Latest Updates
-
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి?
బ్రేకప్ చెప్పడంలో నయనతార కొత్త రికార్డు.. తాజాగా తమిళ డైరెక్టర్ విఘ్నేష్ కు బ్రేకప్...!
నయనతార - విఘ్నేష్ మధ్య బ్రేకప్ కు సంబంధించిన రూమర్స్ కొత్త ఏమీ కాదు. వీరిద్దరూ ప్రేమలో పడిన సమయం నుండి ఎక్కడ చూసినా జంటగానే కనిపించేవారు.
నయనతార దక్షిణాది ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ సినిమాల్లోని రీల్ లైఫ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతన్న ఈ భామ.. రియల్ లైఫ్ లో నిత్యం వివాదస్పద వార్తల్లో నిలుస్తోంది.

తాజాగా ఆమె న్యూ ఇయర్ సందర్భంగా దిగిన ఫొటోలు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలను షేర్ చేసి చాలా మంది ఇలా అంటున్నారు. ముచ్చటగా మూడోసారి తమిళ దర్శకుడు విఘ్నేష్ నుండి విడిపోయిందని చెబుతున్నారు.
ఇందుకు కారణాలు కూడా చెబుతున్నారు. ఇటీవలే క్రిస్మస్ సందర్భంగా వారిద్దరూ కలిసి విదేశాలకు వెళ్లి సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే న్యూ ఇయర్ వచ్చేసరికి వారిద్దరూ విడి విడిగా ఫొటోలను షేర్ చేశారు. వారిద్దరూ విడి విడిగా సెల్ఫీ ఫొటోలను షేర్ చేస్తూ న్యూ ఇయర్ విషెస్ చెప్పుకున్నారు. అప్పుుడు దాని గురించి అంతగా ఎవ్వరూ పట్టించుకోలేదు.

అయితే తాజా పరిణామాలతో మాత్రం నయనతరాత మూడోసారి కూడా ప్రేమాయణం కథను కంచికి చేర్చిందనే ప్రచారం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది...

పెళ్లి విషయంలోనే..
వారిద్దరికి పెళ్లి విషయంలోనే మనస్పర్దలు వచ్చినట్టు తెలిసింది. వివాహం చేసుకునేందుకు నయనతార మరి కాస్త సమయం అడిగిందట. అయితే విఘ్నేష్ శివన్ ఇంట్లో మాత్రం పెళ్లికి తొందరపెడుతున్నారని అందుకే ఈ అమ్మడు బ్రేకప్ చెప్పినట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఎందుకో ఈ భామకు పెళ్లి విషయంలో మొదటి నుండి సమస్యలు ఎదురవుతూనే ఉన్నాయి.

అప్పట్లో శింబు..
గతంలో తమిళ హీరో శింబుతో ప్రేమాయణం నడిపిన ఈ భామ కొన్నేళ్లకే అతనికి బ్రేకప్ చెప్పింది. అతనితో ప్రేమలో ఉన్నప్పుడే వల్లభ సినిమాలో కూడా నటించింది. అప్పుడు వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఏమైందో ఏమో తెలియదు గాని సడెన్ శింబుకు బ్రేకప్ చెప్పేసింది.

ప్రభుదేవాతో ప్రేమాయణం..
శింబుకు బ్రేకప్ చెప్పిన తర్వాత ప్రభుదేవాతో ప్రేమాయణం మొదలుపెట్టింది ఈ అందాల భామ. అతనితో ప్రేమ కుదురుకుని పెళ్లి దాకా వచ్చేసరికి అతనికి బ్రేకప్ చెప్పేసింది. అలా తన ప్రేమ ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది.

ముచ్చటగా మూడోసారి..
ఇక మూడోసారి తమిళ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. తనతో ప్రేమలో ఉన్న సమయంలో తను ఎక్కడికి వెళ్లినా అతనితో జంటగా వెళ్లేది. తన ట్విట్టర్ పేజీలోనూ విఘ్నేష్ తో కలిసి ఎన్నో సెల్ఫీలు, వీడియోలను షేర్ చేసుకునేది.

తాజాగా దిగిన సెల్ఫీ..
అయితే తాజాగా తను మాత్రమే సింగిల్ ఫొటోలు దిగి ట్విట్టర్ పేజీలో షేర్ చేసింది. ఇవి చూసి అందరూ అనుమానపడ్డారు. ఈ ఫొటో వల్లే వీరి బ్రేకప్ కన్ఫార్మ్ అయ్యిందని సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇప్పటికే క్లారిటీ..
అయితే నయనతతార, విఘ్నేష్ ఇప్పటికే పలు సందర్భాల్లో వారి రిలేషన్ షిప్ పై క్లారిటీ ఇచ్చారు. తాము ఒకరిపై ఉన్నప్రేమను మరొకరు బాగా వ్యక్తపరచుకుని త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు చెప్పారు.

బ్రేకప్ రూమర్స్ కొత్తేం కాదు..
నయనతార - విఘ్నేష్ మధ్య బ్రేకప్ కు సంబంధించిన రూమర్స్ కొత్త ఏమీ కాదు. వీరిద్దరూ ప్రేమలో పడిన సమయం నుండి ఎక్కడ చూసినా జంటగానే కనిపించేవారు. అయితే మరి కొద్ది రోజుల్లో మూడు ముళ్లు వేసుకుంటారనుకుంటే.. అంతలోనే వారిద్దరి బ్రేకప్ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అయితే ఈ బ్రేకప్ వార్త తమిళ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నా వారిద్దరూ ఇంకా స్పందించలేదు. దీంతో ఈ రూమర్స్ కి మరింత బలం చేకూర్చినట్లు అయ్యింది.



Click it and Unblock the Notifications

