Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
ఇవి మీ లైంగిక జీవితాన్ని నాశనం చేస్తాయి.. అవేంటో మీకు తెలుసా?
అయితే బెడ్రూములో చేసే కొన్ని పనులు లైంగిక జీవితాన్ని నాశనం చేస్తాయి. రొమాంటిక్ లైఫ్‌ను పాడు చేసే ఆ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
సంబంధం సాఫీగా, ఆనందంగా, విజయవంతంగా సాగాలంటే దాంపత్య జీవితంలో శృంగారం చాలా కీలకం. సాన్నిహిత్య సంబంధంతో బంధంలో వచ్చే చాలా సమస్యలను పరిష్కరించవచ్చు. లైంగికంగా సాఫీగా సాగే దాంపత్య బంధంలో ఎలాంటి సమస్యలు లేనట్లే అర్థం. శృంగారాన్ని సంతృప్తిగా అనుభూతి చెందగలిగితే ఆ జంట కలకాలం సౌఖ్యంగా ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. రోజంతా ఎలా గడిచినా రాత్రి మాత్రం భాగస్వామితో శృంగారం చేయడం వల్ల మరుసటి రోజు ఎంతో ఉత్సాహంతో ప్రారంభించవచ్చని చెబుతున్నారు.

అయితే బెడ్రూములో చేసే కొన్ని పనులు లైంగిక జీవితాన్ని నాశనం చేస్తాయి. రొమాంటిక్ లైఫ్‌ను పాడు చేసే ఆ పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా ఆలస్యంగా తినడం:
రాత్రి వేళ ఆలస్యంగా తిన్నా, అర్ధరాత్రి స్నాక్స్ తీసుకున్నా, హెవీ ఫుడ్స్ తిన్నా రాత్రి వేళ శృంగారాన్ని ఆనందించలేరు. కడుపు నిండుగా ఉంటే సౌకర్యవంతంగా కదలడం కష్టంగా ఉంటుంది. పొట్ట నిండుగా తింటే నిద్ర వస్తుంది. అందుకే రాత్రి త్వరగా భోజనం పూర్తి చేయాలని, లైట్ ఫుడ్ తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. తేలికగా ఉండే ఆహార పదార్థాలు తినడం వల్ల రాత్రి భాగస్వామితో శృంగారాన్ని ఆనందించవచ్చని రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్డ్స్ సూచిస్తున్నారు.

అతిగా మద్యం సేవించడం:
సెక్స్ డ్రైవ్ తగ్గిపోవడానికి పెద్ద కారణం మద్యం. మద్యం సేవించడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందులో సెక్స్ డ్రైవ్ తగ్గడం కూడా ఒకటి. ఒత్తిడితో ఉన్నప్పుడు, ఫ్రెండ్స్ కలిసినప్పుడు, శుభకార్యాల సమయంలో అతిగా మద్యం సేవించడం వల్ల శృంగారంపై ఆసక్తి సన్నగిల్లుతుంది. ఒకవేళ శృంగారం చేసినా ఎక్కువ సేపు ఆసక్తితో చేయలేరు. మద్యం సేవించిన తర్వాత శృంగారాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించలేరు. భాగస్వామి కూడా అసౌకర్యంగా ఫీలవుతారు.

ధూమపానం:
ధూమపానం ఊపిరితిత్తులకే కాదు, లైంగిక జీవితానికి కూడా హానికరం. నికోటిన్ పురుషులు, స్త్రీలలో లైంగిక ఆసక్తిని తగ్గిస్తుంది. అంగస్తంభన సమస్యలూ ఎదురవుతాయి. శృంగారంలో పాల్గొన్నా... మధ్యలో విరమించుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. శృంగార జీవితం సాఫీగా సాగాలంటే ధూమపానం మానేయ్యాలని వైద్యులు సూచిస్తున్నారు.

పెంపుడు జంతువులను పక్కనే పడుకోబెట్టుకోవడం:
పెంపుడు జంతువులను పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. వాటితో ఆడుకోవడం, వాటి ఆలనా పాలనా చూసుకోవడం, వాటితో కలిసి సమయం గడపడం అంటే చాలా మంది ఇష్టపడతారు. కొంత మంది పడకగదిలో బెడ్‌పై కూడా వాటితో కలిసే పడుకుంటారు. అయితే దాంపత్య బంధంలో భాగస్వామితో కలిసి బెడ్‌పై పడుకున్నప్పుడు పెంపుడు జంతువులను పక్కన ఉంచుకోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.
శృంగారం చేయాలనుకున్నప్పుడు పెంపుడు జంతువులు పడక గదిలో లేకుండా చూసుకోవాలి. వాటిని బయట వేరే చోట పడుకోబెట్టి శృంగారంలో పాల్గొనాలి.

పోర్న్ చూడటం, ఎరోటిక్ బుక్స్ చదవడం:
పోర్న్ చూడటం, ఎరోటిక్ పుస్తకాలు చదివి చాలా మంది సోలో సెక్స్‌లో పాల్గొంటారు. అయితే వాటిలో ఉన్నట్లుగానే నిజజీవితంలో కూడా ఉంటుందని భావిస్తారు. కానీ సినిమాలకు, నవలలకు నిజజీవితానికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అందులో చేసినట్లుగానే నిజజీవితంలో కూడా చేయాలని భాగస్వామిని ఒత్తిడికి గురిచేయడం లాంటివి చేయకూడదు.



Click it and Unblock the Notifications
