడుకోవడం, పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈ దశను మరిచిపోలేని జ్ఞాపకంగా మార్చుకోవాలి. ఈ దశ కోసం డబ్బు ఆదా చాలా అవసరం. జీవిత చరమాంకాన్ని ప్రేమతో గడపాలని నిపుణులు సూచిస్తున్నారు.
భావాలకు విలువ
కుటుంబంలో ఆర్థిక సంక్షోభం, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తలెత్తినప్పుడు ఒకరికొరు సహకారంతోనే భార్యాభర్తల మధ్య ఆదర్శ దాంపత్యం బలపడుతుంది. ఈ దశను దంపతులు సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఏ దాంపత్యమైనా ఒంటరిగా కాకుండా తమ భర్తలతో కలిసి ఎదుర్కొంటేనే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. జీవితంలో ప్రతి దశను విజయవంతంగా దాటాలంటే భావోద్వేగాలను అర్థం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
