Latest Updates
-
బంగాళాదుంప, పెరుగు ఈ రెండూ ఉంటే చాలు.. భోజనంలో ఎవర్ గ్రీన్ సైడ్ డిష్ రెడీ.! -
సన్నగా ఉన్నంతమాత్రాన ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉన్నట్లా.. ఫిట్‌నెస్‌పై అపోహలు, వాస్తవాలివే.! -
పిజ్జాను మించిన డబుల్ రుచితో చికెన్ పాన్ కేక్.. మైక్రోవేవ్ ఓవెన్‌తో పని లేదు.! -
రేపే నాగుల పంచమి.. ఈ రాశుల వారి జాతకంలో ఊహించని మార్పులు.! -
హోటల్ ఫుడ్ బాగాలేదని ఎలా తెలుసుకోవాలి.. రెస్టారెంట్‌కి వెళ్లినప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
Amir Khan Birthday : అమీర్ ఖాన్ రీల్ లైఫ్ లో మాత్రమే మిస్టర్ పర్ఫెక్టా? రియల్ లైఫ్ లో కూడానా?
అందుకే ఆయనకు ఇంత వయసు పెరిగినా ప్రేక్షకుల్లో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే..
బాలీవుడ్ లో మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకునే ఏకైక హీరో అమీర్ ఖాన్(Ameer Khan). సినిమా కోసం తన సర్వస్వం త్యాగం చేసేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎన్ని రిస్కులైనా చేయడానికి వెనుకాడరు. ప్రతి సినిమాలో పాత్ర డిమాండ్ చేస్తే చాలు తనను తాను మార్చుకోవడం అనేది అమీర్ ఖాన్ కు వెన్నతో పెట్టిన విద్య.

అంతేకాదు అచ్చం నిజ జీవితంలో ఎలా ఉంటుందో అలానే చూపించే ప్రయత్నం చేస్తాడు అమీర్ ఖాన్. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక కొత్తదనాన్ని చూపిస్తాడు. అందుకే ఆయనకు ఇంత వయసు పెరిగినా ప్రేక్షకుల్లో ఆదరణ ఏ మాత్రం తగ్గలేదు. వీటన్నింటి సంగతి పక్కనబెడితే.. మార్చి 14తేదీన అమీర్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రేమ కథ గురించి తెలుసుకుందాం...

రియల్ లైఫ్ లో..
1965 సంవత్సరంలో ముంబైలోని ముస్లిం కుటుంబంలో జన్మించిన అమీర్ ఖాన్ 1973లో యాడోన్ కి బారాత్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేశారు. తన తొలి సినిమా తర్వాతే అమీర్ తన ఇంటి సమీపంలోని రీనా అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడు.

హిందూ అమ్మాయి..
అమీర్ ఖాన్ ముస్లిం కుటుంబానికి చెందినవాడు.. ఆమె ప్రియురాలు రీనా మాత్రం హిందూ కుటుంబానికి చెందిన ఆమె. అయితే వీరిద్దరూ భిన్నమైన మతానికి చెందిన వారు అయినప్పటికీ, అచ్చం సినిమాలో లాగా నిజ జీవితంలో కూడా పెద్దలను, సమాజాన్ని ఎదిరించాల్సి వచ్చింది.

ప్రేమను నిరూపించుకునేందుకు
అమీర్ ఖాన్ తన ప్రేమను నిరూపించుకునేందుకు చాలా కష్టాలు పడ్డాడట. తొలుత వన్ సైడ్ లవ్ స్టార్ట్ చేసిన అమీర్ ఖాన్ తన ప్రేమ గురించి మీడియాలో వార్తలు రావడంతో ఆమెతో చివాట్లు తిన్నాడట. అయితే అమీర్ ఖాన్ తన ప్రయత్నం మానలేదు.

రక్తంతో ప్రేమ లేఖ..
అయితే అమీర్ ఖాన్ ఓసారి రక్తంతో ప్రేమ లేఖ రాశారంట. ప్రేమ గుడ్డిది అని అంటూ ఉంటారు కదా. అలానే అమీర్ ఖాన్ ప్రేమలో రీనా దత్తా గుడ్డిగా ప్రేమలో పడ్డారు.

రహస్య వివాహం..
అయితే వీరిద్దరూ తమ వివాహాన్ని చాలా రహస్యంగా చేసుకున్నారు. దీంతో వీరు చాలా మంది వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. అయినా కూడా వీరు ఏ మాత్రం భయపడకుండా కాపురాన్ని కొనసాగించారు.

16 ఏళ్ల తర్వాత..
అయితే వీరు పెళ్లి చేసుకున్న 16 ఏళ్ల తర్వాత విడిపోయారు. 2002 సంవత్సరంలో చట్టపరంగా విడాకులు తీసుకున్నారు. వీరు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. కానీ వీరి వైవాహిక జీవితం ఒక్కసారిగా కుదుపునకు లోనైంది. అయితే వీరి మధ్య ఇప్పటికీ ప్రేమ ఉందని చాలా మంది చెబుతుంటారు.



Click it and Unblock the Notifications