Latest Updates
-
ఇకపై గోవా వెళ్లక్కర్లేదు బాస్..మన ఏపీ బీచ్ ల్లోనే ఆ అదిరిపోయే లైఫ్..జీవో జారీ -
చెట్టినాడ్ స్టైల్ మష్రూమ్ బిర్యానీ..చికెన్, మటన్ ని మరిపించే అద్భుతమైన రుచి! -
తొలి జాబ్‌లోనే రూ. లక్ష జీతం.. అప్పుడే రిటైర్మెంట్ ప్లానింగ్.. నేటి ఖర్చులు నేర్పుతున్న ఆర్థిక పాఠం.! -
ఎదుటివారు మిమ్మల్ని నమ్మాలంటే మీలో ఉండాల్సిన లక్షణం ఏంటో తెలుసా? మాటకారిదనం కాదు! -
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ!
జాగ్రత్త బ్రో: హనీమూన్ వెళ్తే మర్డర్ అయిపోతామని భయపడుతున్నారా? ఇలా చేస్తే మీరు సేఫ్!
పెళ్లయ్యాక ప్రతి జంటకు తమ కొత్త జీవితానికి తొలి అడుగు హనీమూన్. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకోడానికి ఈ ప్రేమ ప్రయాణం ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటుంది. కొందరు పెళ్లయిన వెంటనే హనీమూన్ కోసం మంచి ప్లేస్ సెలక్ట్ చేసుకొని బ్యాగులు సర్దేసుకొని వెళ్లిపోతుంటారు. చాలా ట్రావెల్ కంపెనీలు ప్రత్యేక హనీమూన్ ప్యాకేజీలను,ఆఫర్లను కూడా అందిస్తుంటాయి. అయితే గత కొద్ది రోజులుగా హనీమూన్ అనే పేరు వింటేనే కొందరికి మనసులో తెలియని టెన్షన్ పుట్టుకొస్తుంది. దీనికి కారణం..ఇటీవల కాలంలో పెరిగిపోయిన హనీమూన్ హత్యలే.
ప్రియుడి మోజులో పడి పెళ్లయిన గంటల వ్యవధుల్లోనే భార్యలు భర్తలను చంపుతున్న కేసులు,భర్తలు కూడా భార్యలను చంపుతున్న కేసులు కూడా ఎక్కువగా నమోదుతున్న క్రమంలో గత నెలలో మేఘాలయ మర్డర్ కేసు గురించి విన్నప్పటినుంచి హనీమూన్ అంటే వణికిపోతున్నారు చాలామంది. మధ్యప్రదేశ్ కు చెందిన రాజా రఘువంశీ-సోనమ్ దంపతులు పెళ్లైన వెంటనే హనీమూన్ కోసం ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయకు వెళ్లగా..ప్రియుడి సాయంతో భర్తను హనీమూన్ లోనే చంపించేసి ఏమీ తెలియనట్లు సోనమ్ నాటకమాడటం ఆ తర్వాత నిజం బయటపడటంతో ఆమె కటకటాల పాలవ్వడం అందరికీ తెలిసిందే. దీని తర్వాత ఉత్తరప్రదేశ్ కు చెందిన ఖుష్బూ-శంకర్ హనీమూన్ ఉదంతం మరోసారి అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ప్రేమించి, పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ఆ జంట హనీమూన్ లో విషాదాంతంగా విడిపోవడం, భర్తే భార్యను రైలు నుండి తోసేయడం జరిగింది.

హనీమూన్ హత్యలు గురించి విన్నప్పుడు ఏ జంటకైనా తమ ప్రయాణం గురించి ఆందోళన కలగడం సహజం. అయితే ఇలాంటి సంఘటనలను చూసి హనీమూన్ నే రద్దు చేసుకోవడం పరిష్కారం కాదు. ప్రతి వ్యక్తి అంతటి దుర్మార్గమైన మనస్తత్వంతో ఉండరు. మీ భాగస్వామిపై నమ్మకం ఉంచడం ఎంత ముఖ్యమో, మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి కాస్త అప్రమత్తంగా ఉండటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి మీ హనీమూన్ కేవలం ఆనందమయం కావాలంటేఈ కొన్ని జాగ్రత్తలు తప్పక పాటించండి.
ప్రణాళికే మీ మొదటి రక్షణ కవచం
హనీమూన్ ప్రయాణం సడెన్ గా కాకుండా, ఆచితూచి ఫ్లాన్ చేసుకోవాలి. మీకు సముద్ర తీరం ఇష్టం, మీ భాగస్వామికి పర్వత ప్రాంతాలంటే ఇష్టం అనుకుంటే ఇక్కడే మీ ఇద్దరి మధ్య తొలి అవగాహన మొదలవుతుంది. ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుని, ఇద్దరికీ నచ్చే ప్రదేశాన్ని హనీమూన్ వెళ్లేందుకు ఎంచుకోండి. ఒకరి ఇష్టాన్ని మరొకరు గౌరవించుకోవడం ద్వారా మీ బంధం బలపడుతుంది. మీరు ఎంచుకున్న ప్రదేశానికి వెళ్లడానికి ఏ సీజన్ అనువైనదో తెలుసుకోండి. వర్షాకాలంలో కొండ ప్రాంతాలకు వెళ్తే కొండచరియలు విరిగిపడటం, వరదలు వంటి ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీ ప్రయాణం ఆనందంగా సాగడానికి బదులు ఎక్కడో చిక్కుకుపోయే ప్రమాదం ఉంటది కాబట్టి వాతావరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే మీ టికెట్లు బుక్ చేసుకోండి. మీరు బస చేయాలనుకుంటున్న హోటల్ లేదా రిసార్ట్ గురించి క్షుణ్ణంగా తెలుసుకోండి. దాని రేటింగ్‌లు, ఇతర పర్యాటకులు ఇచ్చిన సమీక్షలు చదవండి. సేఫ్ ప్లేస్ లో ఉన్న హోటల్ ను ఎంచుకోవడం బెటర్.
గమ్యస్థానం చేరాక మీ భద్రత మీ చేతుల్లో
హోటల్ గదిలోకి ప్రవేశించిన వెంటనే లగేజీ సర్దడం కన్నా ముందు చేయాల్సిన ముఖ్యమైన పని గదిని క్షుణ్ణంగా చెక్ చేయాలి. గోడలకు తగిలించిన ఫోటో ఫ్రేమ్‌లు, టీవీ, గోడ గడియారాలు, బాత్రూమ్ అద్దం, మంచం కింద వంటి ప్రదేశాలలో రహస్య కెమెరాలు అమర్చే అవకాశం ఉంది. ఇది అరుదుగా జరిగినా, ఒకసారి జాగ్రత్తగా పరిశీలించడం వల్ల మీ ఏకాంతానికి భంగం కలగకుండా చూసుకోవచ్చు. హనీమూన్ అంటే ఒకరితో ఒకరు గడపడం, ఫోన్ తో కాదు. ప్రతి క్షణాన్ని ఫోటోలు తీసి వెంటనే సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడం, మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారో లైవ్ అప్‌డేట్స్ ఇవ్వడం ప్రమాదకరం. ఇది మీ ఆచూకీని చెడు ఉద్దేశాలున్న వారికి చేరవేసినట్టే అవుతుంది.

ఫ్యామిలీతో టచ్ లో ఉండాలి
హనీమూన్‌కి వెళ్లినంత మాత్రాన ప్రపంచంతో సంబంధాలు తెంచుకోవద్దు. ప్రతిరోజూ మీ కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి మీ యోగక్షేమాలు తెలియజేయండి. మీరు బస చేస్తున్న హోటల్ పేరు, చిరునామా, మీరు ఆ రోజు సందర్శించాలనుకుంటున్న ప్రదేశాల వివరాలను వారికి వాట్సాప్ ద్వారా అయినా పంపండి. మీ ఫోన్ లో లొకేషన్ షేరింగ్ ఆన్ లో ఉంచడం మంచిది. ఇది మీ కుటుంబానికి భరోసానిస్తుంది, అత్యవసర పరిస్థితుల్లో మిమ్మల్ని చేరుకోవడానికి సహాయపడుతుంది.
బంధాన్ని బలపరిచే అంశాలు
మీ ఇద్దరికీ గతం ఉండవచ్చు. మాజీ ప్రియుడు లేదా ప్రియురాలి గురించి మాట్లాడి ప్రస్తుత ఆనందాన్ని పాడుచేసుకోవద్దు. మీరు ఒకరినొకరు అర్థం చేసుకునే ఈ సున్నితమైన సమయంలో పాత గాయాలను రేపడం వల్ల లేనిపోని అపార్థాలు తలెత్తుతాయి. కొత్త ప్రదేశంలో పరిచయమయ్యే వారితో స్నేహంగా ఉండండి కానీ అతిగా నమ్మవద్దు. మీ వ్యక్తిగత విషయాలను, మీ ప్రయాణ ప్రణాళికలను అందరితో పంచుకోవద్దు.



Click it and Unblock the Notifications