Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
నేటితరం పిల్లలు మాట్లాడే మాటలకు అర్ధం ఏంటో తెలుసా.. వాటి అర్థాలు ఇక్కడ తెలుసుకోండి!
నేటి కాలంలో పిల్లలు ఎంత ఫాస్ట్‌గా ఉన్నారో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. మనం ఆ అని ఆవలిస్తే కడుపులోని పేగులంతా లెక్కేసే విధంగా పిల్లలు తయారయ్యారు. ఒక్కొక్కరు చదువు విషయంలో మినహా ప్రతి ఒక్క విషయంలో జెట్ స్పీడ్‌లో ఉన్నారు. వారి వేగానికి తగినట్లుగానే వారి బాషా కూడా ఉంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని చాలా తొందరగా.. ఎవరికీ అర్ధం కానీ విధానంలో మాట్లాడుకోవడానికి వారు సింపుల్ సింపుల్ పదాలను వాడుతుంటారు. పెద్దవాళ్లకు ఈ మాటలు కొంచెం అసహజంగా అనిపించొచ్చు, ఎందుకంటే 1980లలో లేదా అంతకంటే ముందు జన్మించిన వారికి ఈ కొత్త పదాలు అంత తేలికగా అర్థం కావు. అందుకే ఈ కొత్త తరానికి సంబంధించిన ముఖ్యమైన పదాలను ఇక్కడ పరిచయం చేస్తున్నాం. అవి తల్లిదండ్రులకు, అర్ధం కాకపోవడంతో పాటు వారి సీక్రెట్స్ కూడా అర్ధం కాకుండాపోతాయి. అందుకే ఈ స్టోరీలో జెన్ జెడ్ పిల్లలు మాట్లాడే మాటలకు అర్థాలు ఏంటో తెలుసుకుందాం.
జెనరేషన్ జెడ్ భాషా శైలి ప్రత్యేకతలు:
వీరు చాట్ సందేశాల్లో ఎక్కువగా సంక్షిప్త రూపాలను ఉపయోగిస్తారు.
భావాలను త్వరగా, సజావుగా వ్యక్తపరచేందుకు ఎమోజీలను విస్తృతంగా ఉపయోగిస్తారు.
తమలో క్రియేటివిటీని ప్రదర్శిస్తూ కొత్త పదాలు, పదబంధాలు సృష్టిస్తున్నారు.

వారిలో ప్రాచుర్యం పొందిన కొన్ని పదాలు:
LOL (Laugh Out Loud): నవరసభరితమైన లేదా హాస్యమైన పరిస్థితుల్లో నవ్వు వ్యక్తం చేయడానికి ఉపయోగిస్తారు.
BRB (Be Right Back): కొద్దిసేపు గ్యాప్ తీసుకుని తిరిగి వస్తానని తెలియజేస్తుంది.
SMH (Shaking My Head): నిరాశ, అసంతృప్తి వ్యక్తపరచడానికి ఉపయోగించే సంకేత పదం.
IDK (I Don't Know): సమాధానం తెలియనప్పుడు సంక్షిప్తంగా చెప్పే పదం.
OMG (Oh My God): ఆశ్చర్యం లేదా ఉత్సాహాన్ని వ్యక్తపరచడానికి.
Ops: పొరపాటున ఏదైనా జరిగినప్పుడు తక్షణంగా ఇచ్చే స్పందన.
Bet: ఏదైనా ఒప్పుకోవడాన్ని లేదా "సరే" అని అర్థం చేసుకోవడాన్ని సూచిస్తుంది.
Cap / No Cap: "Cap" అంటే అబద్ధం, "No Cap" అంటే నిజం అని సూచిస్తారు.
Slay: ఎవరో అద్భుతంగా, ఆకర్షణీయంగా ఉన్నారని ప్రశంసించడానికి ఉపయోగిస్తారు.
Glow Up: వ్యక్తిగత అభివృద్ధిని, ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌ను ప్రశంసించేటప్పుడు వాడతారు.
Ice in my veins: తీవ్రమైన పరిస్థితుల్లో కూడా శాంతంగా ఉండగలగడం సూచించేది.
Finsta: ఫేక్ లేదా ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను అర్థం చేసే పదం.
Doggo: పెంపుడు కుక్కను ప్రేమగా పిలిచే పదం.
Simp: ఏదైనా వ్యక్తిపై లేదా వస్తువుపై తీవ్ర ఆసక్తి లేదా మక్కువ చూపడాన్ని సూచిస్తుంది.



Click it and Unblock the Notifications
