Latest Updates
-
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.? -
పూజ గదిలో దీపం ప్రతిసారీ ఆరిపోతుందా.. మీ ఇంట్లో ఈ కష్టాలు తప్పవు.! -
రోజూ అవే చపాతీలు, రోటీలు తిని బోర్ కొట్టిందా? మట్కా రోటీ ఇలా చేస్తే పిచ్చెక్కించే టేస్ట్! -
స్వీట్, హాట్ తినాలనే కోరికలు విపరీతంగా ఉన్నాయా.. మీ బాడీలో ఈ లోపాలే కారణం.! -
శని దేవుని అభయహస్తం: జూన్ 2027 వరకు ఈ 3 రాశులకు రాజయోగం.. మీరున్నారా ఇందులో? -
కాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలం..రోజకి ఇది 1 తింటే చాలు కొండలను ఢీకొట్టే శక్తి! -
గ్రహాల అరుదైన కలయిక: ఈ 4 రాశుల వారికి కుబేర యోగం.. మహాలక్ష్మి రాజయోగంతో పట్టిందల్లా బంగారమే! -
బ్రేక్ ఫాస్ట్ కైనా, డిన్నర్ కైనా.. స్టఫ్డ్ పనీర్ కుల్చా చాలా ఈజీగా చేసుకోండిలా..వేళ్లు చప్పరిస్తూ తింటారు! -
మీటింగ్లో కెమెరా ఆన్ చేయాలని మేనేజర్ మొండిపట్టు.. ఉద్యోగిని గెటప్ చూసి మైండ్ బ్లాంక్.! -
రాత్రిపూట అతి ఆలోచనలతో నిద్ర కరువు.. ఈ చిట్కాలతో ఇట్టే కునుకు పట్టేస్తుంది.!
ఆరోగ్యకరమైన లైంగిక జీవితం కోసం ఆయుర్వేదం చెబుతున్న చిట్కాలివే..!
ఆయుర్వేదం అనేది ఐదు వేల సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉద్భవించిన సమగ్ర వైద్య విధానం. ఆయుర్వేదం ప్రకారం ఆరోగ్యకరమైన లైంగిక చర్య వల్ల మనిషి శారీరంకగానే కాకుండా మానసికంగానూ చాలా ఆరోగ్యంగా తయారవుతాడట.
దీని వల్ల రోగనిరోధక శక్తి పెరగడం, మనిషి జీవిత కాలం పెరగడం జరుగుతుందట. ఆరోగ్యకరమైన లైంగిక చర్యలో పాల్గొనాలంటే ఇవి చాలా ముఖ్యం. వీటిని ఫాలో అయితే దంపతులిద్దరూ వారి ఆయుష్షును పెంచుకుంటూ ఆరోగ్యవంతంగా జీవించొచ్చు.

1. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం:
లైంగిక ఆరోగ్యంతో పాటు మానవ శరీరానికి మంచి ఆహారం అవసరం. పండ్లు, కూరగాయలు, తృణ ధాన్యాలు మరియు లీన్ ప్రోటీన్లతో కూడిన ఆహారాన్ని తినాలని ఆయుర్వేదం చెబుతోంది. ఇవి మనిషిలో లైంగిక సామర్థ్యాన్ని పెంచడానికి ఎంతో కృషి చేస్తాయట.
2. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం:
ఆరోగ్యకరమైన జీవనశైలిలో వ్యాయామం చాలా ముఖ్యం. వ్యాయామం చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. దీని వల్ల మనిషి సంతృప్తిగా ఎలాంటి టెన్షన్లు లేకుండా తమ పనులను తాము చేసుకోవచ్చు. ముఖ్యంగా ఎలాంటి ఒత్తిడి లేకపోతే లైంగిక వాంఛ పెరుగుతుంది.
3. తగినంత నిద్ర పోవడం:
శారీరక, మానసిక ఆరోగ్యానికి నిద్ర చాలా అవసరం. బాగా విశ్రాంతి తీసుకున్నప్పుడు మనిషి ఎక్కువ శక్తిని పొందుతాడు. అప్పుడే ఎలాంటి పని ఒత్తిడి అయినా బాగా తట్టుకోగలుగుతారు. ఈ కారకాలన్నీ మరింత ఆనందదాయకమైన లైంగిక జీవితానికి దోహదపడతాయి.
4. ఒత్తిడిని దరిచేరనీయకండి:
ఒత్తిడి.. శారీరక, మానసిక ఆరోగ్యం రెండింటినీ దెబ్బతీస్తుంది. ఇది లైంగిక పని తీరులో సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఒత్తిడిని అస్సలే దరి చేరనీయవద్దు. ఒకవేళ తీవ్ర ఒత్తిడికి లోనైనా.. యోగా, ధ్యానం, ప్రకృతిలో సమయం గడపడం వంటి వాటితో ఒత్తిడిని తగ్గించుకోవాలి.

5. అరోమా థెరపీని ఉపయోగించడం:
అరోమా థెరపీ అనేది విశ్రాంతిని ప్రోత్సహించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే లైంగిక కోరికను మెరుగు పరచడానికి ఇది ఒక సహజ మార్గం. గులాబీ, మల్లె, గంధం వంటి నూనెలలతో మసాజ్ చేయడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది. తద్వారా లైంగిక వాంఛలు పెరుగుతాయి.
6. శృంగార వాతావరణాన్ని సృష్టించడం:
లైంగికంగా కలవబోయే ముందు భాగస్వామిలో కూడా అలాంటి భావనే కలిగేలా చేయాలి. లైట్లను డిమ్ చేయడం, మృదువైన సంగీతాన్ని పెట్టడం, అలాగే కొన్ని కొవ్వొత్తులను వెలిగించడం వంటివి చేయడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. గదిలోకి రాగానే మసాజ్ ఆయిల్స్ తో మసాజ్ చేసుకోవడం, లోదుస్తుల్లో కనిపించడం వంటివి చేస్తుంటే మీ భాగస్వామికి మీపై ఇష్టం పెరుగుతుంది.
7. కమ్యూనికేషన్ చాలా ముఖ్యం:
ఆరోగ్యకరమైన లైంగిక జీవితానికి కమ్యూనికేషన్ అవసరం. మీ ఇష్టాలు మరియు అయిష్టాల గురించి మీ భాగస్వామితో చెబుతూ ఉండాలి. కొత్త విషయాలను ప్రయత్నించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. భాగస్వామికి నచ్చే విధంగా వారు చెప్పింది చేయడం కూడా మీకు వారిపై ఉన్న ప్రేమను తెలియజేస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications