Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
శృంగార సమస్యలు వీటి వల్ల కూడా వస్తాయని తెలుసా...!
మీ అరచేతిలో ఈ లైన్లుంటే మీరు ఎలాంటి రొమాంటిక్ సమస్యలను ఎదుర్కొంటారో చూడండి.
హస్త సాముద్రిక శాస్త్రం మన చేతుల్లో ఉండే రేఖలు మన జీవితాలను ప్రభావితం చేస్తాయని చాలా మంది నమ్ముతారు. మన అరచేతిలో ఉండే ఒక్కో రేఖ ఒక్కో విషయాన్ని సూచిస్తుంది. ఒకటి పెళ్లి రేఖను సూచిస్తే.. మరొకటి ధన రేఖల వంటివి సూచిస్తుంటాయని పండితులు చెబుతుంటారు.

అయితే దీని ప్రకారం వ్యక్తులలోని అరచేతిలో ఉండే ఇలాంటి రేఖల వల్ల శృంగార సమస్యలు కూడా వస్తుంటాయట? మీ అరచేతిలో ఉండే ఈ గుర్తులు మీ శృంగార సమసల్ని మరింత రెట్టింపు చేసే అవకాశం ఉందట.

మరో విశేషం ఏంటంటే..పిల్లలకు సంబంధించిన విషయాలల వారికి మంచిగా పరిగణించని కొన్ని గుర్తులు కూడా ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా ప్రెగ్నెన్సీ ఉండేవారు గర్భధారణ సమయంలో ఈ గుర్తులను బాగా గుర్తుంచుకోవాలంట. ఇంతకీ మన చేతిలో ఉండే ఏయే రేఖలను బట్టి ఎలాంటి సమస్యలు ఎక్కువగా వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..

అరచేతిలో అక్కడుంటే..
హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం. ఎవరైనా వ్యక్తులకు అరచేతిలో హ్రుదయ రేఖ శని పర్వతానికి కింది భాగంలో విడిపోయినట్లు ఉంటే వారికి శృంగార కలలు ఎక్కువగా వస్తాయి. అంతేకాదు వీరి జీవనరేఖ దగ్గర బోటనవేలి నుండి ప్రారంభమైతే.. అలాంటి వ్యక్తులకు శృంగారపరమైన లైంగిక సమస్యలు మరింత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడిని సంప్రదిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. లేకపోతే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది.

అశుభంగా పరిగణిస్తారు..
హస్తసాముద్రిక శాస్త్రం అరచేతిలో శుక్ర పర్వతం లాంటి ప్రదేశంలో సిరలు కనిపిస్తే దానిని అశుభంగా పరిగణిస్తారు. ఇలాంటి రేఖలు ఉండే వ్యక్తులు ఎక్కువగా శృంగార సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది. మరోవైపు మహిళల చేతుల్లో ఇలాంటివి కనిపిస్తే.. వారికి ల్యూకోరియా సమస్య ఉందని చెబుతారు. దీని కారణంగా ఆడవారు, మగవారి మధ్య శృంగార సమస్యలతో పాటు వివిధ రకాల దీర్ఘకాలిక వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉందని పండితులు చెబుతారు.

మణికట్టు దగ్గర..
హస్త సాముద్రిక శాస్త్రం ప్రకారం, మీ చేతి మణికట్టు దగ్గర ఒక ద్వీపం లాంటిది ఏర్పడితే, దాన్ని శుభసూచికంగా పరిగణించకూడదు. ఆడవారి అరచేతిలో ఉండే ఇలాంటి సంకేతాల వల్ల మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంతేకాదు జీవనరేఖ, చంద్ర పర్వతం వైపు మళ్లితే.. అండాశయం, మూత్ర సమస్యలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశముందని చాలా మంది నమ్ముతారు. అలాగే శృంగార సమస్యలు కూడా వస్తాయట.

లైంగిక సామర్థ్యం చూపకపోవడం..
హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం, అరచేతిలోని జీవనరేఖ లేదా లైఫ్ లైన్ అనేది చంద్రుని పర్వతం వైపు తిరిగి ఉంటే ఆ పరిణామాన్ని ప్రతికూలంగా భావిస్తారు. అలాగే అరచేతిలోని ఈ లైను వల్ల మీరు లైంగికంగా తగిన సామర్థ్యం చూపించలేకపోవడం లాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలకు వైద్యుడిని సంప్రదిస్తే, కచ్చితంగా దానికి తగిన పరిష్కారం కనుగొనవచ్చు. మనుషులు తమ కర్మల ద్వారా తమ లక్ ను మార్చుకోవచ్చని కూడా హస్తసాముద్రికం చెబుతోంది. అందుకే ఎందులో మీకు ఏవైనా సమస్యలుంటే, వాటిని ముందుగానే గుర్తించి, అందుకు తగిన పరిష్కారం చూపుకోవాలి.

శృంగార సామర్థ్యంపై ప్రభావం..
ప్రస్తుతం లాక్ డౌన్ వంటి జీవితంలో గడుపుతున్న ప్రతి ఒక్కరిపైనా రోజురోజుకు పని ఒత్తిడి పెరుగుతోంది. ప్రస్తుతం చాలా మంది ఉరుకులు, పరుగుల జీవితంలో కాలంతో పోటీ పడుతున్నారు. దీని కారణంగా విశ్రాంతి అనేది తీసుకోకుండా.. మానసిక ప్రశాంతతను కోల్పోతున్నాడు. ఫలితంగా శారీరక, మానసికంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. వీటన్నింటి కారణంగా శృంగార జీవితంపై తీవ్ర ప్రభావం పడుతుంది. అందుకే మీరు ముందుగానే సమస్యను గుర్తిస్తే.. అందుకు తగ్గ నిపుణులను సంప్రదిస్తే... మీకు ఎలాంటి సమస్యలు ఉండవు.



Click it and Unblock the Notifications