Latest Updates
-
కోల్కతా ఫేమస్ టాంగ్రా' డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది! -
ప్రొటీన్ పుష్కలం, పోషకాలు పదిలం.. బిర్యానీ రుచిని తలదన్నే శనగల పులావ్.! -
ఏళ్ల కష్టానికి ప్రతిఫలం.. రానున్న రోజులు ఈ ఐదు రాశుల వారికి సువర్ణాధ్యాయం.! -
విదేశీయుడి నోట హనుమాన్ చాలీసా.. వీడియో చూస్తే నోరెళ్లబెట్టకుండా ఉండలేరు.! -
మధ్యాహ్నం వంట చేసే టైం లేదా.. ఎనర్జీనిచ్చే కాలీఫ్లవర్ రైస్.. సులభంగా, టేస్టీగా ఇలా చేయండి.! -
వినాయక చవితి రోజు ఎలుక మీ కంట పడిందా.. మీ జీవితంలో జరిగే కీలక మార్పులివే.! -
శాస్త్రం ప్రకారం ఇంట్లో గణపతిని ఏ మూల ప్రతిష్ఠించాలో తెలుసా.. ఈ దిశలో ఉంచడం చాలా ఉత్తమం.! -
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.!
మీ భాగస్వామిని అడగాల్సిన 5 చిలిపి ప్రశ్నలు
భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగాలంటే.. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఇద్దరి మధ్య ఎలాంటి దాపరికాలు లేకుండా.. ప్రతి విషయాన్ని ఇద్దరూ చర్చించుకున్నప్పుడే.. దాంపత్య జీవితం అందంగా ఉంటుంది. ఒకరి అభిరుచులు మరొకరు తెలుసుకోవడం.. సూచనలు, సలహాలు ఇవ్వడం వల్ల ఎలాంటి మనస్పర్థలు దరిచేరవు.

భార్యాభర్తల మధ్య ప్రేమ పునాది లాంటిది. ఒకరిపై ఒకరు చూపించే ప్రేమే వారి దాంపత్యాన్ని కలకాలం నిలుపుతుంది. అప్పుడప్పుడూ ఇద్దరి మనసులో కొన్ని చిలిపి ప్రశ్నలు వెంటాడుతుంటాయి. ఒకరి గురించి మరొకరు బాగా అర్థం చేసుకోవడానికి.. వాళ్ల అభిప్రాయాలు తెలుసుకోవడానికి సాధారణంగా మనసులో మెదిలే పిచ్చి ప్రశ్నలేంటో చూద్దాం.

కలతగా ఉన్నప్పుడు ఎలా స్పందిస్తారు ?
ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడానికి ఇది పర్ ఫెక్ట్ క్వచ్చన్. కొన్ని సందర్భాల్లో ఎదుటివారి మూడ్ సడెన్ గా మారిపోతుంది. భావోద్వేగానికి లోనైనప్పుడు మీ భాగస్వామి ఎలా స్పందిస్తారో.. ఎలా ఓదార్చుతారో.. ఎలా అర్థం చేసుకుంటారో ఈ ప్రశ్న ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రేమను పంచే పద్ధతేంటి ?
మీపై ప్రేమను ఎలా వ్యక్తపరుస్తారో అడగండి. మీరు చూపించినట్లే వాళ్లు ఫీలింగ్స్ ఎక్స్ ప్రెస్ చేయాలని లేదు.. వాళ్లకు నచ్చిన స్టైల్ లో చెప్పవచ్చు. అదేంటో తెలుసుకోండి.. అభినందించండి.

అవసరమైతే నాకోసం ఏం త్యాగం చేస్తారు ?
ఈ ప్రశ్న ద్వారా.. మీ భాగస్వామి దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారనే విషయాన్ని తెలుసుకోవచ్చు.
ఎలాంటి పద్ధతులు పాటిస్తారు ?
సాధారణంగా ప్రతి ఒక్కరు జీవితంలో కొన్ని పద్ధతులు ఫాలో అవుతూ ఉంటారు. అలాగే.. మీ భాగస్వామి ఎలాంటి పద్ధతులు ఇష్టపడతారో తెలుసుకోండి. ఒకవేళ వారి ఐడియాస్ మీ ఐడియాస్ తో కంపేర్ అవుతాయేమో చూడండి.
అభిరుచులేంటో తెలుసుకోండి
మీ భాగస్వామి అభిరుచి ఏంటో తెలుసుకుని.. వాళ్ల టేస్ట్ కి తగ్గట్టు మిమ్మల్ని మార్చుకోగలరో లేదో తెలుసుకోండి.



Click it and Unblock the Notifications
