Latest Updates
-
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు!
ఆదిలాబాద్ టు అమెరికా వరకూ సాగిన ప్రేమాయాణం... చివరికి ఏమైందంటే...!
రెడ్ లైట్ ఏరియా నుండి వచ్చిన ఓ లేడీ ప్రేమ కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మనలో చాలా మంది జీవితాలలో అప్పుడప్పుడు అద్భుతాలు జరుగుతుంటాయి... అలాగే అనుకోని సంఘటనలు మనల్ని కలవరపెడుతుంటాయి.. అలాంటి సంఘటనలు మనకు చేదు జ్ణాపకాల్ని మిగులుస్తాయి..

అయితే కొన్నిసార్లు విచిత్రంగా మనకు తెలియకుండానే... మనం ఏదైతే కోల్పోతామో.. వాటి కంటే రెట్టింపు లాభాలు కూడా పొందుతుంటాం. అదే సమయంలో దైవం మనతో ఉన్నట్లు కూడా అనిపిస్తుంది..

ఈ మొట్టమొదటి ప్రేమ కథను వింటే మీరు కూడా ఈ మాటను కచ్చితంగా నమ్మితీరుతారు. మనకు ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ.. అవి మన భవిష్యత్తును మాత్రం నిర్ధారించలేవు.

ఇది అక్షరాల నిజమని నిరూపించింది ఓ రెడ్ లైట్ ఏరియాకు చెందిన ఓ అమ్మాయి ప్రేమ కథ. పడుపు వృత్తి నుండి బయటపడి.. ప్రకాశవంతమైన జీవితంవైపు అడుగులు వేసిన ఓ పల్లెటూరి అమ్మాయి జీవితం ఇది. తన పేరు చెప్పకుండా తన జీవితంలో జరిగిన విచిత్రమైన సంఘటనలను వెల్లడించిన ఆ అమ్మాయి కథ నిజంగానే ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. ఆమె చెబుతున్న మాటలు ఎంతో ఆసక్తికరంగానూ... చాలా చోట్ల సినిమాల్లో ఉండే ట్విస్టులను తలపిస్తున్నాయి... ఆ వివరాలేంటో మీరూ చూసేయండి మరి...

పల్లెటూరి అమ్మాయి..
నేను ఆదిలాబాద్ జిల్లాలోని పల్లెటూరికి చెందిన అమ్మాయిని. నాకు పదేళ్ల వయసులోనే మా అమ్మ, నాన్న చనిపోయారు. నేను రెండో తరగతి వరకే చదువుకున్నాను. మా అమ్మ నాన్న చనిపోయాక.. మా దూరపు బంధువులు నన్ను వాళ్ల ఇంటికి తీసుకెళ్లారు. వారు నాకు అత్త, మామలు అవుతారు.

హైదరాబాద్ వచ్చాక..
వాళ్లు కొద్దిరోజుల పాటు అక్కడే ఉండి హైదరాబాద్ మహానగరానికి తీసుకొచ్చారు. అక్కడికొచ్చాక నాకు అసలైన సినిమా కనిపించింది.. అప్పుడే అన్ని సమస్యలు ఒకదాని వెంట ఒకటి వచ్చి పడ్డాయి.. నేను ఆ ఇంట్లో ఉండటం అత్తకు అస్సలు ఇష్టం లేదు.

పశువు కంటే హీనంగా..
నన్ను నిత్యం కొడుతూ.. తిడుతూ ఉండేది. నన్ను కనీసం పాఠశాలకు కూడా పంపలేదు. అంతేకాదు రాత్రిళ్లు నిద్ర కూడా పోనీయకుండా పని చేయించుకునేది. ఒక్క మాటలో చెప్పాలంటే పశువు కంటే హీనంగా చూసేది.

ఓ రోజు మామయ్య..
ఇక మామయ్య నాతో బాగానే ఉండేవాడు. ఓ రోజు నన్ను ఒక చోటుకు తీసుకెళ్లాడు. అక్కడి వ్యక్తులతో కలిసి కొన్ని రోజుల పాటు ఉండమన్నాడు. కానీ అతను నన్ను అమ్మకానికి పెట్టినట్టు, అందుకే అక్కడకు తీసుకెళ్లడాని నాకు ఆలస్యంగా అర్థమైంది.

వినకుండా వదిలేళ్లాడు..
అయితే అది ఒక రెడ్ లైట్ ఏరియా అనే విషయం మాత్రం నాకు త్వరగానే తెలిసిపోయింది. కారుచీకట్లో దుర్వాసన వస్తోందని... అక్కడ నేను ఉండలేనని మామయ్య కాళ్లు పట్టుకుని బతిమిలాడిన తను కనికరం చూపలేదు. నా మాట వినకుండా నన్ను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు.

రత్నమ్మత్త ప్రేమగా..
అయితే అక్కడ రత్నమ్మత్త నాతో చాలా ప్రేమగా మాట్లాడింది. మా అమ్మ తర్వాత నాతో అంత ప్రేమగా మాట్లాడిన వ్యక్తి తనొక్కటే. ‘నువ్వు బాధపడొద్దు. ఈరోజు నుండి ఇక్కడ నువ్వు సంతోషంగా ఉండొచ్చు. నువ్వు ఇక్కడి నుండి పోదామనుకుంటే.. నువ్వు బాధపడుతున్నావని తెలిస్తే వాళ్లు నిన్ను చిత్రహింసలు పెడతారు. కాబట్టి 18 సంవత్సరాలు వచ్చే వరకూ ఇక్కడే ఉండు ఆ తర్వాత నీతో స్వయం ఉపాధి కల్పించడం లేదా నిన్ను వేరే వాళ్లకు అప్పగించడం వంటివి చేస్తా'నని చెప్పింది.

రెండేళ్లు గడిచిపోయాయి..
అలా చూస్తుండగానే రెండు సంవత్సరాలు గడిచిపోయాయి. నేను కూడా నా పరిస్థితిని అర్థం చేసుకుని వారితో ఆనందంగా ఉన్నట్లు జీవించడం ప్రారంభించాను. అయితే ఈ కొద్దిపాటే సమయంలోనే నేను చదువుకోవాలనుకున్నా.. రేపటి గురించి ఆలోచించి.. ఈరోజును నాశనం చేసుకోదలచుకోలేదు.

నా ఆనందానికి అవధుల్లేవు..
నా కోరికను రత్నమ్మత్తకు చెప్పాను. ఆమె మా దగ్గరికి వచ్చే ఓ సోషల్ వర్కర్ కి చెప్పి, వారి సంస్థలో నేను చదువుకోవడానికి ఏర్పాటు చేసింది. అప్పుడు నా ఆనందానికి అవధుల్లేవు. అక్కడ నాకు చదువు చెప్పే వారిలో కుశాల్ కూడా ఒకరు. ఆయన పిహెచ్ డీ చేస్తూ సోషల్ వర్కర్ గా పని చేస్తున్నారు.

ఆ పరిచయం..
ఆయన నాకు పాఠాలు చెబుతున్న సమయంలో.. అతనితో ఏర్పడిన పరిచయం నా జీవితాన్ని మార్చేస్తుందని నేను అస్సలు భావించలేదు. అక్కడ తనతో పాటు మరో నలుగురైదుగురు మాస్టర్లు ఉన్నారు. వారంతా నాలాంటోళ్లకు చదువు చెబుతుంటారు. ఒకే ఏడాదిలో ఐదు సంవత్సరాల చదువు చెప్పేసి.. అక్కడే టెన్త్ క్లాస్ పరీక్షలు రాయిస్తారు. ఆ తర్వాత ఇంకా ఉన్నత చదువులు చదవడానికి స్కాలర్ షిప్ కూడా అందేలా చూస్తారు.

ఈ లోగా కుశాల్ తో ప్రేమలో..
అలా నేను పదో తరగతి పరీక్షలు రాశాను. ఈలోగా కుశాల్ పై నాకు ప్రేమ మొదలైంది. ఆయనతో ఎప్పుడూ అలా మాట్లాడుతూనే ఉండిపోవాలనిపించేది. ఈలోపు నా ఇంటర్ పరీక్షలు వచ్చేశాయి. ‘నేను ఈ పరీక్షలు బాగా రాస్తే.. నేను అడిగింది ఇస్తా' అని కుశాల్ చెప్పాడు. నేను తన మాట ప్రకారం బాగా చదివి ఎక్కువ మార్కులతో పాటు అమెరికాలో చదువుకోవడానికి స్కాలర్ షిప్ కూడా సంపాదించాను.

చిత్రమేమిటంటే...
నేను ఏ యూనివర్సిటీలో చదవడానికి స్కాలర్ షిప్ పొందానో.. కుశాల్ కూడా అక్కడే రీసెర్చ్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఇంటి నుండి బయటకు రావడానికి కుశాల్ పని చేస్తున్న ఎన్జీఓ నాకు ఎంతగానో తోడ్పడింది. నేను వెళ్లిపోతున్న సమయంలో రత్నమ్మత్త బాగా ఏడ్చేసింది. ఆ తర్వాత నేను అమెరికా వెళ్లిపోయాను'

ప్రపోజ్ చేశాను..
ఆ తర్వాత మేమిద్దరం అమెరికా వెళ్లే ముందు కుశాల్ ‘నీకేం కావాలి' అని అడిగినప్పుడు నేను బదిలిస్తూ ‘నువ్వే కావాలి' అని బదులిచ్చాను. తనకు ఒక్క క్షణం ఏమి అర్థం కాలేదు. అందుకే స్పష్టంగా ‘ఐ లవ్ యూ' అంటూ తనకు ప్రపోజ్ చేశాను. అయితే ఈ విషయం చెప్పడానికి నేను చాలా భయపడ్డాను. కానీ ధైర్యం కూడగట్టుకుని చెప్పా. కానీ తన రిప్లై విని.. నేను చాలా బాధపడ్డా.

చాలా ఏడ్చాను..
నేను ప్రపోజ్ చేసిన వెంటనే ‘నీ లాంటోళ్లు చేతి వేలు అందిస్తే.. ఇంకేదో పట్టుకోవాలనుకుంటారు. నీలాంటోళ్లు కేవలం ఆనందం పొందేందుకు మాత్రమే కానీ పెళ్లికి పనికి రారు' అని మోహం మీదే చెప్పాడు. ఆ మాటల్ని విని నేను తట్టుకోలేకపోయాను. అది వినగానే ‘నేను నా తాహతుకు మించి అడిగానేమో' అనిపించింది. నాలాంటోళ్లు ప్రేమకు ఎందుకు పనికిరారు? నేనేం తప్పు చేశాను.. అంటూ ఆరోజు చాలా ఏడ్చాను.

ఉద్యోగం సంపాదించాను..
ఆ తర్వాత నేనంటే ఏంటో నిరూపించుకునేందుకు అమెరికా వెళ్లాను. కానీ తనను మాత్రం మరచిపోలేకపోయా. దీనికి తోడు తను కూడా అదే యూనివర్సిటీలో రీసర్చ్ చేస్తుండటంతో మేమిద్దరం ఎదురెదురు ఫ్లాట్లల్లోనే ఉండేవాళ్లం. తనకు నేంటే ఏంటో నిరూపించి నాలాంటి వాళ్లు కూడా జీవితంలో అన్నీ సాధించగలరని.. కష్టపడి చదివా.. మంచి మార్కులతో పాసవ్వడమే కాకుండా.. మంచి ఉద్యోగం కూడా సంపాదించాను.

ఇండియాకొచ్చాక ట్విస్ట్..
నేను ఇండియాకొచ్చాక నేను కలలో కూడా ఊహించని ట్విస్ట్ ఎదురైంది. రత్నమ్మత్త బ్యాండ్ బాజాతో నన్ను రిసీవ్ చేసుకుంది. ఆ తర్వాత కుశాలే నన్ను ప్రేమిస్తున్నాని చెప్పాడు. అయితే నా ప్రేమను ముందే స్వీకరిస్తే.. నేనెక్కడ చదువుకు స్వస్తి చెప్తానో.. స్కాలర్ షిప్ కూడా ఎక్కడ వదిలేస్తానో అని అబద్ధం చెప్పాడట. అప్పుడు నన్ను తక్కువ చేసి మాట్లాడినందుకు క్షమించమని కోరాడు. ఆ తర్వాత మేమిద్దరం కలిసి పెళ్లి చేసుకున్నాం. మాకు ఇప్పుడో ఓ పాప కూడా ఉంది. నేను ఉద్యోగంతో పాటు సోషల్ వర్క్ కూడా చేస్తున్నా. అలా రెడ్ లైట్ ఏరియాకు చెందిన అమ్మాయిల జీవితంలో వెలుగు నింపేందుకు ప్రయత్నిస్తాం..



Click it and Unblock the Notifications











