Latest Updates
-
రాచరికపు రుచినిచ్చే మొఘలాయి ఎగ్ కర్రీ..చపాతీ, పూరీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
ఒక్కసారి ఈ ఉల్లిపాయ పచ్చడి రుచి చూశారంటే.. రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు! -
కల్తీ లేని స్వచ్ఛమైన బాదం పాలు.. ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసుకోండి! -
పరగడుపున ఈ నీళ్లు తాగితే..థైరాయిడ్, షుగర్, జుట్టు రాలడం ..అన్నింటికీ ఒకే బ్రహ్మాస్త్రం! -
నోరూరించే లాహోరి కడాయి చికెన్..బటర్ నాన్, రోటీల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్! -
హోటల్ రుచిని మరిపించే ఆంధ్రా స్టైల్ పల్లీ చట్నీ..వేడి వేడి ఇడ్లీ, దోశల్లోకి అదిరిపోతుంది! -
చక్కెరకు బదులు బెల్లం: మీ ఆరోగ్యానికి ఇదే శ్రీరామరక్ష! -
పాకం పట్టే పనే లేదు..మన తాతమ్మల కాలం నాటి హెల్దీ జొన్న లడ్డూ..ఎలా చేసుకోవాలంటే.. -
మీ భర్తతో ఈ 4 మాటలు అంటున్నారా? అయితే మీ కాపురంలో చిచ్చు రేగినట్టే! -
పోషకాల గని, ఆరోగ్యానికి పెన్నిధి.. గోధుమ రవ్వ కిచిడీ ఎలా చేసుకోవాలంటే..
‘‘అత్త కూతురు ఆ విషయంలో అడ్వాంటేజ్ తీసుకుంది... సారీ బావ అంటూ అందరి వద్ద నన్ను బుక్ చేసేసింది‘‘...
నేను తనను ఎంత అస్యహించుకున్నా అది మాత్రం నన్ను బాగానే ఇష్టపడేది. అయితే నన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఆట పట్టించేది. లేదా ఏడిపించేది.
''హలో అక్క (చిన్నమ్మ కూతురు) బయలుదేరాను. రైల్వేస్టేషన్లో ఉన్నాను. లక్కీగా రైలు రైట్ టైమ్ కే వచ్చింది. మన ఊరికి కూడా కరెక్టు టైమ్ కే వస్తుంది అనుకుంటున్నాను. ఉదయం కోడి కూసే సమయం లోపే మన ఊరిలోకి అడుగు పెడతాను'' అంటూ ఫోన్ పెట్టేసి రైలు ఎక్కేశాడు రాజు.
ఆ తర్వాత ఉదయాన్నే అమ్మ ఫోన్ చేసి ఇలా చెప్పింది. ''ఏరా చిన్నా, నీకు గీతకు పెళ్లి చేద్దాం అంటున్నారు మన పెద్దలందరూ. నీకు ఒకే కదా అని అడిగింది. అంతే నాకు ఒక్కసారిగా దిమ్మ తిరిగి పోయింది. నేను పుట్టి పెరిగి పెద్దగా అయినప్పటి వరకు నాకు ఈ లోకంలో నచ్చని పేరు ఏదైనా ఉందంటే అది గీత.

గీత అంటే ఎవరు అనుకుంటున్నారా? తను స్వయాన నా మరదలు. మా నాన్నకి ఒకరు తమ్ముడు, ఇద్దరు చెల్లెళ్లు. నా చిన్నతనంలో మేమంతా ఒకే ఇంట్లోనే కలిసి ఉండేవాళ్లం. మా చిన్నాన్నకు ఒక అమ్మాయి. ఒక అబ్బాయి. నేనేమో మా అమ్మనాన్నలకు ఒక్కగానొక్క ఒక్క సుపుత్రుడిని. అదొక్కటే కాదండోయ్ నేనే మా ఇంట్లో అందరికన్నా చిన్నవాడిని. అందువల్ల అందరికీ నేనంటే చాలా ఇష్టం. నేను ఏ పని చేసినా అందరూ ఇష్టపడేవారు. ఈ ఇంటికి నేనే చినరాయుడు అని తెగ సంతోషపడే వాడిని.

అయితే సరిగ్గా అదే సమయంలో రాక్షసి ( నా మరదలు) పుట్టింది. అది పుట్టిన వెంటనే నాకు నిద్ర లేకుండా చేసింది. అది పుట్టిన నాటి నుండి అందరూ నన్ను కమిడియన్ ను చేసేశారు. ప్రతిరోజూ మా నాన్నదగ్గర పడుకుని మా తండ్రి చెప్పే కథలు వినడాన్ని ఎంతో ఇష్టపడేవాడిని. కానీ గీత వచ్చి నా 'గీత'నే కాదు నా ప్లేసును కూడా మార్చేసింది. మా నాన్న దగ్గర అది కూడా వచ్చి పడుకునేందుకు నాతో పోటీ పడేది. నేను చిన్నతనంలోనే ఆ ప్లేసు కోసం నేను ఏడిస్తే, అందరూ నాకే సర్ది చెప్పేవారు.

తను చిన్నది అని..
తను నీ కంటే చిన్నది కదా అని, అమ్మ, నాన్న అందరూ నన్నే బుజ్జగించే వారు. చేసేదేమీ లేక నేనే సర్దుకుపోయేవాడిని.

నా చేతనే మోయించేది..
ప్రతిరోజూ స్కూలుకు వెళ్లే సమయంలో కూడా తన బ్యాగును నాతోనే మోయించేది ఆ దొంగ మొహంది. ఆ బ్యాగులోనే బోలెడు పుస్తకాలుండేవి. అవి చాలా బరువుగా ఉండేవి. మోయలేక చచ్చేవాడిని.

ఓ సారి లవ్ లెటర్..
నేను తనను ఎంత అస్యహించుకున్నా అది మాత్రం నన్ను బాగానే ఇష్టపడేది. అయితే నన్ను ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఆట పట్టించేది. లేదా ఏడిపించేది. అలా నేను పదో తరగతి చదువుతున్న సమయంలోనే నాకు లవ్ లెటర్ ఇచ్చింది.

అప్పుడే మామయ్య ఎంట్రీ..
సరిగ్గా తను ఎప్పుడైతే లవ్ లెటర్ ఇచ్చిందో అప్పుడే మామయ్య ఎంట్రీ ఇచ్చాడు. ఈ వయసులో ఏంటి రా ఈ పనులు అని నన్ను నిలదీశాడు. నేను కాదు ఇచ్చింది నీ కూతురే ఈ లెటర్ ఇచ్చింది అని చెప్పేలోపే.. ఆ దొంగ మొహంది ప్లేటు ఫిరాయించింది.

ముందు నుయ్యి వెనుక గొయ్యి..
‘‘నాన్న నాకు బావనే లవ్ లెటర్ ఇచ్చాడు.. ప్రతిరోజూ ప్రేమ.. గిమ అంటూ ఏడిపిస్తున్నాడు‘‘ అని మామయ్యతో చెప్పేసింది. అంతే ఆ సమయంలో నా పరిస్థితి కాస్త ముందు నుయ్యి.. వెనుక గొయ్యిలా తయారైంది.

హాస్టల్లో చేర్పించారు...
అంతే ఆ సంఘటన తర్వాత నన్ను హాస్టల్లో చేర్పించారు. నేను ఊరు వదిలి హాస్టల్ కు వెళ్లే సమయంలో ‘‘సారీ బావ కేవలం నిన్ను ఆట పట్టిద్దామనే అలా చెప్పాను. కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు అని చెప్పింది‘‘. అయితే నాకు మాత్రం చాలా ఆనందం వేసింది.

ఆ దెయ్యం పీడ లేదనుకున్నా..
ఎందుకంటే నా మరదలి దెయ్యం పీడ ఇంక ఉండదు అని ఎంతగానో సంతోషపడ్డాను. ఆ తర్వాత తనను ఒక్కసారి కూడా చూడలేదు. దాంతో తనతో పెళ్లి అంటే ఊహించుకోవడమే కష్టంగా అనిపించింది.

అంతలోనే రైలొచ్చింది..
అలా ఊహించుకుంటూ ఉండగానే రైలు వచ్చేసింది. వెళ్లి రైలు డోర్ దగ్గర నిలబడ్డాను. రైలు మెల్లగా కదులుతోంది. అచ్చం సినిమాలో లాగానే సరిగ్గా ఆ సమయంలో అందమైన అమ్మాయి పరుగెడుతూ ప్లాట్ ఫామ్ మీదకు వచ్చింది. తనను చూస్తే అచ్చం నయనతార లాగా అనిపించింది.

నా కోసమే పుట్టిందా..
తనను చూస్తే నా కోసమే దివి నుండి దిగివచ్చిన తారలాగా అనిపించింది. నా దగ్గరికి రావాలి అని మనసులో అనుకుంటూ ఉండగానే హడావుడిగా వచ్చి హెల్ప్ చేయమని అడిగింది. తన బ్యాగును తీసుకుని తన చేతిలో నా చేయిని కలిపాను. తనను జాగ్రత్తగా రైలులోకి ఎక్కించాను.

ముచ్చట్లు కలిపాను..
తను ఎక్కడికి వెళ్లాలి.. తను ఏమి చేస్తుంది అనే వివరాలన్నీ అడిగాను. నా వివరాలు కూడా తనకు చెప్పాను. దీన్నే అడ్వాంటేజ్ గా తీసుకున్నాను. మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా అడిగేశాను. వెంటనే తను లేదు అని సమాధానం ఇవ్వగా నా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

పెళ్లి ప్రపోజల్ పెట్టా..
నా మరదలిపైన పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయం అనుకున్నాను. వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు నాకు పిచ్చపిచ్చగా నచ్చేశారు. మీరు ఓకే అంటే ఇప్పుడే మా తల్లిదండ్రులతో, మీ వారితోనూ మాట్లాడతాను అని చెప్పాను. ఆరోజు నేను నక్క తోక తొక్కినట్టే ఉన్నాను. ఆ అమ్మాయి వెంటనే ఓకే చెప్పేసింది.

ఆవేశం.. ఆనందంతో..
ఫస్ట్ టైమ్ నా మరదలికి ఝలక్ ఇద్దామనుకున్నాను. నాలో నేను తెగ సంతోషడ్డాను. తనని తీసుకుని మా తల్లిదండ్రుల వద్దకు వెళ్లాను. నేను మీరు చెప్పిన పెళ్లి చేసుకోను. ఈ అమ్మాయినే చేసుకుంటాను అని ఆవేశంగా చెప్పాను. వారంతా ‘‘ఎవరు వద్దన్నారు మాకు కావాల్సింది కూడా అదేగా అన్నారు‘‘ అన్నారు.

మరి గీత సంగతి ఏంటి?
నేను అప్పుడే ఇలా అడిగాను. మరి గీత సంగతి ఏంటి అడిగాను? అప్పుడు వారి ఇచ్చిన సమాధానంతో నాకు దిమ్మ తిరిగిపోయింది. నువ్వు పెళ్లి చేసుకుంటోంది గీతనే అన్నాడు మా నాన్న.

మళ్లీ సారీ బావ..
‘‘మరోసారి నా మరదలు నాకు షాక్ ఇచ్చింది. ‘సారీ బావ నిన్ను ఆట పట్టిద్దామని అలా చేశాను అని చెప్పేసింది. అప్పుడే నాకు తత్వం బోధపడింది. నేను తీసుకున్న గోతిలో నేను పడ్డాను అని. మీరు గీసిన ‘గీత‘ ను నేనేప్పుడు దాటలేను అని మనసులో తిట్టుకున్నాను.



Click it and Unblock the Notifications











