Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
వెడ్డింగ్ యానివర్సరీని ఇలా రొమాంటిక్‌గా కొత్తగా జరుపుకోండి..!
ప్రతీ సంవత్సరం మీ వివాహ వార్షికోత్సవాన్ని సంతోషంతో పాటు రొమాంటిక్‌గా, కూల్‌గా, హాట్‌గా జరుపుకోవాలి. రెగ్యులర్ వేడుకలు కాకుండా ఈ సారి మీ వెడ్డింగ్ యానివర్సరీని భిన్నంగా మరింత రొమ్యాంటిక్‌గా ప్లాన్ చేసుకోండి. ఈ సారి మీరు జరుపుకుపోబయే వెడ్డింగ్ యానివర్సరీ మీ జీవితంలో ఎల్లప్పుడూ నిలిచిపోయ్ ఉంటుంది. మీరు మరింత ఆనందంగా భిన్నంగా ప్రేమగా ఎలా జరుపుకోవచ్చో మా తరపు నుంచి మీకు కొన్ని ఐడియాలు ఈ ఆర్టికల్ ద్వారా అందజేస్తున్నాం.

సూర్యడు లేవకముందు ఇద్దరూ కలిసి నిద్రలేవండి స్నానం చేసుకొని రెడీ అయ్యేంత వరకు అన్ని పనులను ఇద్దరూ కలిసి చేసుకోండి. వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి పూర్తి రోజు సమయాన్ని బెడ్‌పైనే కేటాయించాలనుకుంటారు కానీ ముందుగా బ్రేక్‌ఫాస్ట్‌ను రెడీ చేసుకొని మళ్లీ మీ బెడ్‌పైకి మీ పార్ట్‌నర్‌తో కలిసి వచ్చి తినండి.
మీ బెడ్‌రూంను మసాజ్ పార్లర్‌గా తయారు చేసుకోండి. క్యాండిల్స్‌ను వెలిగించి, ఇష్టమైన మ్యూజిక్‌ను పెట్టుకొని ఎంజాయ్ చేయండి. మసాజ్ తరువాత ఇద్దరూ కలిసి స్నానం చేయండి. షవర్ లేకపోతే ఒకేబాత్‌టబ్‌ను ఉపయోగించండి.
మీరు మొదటిసారి కలుసుకున్నప్పుడు గడిపిన తీపి క్షణాలను గుర్తుకు తెచ్చుకోండి. అప్పుడే మొదటిసారి కలిసిన ప్రేమికుల్లా కొద్దిసేపు మారిపోండి. అది మీకు మంచి రొమాంటిక్ ఫీల్‌ను కలిగిస్తుంది.
క్యాంపింగ్ టెంట్ తీసుకొని క్యాంపింగ్‌కు బయటకు వెళ్లండి. ప్రకృతిని ఇద్దరూ కలిసి ఆస్వాదించండి. రాత్రి సమయాల్లో బయట చెట్ల వద్ద సురక్షితమైన ప్రాంతం అనుకుంటే చిన్నపాటి మంటను వెలిగించుకొని ఆ మంటను కాపుకుంటూ కొంత సమయాన్ని గడపండి.
ఇద్దరూ కలిసి వంట చేయండి, కలిసి డ్యాన్స్ చేయండి, సంగీత పరికరాలు ఉంటే కలిసి వాయించండి.
మొదటి సారి మీరిద్దరూ కలుసుకున్నప్పుడు ఏమి చేశారో, కలిసి ఏమి తిన్నారో అవన్నీ కలిసి చేయండి. మీరు అదే ప్రదేశంలో ఉండలేకపోవచ్చు, కానీ కలిసి చేసిన పనులను, మాట్లాడిన మాటలను గుర్తుకు తెచ్చుకొని చేయండి.
మీ వెడ్డింగ్ యానివర్సరీ ఏరోజు ఉన్నాసరే వీకెండ్ వరకు సెలవు తీసుకోండి. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే వేడుక కాబట్టి కనీసం రెండు రోజులైనా కలసి ఎంజాయ్ చేయడానికి సమయాన్ని కేటాయించండి.
రోజా పువ్వుల కంటే అందమైన రొమాంటిక్ పువ్వు ఉండదు. కాబట్టి ఆ రోజు మీకు సాధ్యమైనన్ని ఎక్కువ రోజా పువ్వులను కొనుక్కొని మీ పార్ట్‌నర్‌కు బహుమతిగా ఇవ్వండి. మీ బెడ్‌రూంను మొత్తం రోజాపువ్వు రెక్కలతో నింపివేయండి.
మీ పార్ట్‌నర్‌పై మీకు ఎంత ప్రేమ ఉన్నదో, అదంతా ఓ లెటర్ రూపంలో రాసి పడుకునే పిల్లో కింద లేదా మీ పార్ట్‌నర్ తరచూ వెతికే చోట పెట్టండి. మీ భాగస్వామి అనుకోకుండా ఆ లెటర్‌ను చూసి మీ ప్రేమను చదివితే అప్పుడు ఇద్దరి మధ్య జరిగే క్షణాలు, పుట్టే ప్రేమను వర్ణించలేము.
ఎప్పుడో ఏళ్ల క్రితం జరిగిన పీ పెళ్లి వీడియో అందుబాటులో ఉంటే..ఇద్దరూ కలిసి మీ పెళ్లి వీడియోలను, ఫోటోలను చూడండి. అప్పటి మధుర క్షణాల గురించి మాట్లాడుకోండి.



Click it and Unblock the Notifications
