Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
భాగస్వాములను ఈజీగా మోసం చేసే రాశుల వారెవరో తెలుసా...
ఈ రాశుల వారు రిలేషన్ షిప్ లో తమ భాగస్వాములను సులభంగా మోసం చేస్తారట. ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూడండి.
ఆలుమగలు అన్నాక అనునిత్యం ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. వారిద్దరి మధ్య ప్రేమ ఉన్నంత కాలం వారి వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులు ఒకరితో మరొకరు ప్రేమలో పడి వారి మధ్యలో ఆకర్షణ ఉంటే చాలు వారి బంధం ఎంతో అందంగా సాగుతుంది.

మీ బంధంలో ఆనందంతో నింపే వాటిలో రొమాన్స్ తో పాటు రతిక్రీడ ఒకటి. రతి క్రీడ అంటే మీరు మీ భాగస్వామితో శారీరకంగా కలవడం మాత్రమే కాదు.. మీ ఇద్దరిలో ఒకరిపై ఒకరికి ప్రేమ పెంచుతుంది.

అంతేకాదు మీ ఇద్దరి మధ్య దాపరికాలను సైతం దూరం చేస్తుంది. అయితే ప్రతి ఒక్కరూ తమ భాగస్వామితో ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ.. అప్పుడప్పుడు ఇతరులపై మోజు పెంచుకుంటూ ఉంటారు. తమను ఎంతో ప్రేమిస్తున్న వారిని కూడా మోసం చేయాలని భావిస్తారు.

అయితే అలా అందరూ కావాలని చేయరట.. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈ రాశుల వారు తమ భాగస్వాములను సులభంగా మోసం చేస్తారట.. ఆ రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం...

మిధున రాశి..
ఈ రాశి వారు వివాహ జీవితంలో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని ఆశిస్తారు. అయితే వీరు సంబంధంలో ఉన్నప్పుడు.. వీరు తమ భాగస్వామి తమతోనే ఎక్కువగా ఉండాలనుకుంటారు. అయితే వీరికి టైమ్ మారినప్పుడల్లా మూడ్ మారిపోతుంది. వీరు తమ భాగస్వామిపై ఏదైనా విషయంలో గొడవ పడితే.. మాత్రం ఇతరులపై మోజు పెంచుకుంటారు. తమ భాగస్వామి నుండి ఆశించింది ఏది లభించకపోయినా.. ఇతరులతో అది కావాలని కోరుకుంటూ ఉంటారు.

సింహ రాశి..
ఈ రాశి వారు రిలేషన్ షిప్ లో చాలా డ్రామా నడుపుతూ ఉంటారు. ఇక ముఖ్యంగా చాలా సమయాల్లో తమ భాగస్వామి ఫోకస్ తమ మీదే ఫోకస్ పెట్టుకోవాలని కోరుకుంటారు. అయితే వీరిని తమ పార్ట్నర్ పట్టించుకోవడం లేదని భావిస్తే మాత్రం.. వారిని మోసం చేయడానికి ఏ మాత్రం ఆలోచించరు. ఇతరులతో వెంటనే వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు ఆసక్తి చూపుతారు.

తుల రాశి..
ఈ రాశి వారికి రొమాన్స్ అంటే చాలా ఇష్టం. వీరు ఎలాంటి వ్యక్తులతో అయినా సంబంధాలను కలుపుకోవడానికి ఆసక్తి చూపుతారు. అందుకే వీరు తమ భాగస్వామిని సులభంగా మోసం చేయాలని భావిస్తారు. సాధారణంగా పెళ్లి తర్వాత ఇలాంటివి తగ్గిపోతాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి వారు పెళ్లి తర్వాత కూడా రొమాన్స్ పరంగా ఏ మాత్రం తగ్గరట. వీరి వివాహ జీవితం మొదలైన తర్వాత.. కూడా రతి క్రీడలో రెచ్చిపోతారట.

కుంభ రాశి..
ఈ రాశి వారు పెళ్లి చేసుకున్నప్పటికీ.. తమ భాగస్వామిని మోసం చేసేందుకు ఎక్కువగా ప్రయత్నిస్తారు. అయితే వీరు ఇతరులతో శారీరక సంబంధాలు మాత్రం పెట్టుకోరట. వీరు తమ మాజీ ప్రేయసికి లేదా ప్రియుడికి ఫోన్ ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా చాటింగ్ చేయడం లేదా కాల్ చేయడం వంటివి చేస్తూ ఉంటారట. ఒకవేళ ఇలాంటి రిలేషన్స్ లేకపోతే కొత్త వారిని ఎలాగైనా ఫ్లర్ట్ చేయడం లాంటివి ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే ఇది కూడా ఒక రకంగా తమ భాగస్వామిని మోసం చేయడమే అని గ్రహించాలి. ఇలాంటి విషయాలు తమ భాగస్వామికి తెలిస్తే.. వారు తమ వివాహ జీవితాన్ని సంతోషంగా గడపలేరట.

మీన రాశి..
ఈ రాశి వారు రిలేషన్ షిప్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే వీరు తమ భాగస్వామిని ఎలా మోసం చేయాలా అని ప్రయత్నిస్తూ ఉంటారు. మరోవైపు వీరికి భావోద్వేగ బంధాలంటే చాలా ఇష్టం. వీరికి సంబంధంలో ఉన్నప్పుడు ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే వీరు తమ ప్రవర్తనను బట్టి.. భాగస్వామితో కాకుండా ఇతరులతో ఎక్కువగా క్లోజ్ గా ఉండే అవకాశం ఉంది.



Click it and Unblock the Notifications