For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమ్మాయిలు అబ్బాయిలను ఆ విషయాల గురించి అస్సలు అడగకూడదంట... ఎందుకంటే...

|

ప్రపంచంలో పురుషులు, స్త్రీల మధ్య తేడాలు ఎప్పటికీ అలాగే ఉంటాయనేది బహిరంగ రహస్యం. అబ్బాయిలు, అమ్మాయిలు ఎప్పటికీ సమానం కాలేరు. అయితే అమ్మాయిల మనసును అబ్బాయిలు అర్థం చేసుకోరు. చేసుకోలేరు అని చాలా మంది చెబుతుంటారు. అయితే ప్రస్తుతం కాలం మారింది. పరిస్థితులు చాలా వేగంగా మారుతున్నాయి. ఇలా మారిన వాటిలో ప్రేమ కూడా ఒకటి. ప్రేమకు సంబంధించి అనేక విషయాలు ఎంతో మారిపోయాయి. ఇది వరకు అబ్బాయిలు అమ్మాయిలను ఫాలో అవ్వడం, ప్రేమలోకి దించడం, ప్రేమించడం వంటివి ఎక్కువగా జరిగేవి.

Never Beg a Man For These Things

కానీ ప్రస్తుతం ఈ సీన్ కాస్త రివర్స్ అవుతోంది. ప్రస్తుత కాలంలో అబ్బాయిల వెంట అమ్మాయిలు పడుతున్నారు. ఎందుకంటే పురుషుల్లో ప్రేమ పట్ల నిర్లక్ష్యం పెరుగుతోంది. అందుకే అమ్మాయిలు అబ్బాయిల నిర్లక్ష్యాన్ని మరియు బాధ్యతారాహిత్యాన్ని ప్రేమించటానికి మరియు భరించడానికి ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అయితే అమ్మాయిలు ప్రేమకు సంబంధించిన విషయాలలో అబ్బాయిలను ఎప్పటికీ ఇలాంటి విషయాలను అడగకూడదు. ఇంతకీ ఆ వివరాలేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తి చూసేయ్యండి...

గౌరవంగా చూసుకోవాలని..

గౌరవంగా చూసుకోవాలని..

అమ్మాయిలందరూ అబ్బాయిల గురించి ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. అది ఏంటంటే గౌరవంగా చూడమని. ఎందుకంటే మీరు ప్రవర్తించే విధానాన్ని బట్టి వారి ప్రవర్తన ఉంటుంది కాబట్టి. మీరు అదే పనిగా గౌరవం కావాలని కోరితే వారు మిమ్మల్ని అస్సలు పట్టించుకోరు. ఎందుకంటే వారు మీ కంటే బలంగా ఉంటారు. మీ మీద గౌరవం కలిగి ఉండటం అనేది మీ హక్కు. ముందుగా మీరు కరెక్టుగా ఉంటే వారు మీరు కోరుకున్నది చేయవచ్చు.

సందేశాలకు సమాధానం..

సందేశాలకు సమాధానం..

మీరు మీ ప్రియుడికి చేసే మెసేజ్ లకు సంబంధించి సమాధానం కోసం ఎదురుచూడటంలో తప్పులేదు. కానీ మీరు పంపిన ప్రతి మెసేజ్ కు వారి సమాధానం రాావాలని కోరుకుంటు మాత్రమే అది తప్పుగా మారొచ్చు. ఎందుకంటే వారికి అర్థవంతమైన పద బంధాలను రూపొందించ గల సామర్థ్యం లేని సందర్భంలో వారు సమాధానం పంపలేరు. అమ్మాయిల్లో ఎక్కువ మంది ముఖ్యంగా ప్రేమలో ఉన్నవారు పురుషుల నుండి ప్రతి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి నిద్రపోయేలోపు వీలైనన్ని మెసెజ్ లు పంపుతుంటారు. వాటికి రిప్లై ఆశిస్తుంటారు. ఇవన్నీ అబ్బాయిలకు ఆసక్తికరంగా అనిపించవు. అందుకే మెసెజ్ పంపమని మీరు మీ ప్రియుడిని ఎప్పుడూ అడగకూడదు.

నిజమైన ప్రేమికుడిని..

నిజమైన ప్రేమికుడిని..

మీ ప్రియుడు మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తుంటే, తప్పకుండా మిమ్మల్నే ఆరాధిస్తాడు. అబ్బాయిలు తమ ప్రియమైన వారిని మెచ్చుకోవడంలో ఆమె పట్ల ఉన్న ప్రేమను మనసారా అనుభవిస్తారు. ఇది నిజమైన ప్రేమికుడి యొక్కసంకేతం, కానీ అమ్మాయిలు ఇలాంటి వాటి గురించి మీ ప్రియుడిని ఎప్పుడూ వేడుకోవాల్సిన అవసరం లేదు. ఇది వారి కర్తవ్యం

ఎల్లప్పుడూ ప్రాధాన్యత..

ఎల్లప్పుడూ ప్రాధాన్యత..

మీ ప్రియమైన పురుషుడు మీకు ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇవ్వాలని మీరు వేడుకోకూడదు. మీ ప్రియుడిని ప్రాధాన్యత కోసం మీరు యాచించాల్సిన పరిస్థితిలో మీరు ఉంటే, మిమ్మల్ని ప్రేమించే అబ్బాయి కచ్చితంగా మీ జీవితంలో ఉండటానికి అర్హుడే కాదు. మిమల్ని తన ప్రాధాన్యతగా మార్చడానికి అతను సిద్ధంగా లేకుండా, మీరు అతని ఎంత ముఖ్యమో మీరే గ్రహించాలి. ఆ తర్వాత వారు తమను తాము మార్చుకుంటే, మీ ప్రేమ గురించి లోతుగా ఆలోచించే స్థితిలో మీరు ఉంటారు.

పాత వాటిని మరచిపోండి..

పాత వాటిని మరచిపోండి..

అమ్మాయిలు ఇది వరకే ఎవరికైనా బ్రేకప్ చెప్పేసి ఉంటే, వారు తమ గతాన్ని విడిచిపెట్టాలి. మీరు ప్రస్తుత ప్రియుడితో ఉన్నప్పుడు మీ మాజీ ప్రియుడిని మరచిపోవడానికి మీరు సిద్ధంగా లేరని అతనికి తెలిస్తే, అప్పుడు మీరు శృంగారాన్ని విడిచిపెట్టే క్షణంలో ఉన్నారని అర్థం. నిన్ను ప్రేమిస్తున్న మరియు వారి మాజీ ప్రియుడిని మరచిపోయే వ్యక్తులు మీ జీవితానికి అర్హులు కాదని అర్థం చేసుకోండి.

సంరక్షణ...

సంరక్షణ...

మీరు పని నుండి తిరిగి వచ్చినప్పుడు లేదా ఏదైనా చెడు జరిగినప్పుడు మీ సమస్యల గురించి చెప్పి లేదా మీ మాట వినమని మీ ప్రియుడిని అడగాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ప్రియుడు పరిస్థితిని, అతని మానసిక స్థితిని కూడా మీరు దృష్టిలో ఉంచుకోవాలి. అప్పుడే సంరక్షణ గురించి ఆలోచించాలి.

నిజాయితీని ఆశించడం..

నిజాయితీని ఆశించడం..

మీరు పురుషుల నుండి ఆశించకూడని వాటిలో ముఖ్యమైనది నిజాయితీ. ఎందుకంటే నిజమైన ప్రేమికుడు ఎల్లప్పుడూ అత్యంత నిజాయితీగా ఉంటాడు. మీ ప్రియుడికి అహం మరియు స్వార్థం ఎక్కువగా ఉంటే మీరు అతని నుండి నిజాయితీని ఆశించడం మీ పొరపాటే అవుతుంది. మీరు అలాంటి విషపూరితమైన పురుషుల నుండి ఎప్పటికీ నిజాయితీని ఆశించలేరు. ఒకవేళ అతను మిమ్మల్ని మోసం చేసి ఉంటే, అతనికి ఇంకెప్పుడూ మరోసారి కలయిక వంటి అవకాశాలను ఇవ్వకండి. ఎందుకంటే ఒకసారి మోసం చేసిన వ్యక్తులు మళ్లీ మళ్లీ మోసం చేయడానికి వెనుకాడరు.

English summary

Never Beg a Man For These Things

Here is the list of things women should never beg from man. Read on
Story first published: Wednesday, November 27, 2019, 16:05 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more