Latest Updates
-
వారపు రాశి ఫలాలు 22 నుండి 28 మార్చి: ఈ రాశుల వారికి అదృష్టం వరించబోతోంది, మీ రాశి ఉందేమో చూడండి! -
ఉగాది స్పెషల్.. నోరూరించే మామిడికాయ పచ్చిమిర్చి పప్పు..తింటే అమృతమే! -
ఈరోజు రాశి ఫలాలు (19.03.26): మేష రాశిలోకి చంద్రుడి ప్రవేశం.. ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది! -
ఇడ్లీ,దోశల్లోకి అదిరిపోయే కొత్తిమీర-సాంబార్ ఉల్లిపాయ చట్నీ..ఇక పల్లీ చట్నీని మర్చిపోతారు! -
విటమిన్లు, మినరల్స్ పుష్కలం..హెల్దీ బ్రేక్ ఫాస్ట్ పచ్చి కూరగాయల దోశ..ఎలా చేసుకోవాలంటే.. -
ఉగాది నాడు తప్పక చేయాల్సిన 5 పనులు..పచ్చడి తింటూ చదవాల్సిన శ్లోకం..ధర్మసింధు ఏం చెబుతోంది? -
ఉగాది 2026-27 రాశి ఫలాలు..పరాభవ నామ సంవత్సరంలో ఏ రాశికి రాజయోగం? ఏ రాశికి అవమానం? -
తక్కువ నూనె, ఎక్కువ రుచి.. నవరాత్రి స్పెషల్ సగ్గుబియ్యం దోశ..ఎలా చేసుకోవాలంటే -
నోరూరించే హైదరాబాదీ పనీర్ కీమా.. చపాతీ, రోటీ,పూరీల్లోకి దీన్ని మించిన రుచి లేదు! -
పిండి రుబ్బే పనిలేదు..అప్పటికప్పుడు ఐరన్, కాల్షియం నిండిన దూదిలాంటి మెత్తని రాగి ఇడ్లీ ..కొబ్బరి చట్నీతో కేక!
క్షమించమని అడగడానికి 10 అతి సులభమైన మార్గాలు
సహజంగా ప్రతి ఒక్కరూ తప్పులు చేయడం మానవ సహజం. అలాగే ఆ తప్పును ఒప్పు కోవడం కూడా నైతిక బాధ్యత. దీనిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఏ వ్యక్తికీ శాశ్వత శత్రువులుకానీ, మిత్రులు కానీ ఉండరు. అయితే, తప్పు చేసినప్పుడు నిజాయితీగా ఒప్పుకునేవారే సంస్కారవంతులుగా, ఉత్తములుగా పేరు పొందుతారు. ఎంతటి శత్రువునైనా తప్పు ఒప్పుకుంటే క్షమించాలి. అతనిలో పరివర్తనకు మార్గం చూపాలి.
ఎవరైన తెలిసి తెలియక తప్పు చేసినప్పుడు ఒక్కసారి క్షమించమని చెప్పడంలో తప్పు లేదు. పైగా ఇది మనిషిలోని సంస్కారానికి ప్రతీక క్షమా గుణం. బద్ధ శత్రువునైనా సరే ఒక్క సారి ‘సారీ లేదా క్షమించిమని'కోరితే మంచి మిత్రునిగా మార్చుకోవచ్చు. క్షమించే గుణం, క్షమించమని కోరే గుణం మనిషిలోని పరివర్తనకు ప్రతి రూపం.
మనుషుల మధ్య వైరుడ్యాలు లేకుండా మానవీయతను క్షమాగుణం ఆవిష్కరిస్తుంది. అపకారికి సైతం ఉపకారం చేయడం మహోన్నత వ్యక్తిత్వం. అపకారిని క్షమించడం కూడా మంచి మనస్తత్వానికి మచ్చుతునక వంటిది. ఒక చెంపపైన కొడితే మరో చెంపను చూపించాలనే పూజ్య బాపూజీ సిద్ధాంతం క్షమాగుణానికి అత్యున్నత ప్రమాణం.
కాబట్టి, మీ ఇంట్లోకానీ, బయటకానీ, పనిచేసే చోటకానీ తెలిసి తెలియ తప్పులు జరిగినప్పుడు క్షమించమని అడగడంలో తలప్పులేదు. అంతే కాదు కేవలం ఒక్క సారి చెప్పడం వల్ల ఇందరి మద్య సంబందం మరింత బలపడుతుంది అంతే కాదు, పనులు ముందుకు సాగుతాయి. అయితే సింపుల్ గా సారి చెప్పడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. సారి చెప్పడంలో కూడా ఒక కళ ఉంది. సారి చెప్పడానికి కొన్ని అందమైన మార్గాలున్నాయి .
మీరు ఎవరికి సారి చెబుతున్నార్నది నిజంగా పెద్ద విషయం కావకపోవచ్చు , అది మీ స్నేహితుడే కావచ్చే, కుటుంబ సభ్యులు, లేదా మీకు నచ్చినవారు కావచ్చు. అయితే ఒక అందమైన జంట మద్య సారి అని చెప్పడానికి కొన్ని అందమైన మార్గాలున్నాయి. అవేంటో ఒక సారి చూద్దాం...

బెడ్ మీద బ్రేక్ ఫాస్ట్ చేయడం:
ఇది ఐడియల్ గా కాకపోవచ్చు. అయితే పరిస్థితి బట్టి ఇలా చేయవచ్చు. అయితే కొత్తగా పెళ్ళైన జంటల మద్య ఇది పనిచేయవచ్చు. పాట్నర్ తో కలిసి బెడ్ మీద బ్రేట్ ఫాస్ట్ చేయడం వల్ల ఇక ఐడియా. ఇలా చేయడం మంచిది కాకపోవచ్చు. అయితే సారి చెప్పే విషయంలో మాత్రం ఇలా ఎక్స్ ప్రెస్ చేయడం క్లీన్ గా మరియు సింపుల్ గా ఉంటుంది.

షాపింగ్
మహిళలకు అపాలజీ చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది ఒక సులభమైన మార్గం వారి షాపింగ్ కు తీసుకు వెళ్ళడం. పర్సు కాళీ అవ్వచ్చు . అయితే , మహిళలను క్షమించమని అడగానికి ఇంత కంటే మంచి అవకాశం మరొకటి ఉండదు. ఈ మార్గంలో కొన్ని సందర్బాల్లో కాదు అన్ని సందర్బాలో వర్కౌట్ అవుతుంది.

ఫ్లవర్స్ :
మహిళలకు పువ్వులంటే అమితంగా ఇష్టపడుతారు కాబట్టి, మిమ్మల్ని క్షమించమని అడగానికి ఇది ఒక ఉత్తమ మార్గం . పరిస్థితి ఎంత తీవ్రమైనదో అనుకోవడం కంటే, చాలా చిన్న సమస్య అనిపించినప్పుడు ఇలా ఫువ్వులతో క్షమించమని అడిగితే చాలు. పువ్వులు కలర్ ఫుల్ గా మరియు మంచి సువాసనాభరితంగా ఉంటే రెస్పాన్స్ అంత వేగంగా వస్తుంది. పాట్నర్ ను క్షమించడానికి అందించే పువ్వులు తాజాగా మరియు సువాసనా భరితంగా ఉంటే వారు ఇంట్లోనో లేదా ఆఫిస్ లో ఉంచడం వల్ల, వారి క్షమించాలన్న భావనతో పాటు మరింత ప్రేమ పెరుగుతుంది.

ఫోటోలు:
మీరు ఒకే రూమ్ లో కనుక లేకపోతే, . మీరు క్షమించమని ఎలా ఎక్స్ ప్రెస్ చేయాలనుకుంటున్నారో, అదే విధంగా ఒక కార్డ్ బోర్డ్ మీద రాసి దాన్ని గోడకు తగిలించి ఒక మంచి స్నాప్ తీసుకొని, ఆ వ్యక్తికి అందివ్వండి. క్షమించమని అడిగే విషయంలో ఇది ఖచ్చితంగా పనిచేస్తుంది.

కాస్ట్యూమ్స్ :
ఎవరికైతే మీరు సారి చెప్పాలని కోరుకుంటున్నారో వారికి నచ్చిన కాస్ట్యూమ్స్ ను అందివ్వడమే . లేదా ఆ కాస్ట్యూమ్స్ ను మీరు ధరించి వారికి కనబడేలా చేయడమే . ఇలా చేయడం వల్ల మీరు వారి క్షమించమని అడిగినట్లే అవుతుంది. వారికి నచ్చిన దుస్తులను వేసుకోవడం వల్ల మనస్సు వారిలో కొంత కోపం తగ్గి మీ మీద సంతోషం వ్యక్తి చేస్తారు.

పప్పీ ఐస్
పప్పీ యొక్క కళ్ళు చూడటానికి చాలా అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైనా పప్పినీ తిడుతున్నప్పుడు అది రెండుకళ్ళు పెద్దగా చేసి అలాగే చూస్తుండుపోతుంది. ఆపరిస్థితిలో పప్పీ ఐస్ చూడటానికి చాలా అందంగా కనబడుతుంది. అంతే కాదు, అంతా అయిపోయిన తర్వాత తిరిగి అది మీదకు ఎగరడానికి లేదా పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలా కూడా సారి అడగవచ్చు. అయితే ఇది అందరికి, అన్నిసందర్భాల్లోనూ పనిచేయకపోవచ్చు . కొన్ని సందర్భాల్లో వర్కౌట్ అంతుంది.

సరదాగా దాడి
సరదాగా ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడం వల్ల కూడా కొద్ది సేపటికి ఆ కోపం సద్దుమనుగుతుంది . అది వక్తుల మీద మరియు వారి మనస్తత్వాల మీద ఆధారపడుతుంది. ఇది బందువులు లేదా పిల్లల వద్ద ఇలాంటివి కుదరదు. ఇలాంటివి మీకు బాగా నచ్చిన వ్యక్తుల వద్ద లేదీ మీ పార్ట్నర్ వద్ద చేయవచ్చు. చిలిపిగా కొట్టకోవడం, సున్నితమైన వస్తువులను విసురుకోవడం వల్ల కొద్దిసేపటికి కోపం తగ్గి మిమ్మల్ని క్షమించవచ్చు.

కవిత్వం
క్షమించమని అడగడానికి మీ వద్ద గొప్ప పదాలు లేకపోవచ్చు. కానీ మీకు నోటికి వచ్చని కవిత్వంను వారి ముందు ఎక్స్ ప్రెస్ చేయడం లేదా పాటరూపంలో పాడటం వల్ల వారిలో కోపం తగ్గి క్షమించేయవచ్చు . చిలిపి కవితలు, లేదా ఆమె మీదో లేదా అతని మీదో వేసే కవిత్వాలు చాలా త్వరగా కోపం నుండి తేరుకొనేలా చేస్తుంది. చాలా తర్వగా మిమ్మల్ని క్షమించేయవచ్చు.

తమాషా :
క్షమించమని అడగాలకున్నప్పుడు, మీరు చేసిన తప్పిదం(పెద్ద లేదా చిన్నదా)అన్నదానికి మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని తమాషా పనులు చేయవచ్చు. వారు మీమీద కోపంగా ఉన్నప్పుడు వాటర్ గన్ వంటివి చేతికిచ్చి మిమ్మల్ని చంపమని అడగడం. వంటివి సిల్లీగా అనిపించవచ్చు.

ఆహారం:
పురుషులకు మీరు సారి చెప్పాలనుకున్నప్పుడు, ఫుడ్ ఒక ఉత్తమ మార్గం. ఇది పెద్ద సీక్రెట్ కాకపోవచ్చు . ఆహారం విషయంలో పురుషులు ఎక్కువగా ఇంటి ఫుడ్స్ ను ఇష్టపడుతుంటారు . కాబట్టి, ఒక సర్ ప్రైజ్ రొమాంటిక్ డిన్నర్ ను ప్లాన్ చేయండి. వారికి నచ్చిన ఫుడ్ ఐటమ్స్ తో క్షమించమని అడిగేయడానికి ఇది ఒక ఉత్తమ మార్గం.



Click it and Unblock the Notifications











