For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెళ్లి తర్వాత చేసుకుందాం ఫస్ట్ డేటింగ్ లో ఉందాం అంటున్నాడు, అందులో ఒకసారి పాల్గొన్నాం..

ఇంకొందరు డేటింగ్ అంటే కేవలం సెక్స్ గా భావిస్తారు. డేటింగ్ సమయం అంతా సెక్స్ కోసమే కేటాయిస్తారు. ఇది కూడా తప్పే. సో.. ఫస్ట్ మీరు డేటింగ్ పై అవగాహన పెంచుకుని దాని పరిధుల్లో ప్రవర్తిస్తే ఏ ప్రాబ్లం ఉండదు

|

ప్రశ్న : ఆఫీసులో నాకు ఒక అబ్బాయి పరిచయం అయ్యాడు. అతనిపై నాకు చాలా నమ్మకం ఉంది. నాకు చాలా గౌరవం ఇస్తాడు. నన్ను చాలా బాగా చూసుకుంటాడు. మేమిద్దరం గతంలో ఒకసారి అందులో పాల్గొన్నాం. అప్పటి నుంచి తనకు నాపై మరింత ప్రేమ పెరిగింది. మళ్లీ ఎప్పుడు అందులో పాల్గొందాం అంటూ గోల పెడుతున్నాడు.

నేను ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటున్నాను. అతను కాస్త సెటిల్ అయ్యాక అంటే ఒక ఏడాది తర్వాత పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. అంతవరకు డేటింగ్ లో ఉండాలనుకుంటున్నాం. దీంతో మా ఇద్దరి మధ్య ఒక అండర్ స్టాండింగ్ వస్తుంది. పెళ్లాయ్యాక కూడా హ్యాపీగా ఉండేందుకు అవకాశం ఉంటుందని నా అభిప్రాయం.

ఈ నిర్ణయం కరెక్టేనా

ఈ నిర్ణయం కరెక్టేనా

మేము తీసుకున్న ఈ నిర్ణయం కరెక్టేనా? డేటింగ్ లో అప్పుడప్పడు శారీరకంగా కలిస్తే ఏమైనా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందా? తనేమో ఎలాగో పెళ్లి చేసుకునేవాళ్లమే కదా కలిస్తే ఏమి కాదులే అని అంటున్నారు. నేను ఆ విషయంలో ఆయనకు సహకరించవచ్చా? దయజేసి సలహా ఇవ్వగలరు.

ఇష్టాలు మరొకరు తెలుసుకునేందుకు

ఇష్టాలు మరొకరు తెలుసుకునేందుకు

సమాధానం : ఈ కాలం జనరేషన్ పెళ్లికి ముందే ఒకరి అభిరుచులు మరొకరు.. ఒకరి ఇష్టాలు మరొకరు తెలుసుకునేందుకు ఏర్పరుచుకున్నదే డేటింగ్. అయితే ఇప్పుడు డేటింగ్ ను యూత్ మరో విధంగా వాడుకుంటుంది. ఇద్దరూ కలిసి ఉండడం, కలిసి తిరగడం వల్ల ఒకరిపై మరొకరికి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది.

విలాసవంతమైన జీవితం గడపడానికి

విలాసవంతమైన జీవితం గడపడానికి

అయితే కొందరు డేటింగ్ ను విలాసవంతమైన జీవితం గడపడానికి, ఆ సమయంలో బాగా డబ్బు ఖర్చు చేసి ఎంజాయ్ చేయడానికి వినియోగించుకుంటున్నారు. ఆ కొన్ని రోజులు బాగా ఎంజాయ్ చేశాక కూడా కొందరు విడిపోతూ ఉంటారు. అప్పుడు ఒకరి కోసం ఒకరు చేసుకున్న ఖర్చులను కూడా లెక్కించుకునేవాళ్లు ఉంటారు.

కేవలం సెక్స్ గా భావిస్తారు

కేవలం సెక్స్ గా భావిస్తారు

ఇంకొందరు డేటింగ్ అంటే కేవలం సెక్స్ గా భావిస్తారు. డేటింగ్ సమయం అంతా సెక్స్ కోసమే కేటాయిస్తారు. ఇది కూడా తప్పే. సో.. ఫస్ట్ మీరు డేటింగ్ పై అవగాహన పెంచుకుని దాని పరిధుల్లో ప్రవర్తిస్తే ఏ ప్రాబ్లం ఉండదు. అలాకాకుండా మీ బాయ్ ఫ్రెండ్ అడుగుతున్నాడని అతనితో శారీరక సంబంధాన్ని పెంచుకుంటే తర్వాత అతను హ్యాండ్ ఇస్తే మీ జీవితమే నాశనం అవుతుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మాత్రమే డేటింగ్ చేయండి. అది తప్పు కాదు. హద్దులు దాటితే మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటారు.

English summary

he is not ready for a relationship should i date with him

I am in love with him and willing to get into a serious relation. Here the story he is not ready for a relationship should i date with him. Readmore.
Desktop Bottom Promotion