మీ పార్ట్ నర్ కి గుర్తుండిపోయేలా బర్త్ డే సెలబ్రేట్ చేయడం ఎలా

మీ భాగస్వామి బర్త్ డేని మరింత స్పెషల్ గా చేయాలనుకుంటున్నారా ? మీ భర్తకు సర్ ప్రైజింగ్ బర్త్ డే ప్లాన్ చేయాలనుందా ? మీ భర్త లేదా బాయ్ ఫ్రెండ్ కి స్పెషల్ బర్త్ డే గా గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేయాలని భావిస్తున్నారా ? అయితే ఈ టిప్స్ ఫాలో అయిపోండి.

బర్త్ డేని చాలా స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు. అమ్మాయిలు, అబ్బాయిలు అందరికీ ఇదే ఆశ. అయితే తమ భాగస్వామి బర్త్ డేని చిరకాలం గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేసి సర్ ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేసేవాళ్లు కూడా ఉంటారు. కొంత మందికి పార్ట్నర్ బర్త్ డేని ఎలా ప్లాన్ చేయాలో తెలియని అయోమయ స్థితిలో ఉంటారు. అలాంటి వారు ఏం చింతించాల్సిన పనిలేదు. మీ పార్ట్న్ కి వారి బర్త్ డే ఓ మధురమైన జ్ఝాపకంగా నిలిచిపోవాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం...

 ముందుగా గుర్గుంచుకోవల్సినది:

ముందుగా గుర్గుంచుకోవల్సినది:

ముందుగా మీ భాగస్వామి పుట్టిన రోజు ఎప్పుడో గుర్తు పెట్టుకోండి. ఏంటీ ఎవరైనా భాగస్వామి బర్త్ డే కూడా మర్చిపోతారా? అని ఆశ్చర్యపోతున్నారా? మర్చిపోయే వారూ ఉండచ్చు. అలాంటి వాళ్ల కోసమే ఇదంతా..క్యాలెండర్ లో మార్క్ చేసుకోవడమో, మొబైల్లో రిమైండర్ పెట్టుకోవడమో...వంటివి చేయడం ద్వారా భాగస్వామి పుట్టిన రోజుని గుర్తు పెట్టుకోండి.

పార్టీతో సర్ ప్రైజ్:

పార్టీతో సర్ ప్రైజ్:

మీ పార్ట్నర్ కి ఎలాంటి వంటలంటే ఇష్టమో మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి, వారికిష్టమైన హోటల్లో వారికిష్టమైన వంటకాలతో ఓ పెద్ద పార్టీ ఏర్పాటు చేయండి. ఈ పార్టీకి మీ దగ్గరి స్నేహితుల్ని, బంధువుల్నీ పిలవండి. ఇవన్నీ మీ భాగస్వామికి తెలియకుండా చేయండి . మీరిద్దరూ ఆ రెస్టారెంట్ కి వెళ్లిన తర్వాత పార్టీకొచ్చిన వారందరినీ పిలిచి మీ భాగస్వామిని సర్ ప్రైజ్ చేయండి. ఇలా చేస్తే మీ భాగస్వామి సంతోషానికి అవధులుండవు.

అందమైన బహుమతి:

అందమైన బహుమతి:

మీ భాగస్వామికి బాగా ఇష్టమైందేదో మీకు తెలిసే ఉంటుంది. కాబట్టి వారికిష్టమైన వస్తువునే బహుమతిగా ఇవ్వండి. ఉదాహరణకి మీ భాగస్వామికి బంగారం అంటే ఇష్టమనుకోండి...బంగారంతో చేయించిన నగలను (రింగ్, చెయిన్..మొదలైనవి)బర్త్ డే గిప్ట్ గా అందివ్వొచ్చు,. ఇలా చేస్తే వాళ్ల సంతోషానికి పట్టపగ్గాలుండవు.

మీరొక్కరే..

మీరొక్కరే..

కొంతమంది కపుల్స్ అతిథులెవరినీ ఆహ్వానించకుండా ఇద్దరే ఏకాంతంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడమంటే ఇష్టం కావచ్చు. అలాంటి వారు వారికిష్టమైన హోటల్ కి వెళ్లో లేదా ఇంట్లో బాగా డెకరేట్ చేసుకునో వాళ్లకు నచ్చినట్లుగా బర్త్ డే జరుపుకోవచ్చు.

నచ్చిన ప్రదేశంలో :

నచ్చిన ప్రదేశంలో :

మీ పార్ట్నర్ పుట్టిన రోజు మరో నాలుగు రోజులుందనగానే ఆఫీసుకు సెలవు పెట్టి నచ్చిన ప్రదేశానికి వెళ్లి అక్కడ కూడా పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకోవచ్చు. లేదా వీకెండ్స్ లోనైనా వెళ్లొచ్చు. మీ భాగస్వామిని సర్ ఫ్రైజ్ చేయడానికి ఇది ఒక మార్గమే..

వెరైటీ గ్రీటింగ్ కార్డ్ తో :

వెరైటీ గ్రీటింగ్ కార్డ్ తో :

మీ భాగస్వామి పుట్టిన రోజుకు మంచి వెరైటీ గ్రీటింగ్ కార్డున్, అందమైన పూల బొకేను ఎంపిక చేసి, వాటితో పాటు ఏదైనా వాళ్లకిష్టమైన వస్తువుని కానుకగా ఇవ్వండి. చాలా సంతోషిస్తారు.

వన్ అవర్ కొకసారి గిప్ట్:

వన్ అవర్ కొకసారి గిప్ట్:

మీ భాగస్వామికి ఇష్టమైన గిప్ట్ లు చాలానే ఉంటాయి..?అందులో ఏది ఎంపిక చేసుకోవాలో అర్ధం కావట్లేదా? డోంట్ వర్రీ ,, మీదగ్గర అవన్నీ కొనేంత మనీ ఉంటే కొనేయండి . ఇవన్నీ పుట్టిన రోజు నాడు ఆయా సమయాన్ని బట్టి, అంటే గంటకొకసారి వెరైటీగా బర్త్ డే గిఫ్ట్ ను అందివ్వుండి.

మీ పార్ట్నర్ కు నచ్చిన రొమాంటిక్ సాంగ్స్ సిడీ రూపంలో అందివ్వండి:

మీ పార్ట్నర్ కు నచ్చిన రొమాంటిక్ సాంగ్స్ సిడీ రూపంలో అందివ్వండి:

మీరు ఇద్దరు హ్యాపీగా, జాలీగా గడిపిన క్షణాలన్నింటినీ.. కలిపి ఒక సీడీ రూపంలో ఇవ్వండి. అందులో రొమాంటిక్ సాంగ్స్, ఎఫెక్ట్స్ జతచేస్తే.. మీ పార్ట్ నర్ ఆనందానికి అవదులుండవు.

బర్త్ డే వీక్:

బర్త్ డే వీక్:

అలాగే మీ భాగస్వామి పుట్టిన రోజు వారం ముందు నుండే సెలబ్రేట్ చేయొచ్చు. అదెలాగంటే , పుట్టిన రోజు వారం ముందు నుంచే ఒక రోజు గిఫ్ట్ ఇవ్వడం, ఒక రోజు సినిమాకి వెళ్లడం, ఒక రోజు షాపింగ్ కి వెళ్లి తనకిష్టమైనవి కొనివ్వడం, ఇలా బర్త్ డే వీక్ జరుపుకుని బర్త్ డే రోజున తనకు బాగా ఇష్టమైన కోరికను నెరవేర్చారనుకోండి, ఇక మీరు సెలబ్రేట్ చేసినా పుట్టిన రోజుకి తిరుగుండదు. వారి కళ్ళలో ఆనందానికి అవధులుండవు.

Story first published: Friday, May 27, 2016, 17:00 [IST]
Desktop Bottom Promotion