Latest Updates
-
మీ పిల్లల్లో ఒబెసిటీ వేగంగా పెరుగుతుందా.. తల్లిదండ్రులు చేసే ఈ ఐదు పొరపాట్లే కారణం.! -
మటన్ పాయను కూడా మరిపించే వెజ్ పాయ.. ఒక్కసారి రుచి చూస్తే జన్మలో వదిలిపెట్టరు.! -
బాబా వంగా అంచనా: 2026 సెప్టెంబర్లో ఈ 4 రాశులపై కనకవర్షం ఖాయం! -
రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం.. ఎంత తిన్నా ఈజీగా బరువు తగ్గించే సొరకాయ చపాతీ.! -
అద్భుతం,అమోఘం..గోధుమపిండి లడ్డు ఇలా చేశారంటే తిరుగులేని బలం! -
భార్య తన భర్తకు రాఖీ కట్టవచ్చా? అసలు విషయం ఇదండీ.. -
ప్రోటీన్ రిచ్ బ్రేక్ ఫాస్ట్: బయట స్పాంజ్, లోపల ఘాటు..నోరూరించే పనీర్ చిల్లీ ఇడ్లీ ఎలా చేసుకోవాలంటే.. -
డెంగ్యూకి బొప్పాయి ఆకు రసం బ్రహ్మాస్త్రమా? ఇది తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయా? -
రక్తం పట్టడానికి, ఉక్కు లాంటి ఎముకల కోసం తప్పక తినాల్సిన పాత కాలం నాటి బలమైన స్వీట్.! -
తప్పేం లేదు.. ప్రశాంతంగా బతకాలంటే ఈ ఐదు అబద్ధాలు చెప్పడం నేర్చుకోవాల్సిందే.!
మీరు మీ భార్యతో ఎన్నడూ ఎందుకు వాదులాడకూడదో తెలుసా??
స్త్రీలు సహనంతో ఉండాలి అనుకునే రోజులు కావివి. ఈరోజుల్లో మగవారు సహనంతో ఉండాలి ఎందుకంటే ఈనాటి స్త్రీలు అనేక బాధ్యతలని ఏక కాలంలో నిర్వర్తిస్తూ ఒత్తిడికి గురి అవుతున్నారు.
వీటికి తోడు స్త్రీలకి సహజంగా ఉండే హార్మోన్ సమస్యలవల్ల ఒక్కోసారి వారు దిగ్గున లేస్తుంటారు.అందువల్ల స్త్రీలతో వాదించడం సమంజసం కాదు.తెలివైన పురుషుడెప్పుడూ కోపంలో స్త్రీ అన్న మాటలని పట్టించుకోడు.స్త్రీ అలా ఎందుకందో అందుకు దారి తీసిన పరిస్థితులేమిటో అర్ధం చేసుకోగలరు తెలివైన మగవారు.పైగా పోట్లాటలవల్ల లాభం లేకపోగా అందమైన వివాహ బంధం దెబ్బతింటుంది.
మీ ఆలోచనలని ఆమె మీద రుద్దడం లేదా ఆమెకి సహకరించకపోవడం లాంటి పనులు మీ వివాహ జీవితాన్నిమరింత జటిలం చేస్తాయి.ఇంకొక ముఖ్య విషయం ఇగో.ఈ ఇగో వల్లే ఒక్కోసారి వాదనలు మరింత పెరుగుతాయి. దీనివల్ల మన మనసు మరింత గాయపడే అవకాశం ఉంది.దీనిని కనుక మనం తప్పించుకోగలిగితే వివాహ బంధం ఎంత అందం గా ఉంటుందో.మీరు మీ భార్యతో వాదులాడటం నిష్ప్రయోజనం అని ఎందుకన్నామో చూద్దాము.

ఆమె ఎప్పటికీ అర్ధం చేసుకోలేదు:
ఒక వ్యక్తి కనుక వాదులాడే మూడ్‌లో ఉంటే వారు వారి భావాలని వ్రెళ్ళగక్కుతారు.ఆమె కనుక అలాంటి మూడ్‌లో ఉంటే కాం గా ఉండి ఆమెని మాట్లాడనివ్వండి.మీరు కూడా అప్పుడే ఎదురు దాడి మొదలెడితే ఆమె మీ పాయింట్ ని అర్ధం చేసుకోలేదు.

అపరిపక్వతకి గుర్తు:
మీరు ఇప్పుడు ఇంకా అబ్బాయి కాదు.ఇప్పుడు మీరు పరిపూర్ణమయిన మగవారు. అలాంటివారు పరిపక్వతతో వ్యవహరిస్తారు.తెలివైన పురుషులెప్పుడూ వృధా వాదనలు చేయరు.అందువల్ల మీ నాలుకని అదుపులో పెట్టుకుని ప్రశాంతంగా ఉండండి.

వాదన ఏ సమస్యకీ పరిష్కారం కాదు:
మానవ చరిత్ర అంతా పరిశీలించి చూసినా కూడా ఎక్కడా కూడా నిర్మాణాత్మక చర్చలు ఉపయోగపడ్డట్టుగా వాదనలు ఉపయోగపడ్డ దాఖలాలు లేవు.పైగా వాదనలవల్ల సున్నితమైన మానవ సంబంధాలు తెగిపోయే ప్రమాదం ఉంది.

మీరు ఆమెని ప్రేమిస్తున్నారా లేదా:
మీరు నిజంగా మీ భార్య ని ప్రేమించేవారయితే ఆమె కోణాన్ని కూడా అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ బంధం లో ఘర్షణ తగ్గి బంధం బలపడాలంటే ఆమె కూడా తన భావాలని వ్యక్తీకరించగలిగే స్వేచ్చనివ్వండి.



Click it and Unblock the Notifications