Just In
- 13 hrs ago
మామిడి పండ్లను తిన్న వెంటనే ఇవి తినడం శరీరానికి ప్రమాదకరం; వీటిని అస్సలు తినకండి
- 14 hrs ago
18 సంవత్సరాల తరువాత, ఐదు గ్రహాలు సరళ రేఖలో కనిపిస్తాయి, ఈ అద్భుతమైన దృశ్యాన్ని మీరు మిస్ చేయకుండా చూడండి
- 15 hrs ago
మీకు చాలా జుట్టు ఊడుతుందా? ఐతే ఈ ఆకులను వాడండి...తిరిగి జుట్టు పెరుగుతుంది!
- 17 hrs ago
పంటి నొప్పిని త్వరగా తగ్గించుకోవడానికి ఉల్లిపాయ ముక్క
Don't Miss
- News
ఎమర్జెన్సీ భారత ప్రజాస్వామ్యానికి మాయని మచ్చ: జర్మనీలో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
- Travel
విజయవాడ టు కొండపల్లి.. ప్రయాణపు ముచ్చట్లు! రెండవ భాగం
- Sports
Rain Stopped Ind vs Ire 1st T20: ఈ ఐర్లాండ్ వెదర్ ఉందే.. ఎప్పుడు ఎలా ఉంటదో ఎవడికీ తెలీదు.. నెటిజన్లు ఫైర్
- Finance
భారీగా పతనమైన క్రిప్టో మార్కెట్, 27% ఉద్యోగుల్ని తొలగించిన ఈ ఎక్స్చేంజ్
- Movies
మెగాస్టార్ సినిమాలో విలన్ గా మలయాళ స్టార్.. తమిళ నటుడు హ్యాండ్ ఇవ్వడంతో?
- Technology
Noise నుంచి బడ్జెట్ ధరలో సరికొత్త వైర్లెస్ ఇయర్‌ఫోన్స్ విడుదల!
- Automobiles
వరుణ్ ధావన్ గ్యారేజిలో చేరిన మరో కొత్త లగ్జరీ కార్.. ఇదే: మీరూ చూడండి
విటుడిగా వచ్చిన కుర్రాడు వ్యభిచారిణిని వివాహం చేసుకున్న కథ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం ఖాయం...!
ఆ యువకుడు పేరు సురేష్ (పేరు మార్చాం). అతనికి ఆడవారు అంటే కేవలం ఆ కార్యానికే అని భ్రమలో ఉంటాడు. ఆ యువకుడు ఆరడుగుల ఎత్తుతో అందంగా, సిక్స్ ప్యాక్ బాడీ మెయింటెయిన్ ఎంతటి అందగత్తెలను, అప్సరసలను అయినా ఇట్టే ఆకర్షించేవాడు. మోజు తీరాక వారిని వదిలించుకునేవాడు. అదేంటో గానీ ఈ యువకుడిని చాలా మంది యువతులు గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నమ్మేవారు. కానీ ఒక అమ్మాయి తన ఆఫీసులో తారసపడుతుంది. ఆమె అచ్చం దివిలో నుండి దిగివచ్చిన తారలాగా కనిపిస్తుంది.
అంతే ఆ యువకుడి మనసు మొత్తం అప్పటి ఆ అమ్మాయి చుట్టే తిరుగుతూ ఉంటుంది. అతను ఆమె కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని వేషాలు ఆమె అతడిని పట్టించునేది కాదు. అయితే ఎలాగోలా ఆమెను ఆ కుర్రాడు ధైర్యం చేసి ఆమెకు ఆ విషయం గురించి అడుగుతాడు. ఆమె ఏ మాత్రం కోపం పడకుండా నవ్వుతూ సమాధానం ఇస్తుంది. దీంతో ఆ యువకుడు ఆశ్చర్యపోతాడు. ఇంత ఈజీగా ఒప్పుకుంటుందని కలలో కూడా ఊహించలేదని చెబుతాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఆ యువతిని దేని గురించి అడిగాడు. ఆ కుర్రాడు ఎందుకు మారిపోయాడు.. వంటి విషయాలను తెలుసుకునేందుకు ఈ స్టోరీని పూర్తిగా చూడండి...

1) అందాల తార...
అందరినీ అవలీలగా వలలో వేసుకునే ఆ యువకుడికి అప్పటిదాకా ఆ అందమైన అప్సరస గురించి తెలీదు. కానీ ఓ రోజు ఆ యువకుడి కంట ఆ అందమైన అప్సరస కనిపిస్తుంది. అంతే ఆరోజు నుండి గురుడు ఆమెను ఎలా తన బుట్టలో పడేయాలా చేయని ప్రయత్నం అంటూ ఉండదు. అలా ఆఫీసులో ఉండే ఓ గుమాస్తాను దీనికి సంబంధించి ఒక సహాయం అడుగుతాడు.

2) అప్సరసను ఆ విషయం గురించి అడిగేస్తాడు...
ఆ గుమాస్తాకు ఒక బలహీనత ఉంటుంది. అతనికి మందు చుక్క, చికెన్ ముక్కను ఏర్పాటు చేస్తే వాడు ఎంతటి నీచమైన పనికి అయినా సహాయం చేస్తాడు. అలాగే ఆ అందమైన పటాయించడంలో ఆ యువకుడికి సహాయం చేస్తాడు. ఆ గుమాస్తా సహాయం మేరకు ఆ యువకుడు ఆ అప్సరసను నేరుగా వెళ్లి తనకు ఆ విషయంలో ఒక అవకాశం ఇస్తావా అని అడిగేస్తాడు.

3) ఇంటికి ఆహ్వానిస్తుంది...
ఆ మాటకు ఆ అప్సరస చిన్న చిరునవ్వు నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ యువకుడికి ఏమి అర్థం కాదు. ఆ నవ్వుకు అవునని అర్థమా? లేదా కాదని అర్థమా తెలుసుకోవడానికి సతమతమవుతుంటాడు. కానీ అంతలోనే ఆ అందమైన అమ్మాయే ఆ యువకుడి దగ్గరికి వచ్చి తన ఇంటికి రమ్మని ఆహ్వానిస్తుంది.

4) ఆదివారం ఆవేశంగా...
అంతసేపు తీవ్రంగా తికమకపడ్డ ఆ యువకుడు ఒక్కసారిగా కోలుకొని ఎప్పుడు రమ్మంటారు అని ఆ అందమైన అమ్మాయిని అడుగుతాడు. ఆమె రేపు ఆదివారం కదా రేపే వచ్చేయండి అని చెబుతుంది. అంతేకాదు తన ఫోన్ నెంబర్, చిరునామా సైతం ఇస్తుంది. ఇక మంచి ఆవేశంలో ఉన్న ఆ యువకుడు తన ఇంటికి టిప్ టాప్ గా రెడీ అయి వెళతాడు.

5) స్నానం చేసొస్తా.. స్నాక్స్ తీసుకోండి...
ఆ అందమైన అమ్మాయి తలుపు తీసి లోపలికి రమ్మని ఆహ్వానిస్తుంది. మళ్లీ ఆశ్చర్యపోయిన యువకుడు లోపలికి వెళతాడు. అక్కడ ఆ యువకుడికి మరో షాక్ తగులుతుంది. అక్కడుండే హాలులో అన్ని రకాల లిక్కర్ బాటిల్స్ రెడీగా ఉంటాయి. అలాగే స్నాక్స్ సైతం అందుబాటులో ఉంటాయి. ఇక వెంటనే పని కానిచ్చేద్దామని అనుకుంటాడు. కానీ ఆ అమ్మాయి స్నానం చేసి వస్తాను కాసేపు వెయిట్ చేయండి అని చెబుతుంది. సరే అని వెయిట్ చేస్తాడు.

6) బెడ్ రూమ్ డెకరేషన్...
స్నానం చేసి వచ్చిన ఆ అమ్మాయి అందమైన చీర, తెల్లటి మల్లెపూలు, సుగంధ పరిమళాలలు వెదజల్లే స్ప్రేలు జల్లి బెడ్ రూమ్ ను అలంకరించి అతని కోసం అన్ని సిద్ధం చేస్తుంది. తర్వాత ఆ యువకుడిని పిలుస్తుంది. అక్కడికి వెళ్లిన యువకుడు మళ్లీ అవాక్కవుతాడు. అంతలోనే సరే ఘట్టం మొదలుపెడదామా అని అడుగుతాడు.

7) అప్పుడు మొదలవుతుంది అసలు కథ..
అప్పుడు ఆ అందమైన ఓ అమ్మాయి ఒక చిన్నకథను చెబుతాను వింటారా అని అడుగుతుంది. సరే అంటాడు ఆ యువకుడు. తాను స్కూలుకు వెళ్లే రోజుల్లో తన పట్ల ఆమె మామయ్య అసభ్యంగా ప్రవర్తించే వాడు అని చెబుతుంది. దీని గురించి ఓసారి వాళ్ల అమ్మకు చెబితే వాళ్ల మామయ్యను పట్టుకుని అలాంటి మాటలు మాట్లాడతావా? ఆయన దేేవుడితో సమానం అని, ఆయన పాఠాలు చెప్పే టీచర్ అని తననే తిడుతుంది. మరోసారి తన తండ్రికి ఈ విషయం గురించి చెబితే ఆయన కూడా తన కూతురినే తిడతాడు. పైగా ఆ పంతులుకి కోపం ఎక్కువ. చీటికి మాటికి భార్యతో గొడవ పెట్టుకుంటాడు. తనని పుట్టింటికి పంపుతాడు.

8) మొగ్గని నలిపినట్టు..
అప్పటి నుండి నాపై మళ్లీ అసభ్యకరంగా ప్రవర్తిస్తాడు. అలా నాకు ఎంత నొప్పి కలిగినా తను చేసేదంతా చేసేస్తాడు. అలా ఒకరోజు నేను పుష్పావతి అవుతాను. అయినా కూడా తన ఆరాటం తనదే కాబట్టి తనని మొగ్గని నలిపినట్టు నలిపేస్తాడు. ఆ విషయం ఒకరోజు ఆయన భార్యకు తెలుస్తుంది. ఆమె కూడా ఆ అమ్మాయినే అపార్థం చేసుకుని మా ఆయన్నే వలలో వేసుకుంటావా? విద్యా బుద్ధులు నేర్చుకోమంటే నువ్వు చేసే పని ఇదా అని నానా చీవాట్లు పెట్టి మెడబట్టి బయటకు గెంటివేస్తుంది.

9) తాను చెడిపోయినట్టు ప్రచారం...
అంతేకాదు అందరి ముందు తానే తప్పు చేశానని, తన శీలం పోయిందని, తాను చెడిపోయానని అందరికీ ప్రచారం చేస్తుంది. అక్కడుండే వారంతా అదే నిజమని నమ్ముతారు. ఆ సమయంలో ఆ అమ్మాయి చాలా మదనపుడుతుంది. నన్ను ఒకడు ఇలా అనుభవించాడని తెలిస్తే తనను పెళ్లి ఎవరు చేసుకుంటారు అని బాధపడుతుంది. అప్పుడే ఆమె ఒక గట్టి నిర్ణయం తీసుకుంది.

10) వ్యభిచారం చేసి సహాయం..
ఎవరైతే నేను చెడిపోయాను అన్నారో, ఎవరైతే నన్ను వ్యభిచారిని అన్నారో అదే పని చేసి నలుగురికి నేను ఎందుకు సహాయం చేయకూడదు అని ఆలోచిస్తుంది. ఆ ఆలోచనను అప్పటి నుండే ఆచరణలో పెట్టేస్తుంది. అలా అప్పటి నుండి తనకు చేతనైంత సహాయం చేస్తుంది. ఇదంతా ఎవరి కథో కాదు. నా కథే అని ఆ అందమైన అమ్మాయి ఆ యువకుడికి చెబుతుంది. ఇందుకోసమే ప్రతిరోజూ నేను ఆఫీసుకు ఆలస్యంగా వస్తూ ఉంటాను. ఇప్పటివరకు నేను ఒకరికి గుండె ఆపరేషన్ చేయించాను. ఒకరికి ఉద్యోగం ఇప్పించాను. రేపు కూడా నాకు తెలిసిన ఓ నిరుపేదకు కిడ్నీ ఆపరేషన్ ఉంది. అర్జెంటుగా ఆరు వేల రూపాయలు కావాలి. అని చెబుతుంది.

11) తన కొత్త జీవితం..
అంతే ఆ యువకుడికి దిమ్మ తిరిగిపోతుంది. ఆ తర్వాత అందమైన అప్సరస పని మొదలుపెట్టి నాకు ఆ డబ్బు సహాయం చేయమని అడుగుతుంది. కానీ ఆ యువకుడు తన జేబులో నుండి డబ్బు తీసి బెడ్ పైన పెట్టి మారు మాట మాట్లాడకుండా వెళ్లిపోతాడు. అలా ఆ యువకుడి జీవితంలో ఊహించని సంఘటన ఎదురై తన జీవితాన్నే మార్చేస్తుంది. అప్పటి నుండి ఆ యువకుడు అసాంఘిక కార్యకలాపాలన్నీ మానేస్తాడు. ఏకంగా ఆ అమ్మాయినే వివాహం చేసుకుని, తనకు కొత్త జీవితాన్ని ఇస్తాడు.