Latest Updates
-
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.!
Best Birthday Wishes for Mother : తీర్చుకోలేని రుణం అమ్మ ప్రేమ..!
అమ్మ గొప్పతనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆ భగవంతుడిని కూడా సృష్టించింది కూడా అమ్మే. అమ్మే లేకపోతే సృష్టియే లేదు. అమ్మ జీవితంలో అత్యంత ఆనందమైన రోజు మన పుట్టిన రోజే. మనం ఈ భూమిపై పుట్టిన రోజున అందరికంటే ఎక్కువగా సంతోషించింది కూడా అమ్మే. అమ్మ రుణాన్ని తీర్చుకోలేము. పుట్టినరోజు రోజు వేడుకలను చాలామంది స్నేహితులతో పిల్లలతో ఘనంగా జరుపుకుంటారు కాని అమ్మ పుట్టినరోజును అలా ఘనంగా జరపడం అతి తక్కువగా చూసి ఉంటాం. అమ్మ ప్రేమను అర్థం చేసుకోవడానికి ఒక జీవితం సరిపోదు. అలాంటి అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడానికి ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని శుభాకాంక్షల సందేశలను మీకు అందిస్తున్నాం.
అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు
దేవుడు అన్నిచోట్లా ఉండలేక... సృష్టించిన పాత్రే 'అమ్మ'! అంతటి గొప్పదైన అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
అనుక్షణం మా అభివృద్ధి, శ్రేయస్సు గురించి ఆలోచించే 'అమ్మ'కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

ఏ దేశమేగినా .. ఏ తీరం దాటినా.. మరువని మమకారమే 'అమ్మ'కి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎన్నడూ ఆందోళన దరి చేరనీయకుండా కంటికిరెప్పలా కాపాడిన అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
'అమ్మ' ప్రేమ తరువాతే ఇంకెవ్వరి ప్రేమ అయినా అని నాకు తెలిసేలా చేసిన అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు
అమ్మ..! నువ్వు ఇలాగే సంతోషంగా ఎన్నో పుట్టినరోజులు మనసారా జరుపుకోవాలని కోరుకుంటూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ
అందమైన అనుబంధం అమ్మ.. అంతు లేని అనురాగం అమ్మ..మరపురాని జ్ఞాపకం అమ్మ.. అమ్మ.. నీకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు
అమ్మ ప్రేమ తరువాతే ఇంకెవరి ప్రేమ అయినా అని నాకు తెలిసేలా చేసిన అమ్మకి పుట్టినరోజు శుభాకాంక్షలు.
ఎన్ని యుగాలు మారినా ఎన్ని తరాలు దాటినా.. మారని మాధుర్యం అమ్మ ప్రేమ..
చేసే ప్రతీ పని మన ఆనందం కోసమే.. మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది.. ఆమే అమ్మ.. మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు అమ్మ..
తడపడుతూ పడే తొలి అడుగులోనూ..
పయనిస్తూ సాగే ప్రతీ అడుగులోనూ ఆరాటపడుతూ అనుబంధం పంచేది అమ్మ.. అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు
అమ్మ అన్న పదం అద్భుతం..
అమ్మకు అద్భుతం మన జీవితం.
అమ్మకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు..
అనుక్షణం మా అభివృద్ధి శ్రేయస్సు కోసం ఆలోచించే అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు.
ప్రకృతి చేసిన బంగారు ప్రతిమ అమ్మ.. ప్రతి గుండె సడిలోని భావం అమ్మ.. అమ్మకు జన్మదిన శుభాకాంక్షలు..



Click it and Unblock the Notifications
