Latest Updates
-
ఉద్యోగులూ అలర్ట్..మెడ, వెన్ను నొప్పులతో నరకం చూస్తున్నారా? విముక్తి కోసం ఏం చేయాలంటే? -
రైస్, చపాతీలోకి అద్దిరిపోయే బంగాళదుంప ముద్ద కూర.. ఇలా చేస్తే మళ్లీ మళ్లీ అడుగడం గ్యారెంటీ! -
గుడిసెలో ఉండే బిచ్చగాడికి 21 మంది భార్యలు..ఏం బెల్లం పెట్టావ్ రా అయ్యా.. -
ఎలక్ట్రిక్ కెటిల్ ఎలా క్లీన్ చేయాలి? ఈ సింపుల్ ట్రిక్ తో నిమిషాల్లో కొత్తదానిలా మెరుస్తూ.. -
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే?
తోబుట్టువుల మధ్య గొడవలా.. రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడితో తప్పనిసరిగా ఈ మాట చెప్పండి.!
రాఖీ పండుగ అంటే కేవలం రాఖీలు కట్టడం, స్వీట్లు పంచుకోవడం మాత్రమే కాదు.. తోడబుట్టిన వాళ్ల మధ్య బంధాన్ని బలపరుచుకోవడమే ఈ పండుగ ప్రధాన ఉద్దేశం. తోబుట్టువుల మధ్య అనురాగం, ఆప్యాయతలను పెంచుతూ వారి కోసం కేటాయించిన ప్రత్యేక సందర్భం రాఖీ పౌర్ణమి. అయితే కొన్ని కారణాల వల్ల సోదరసోదరీమణుల మధ్య మనస్పర్థలు, అపార్థాలు రావడం సహజం. వాటిని మరిచిపోయి ఈ అపురూప బంధాన్ని మళ్లీ ఎలా నిలుపుకోవాలి.. ఈ పండుగతో మళ్లీ పాత సంతోషాన్ని ఎలా తిరిగి తెచ్చుకోవాలి.. రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్ సలహాలు చూద్దాం..

చిన్నతనంలో, పెళ్లి కాకముందు తోడబుట్టిన వాళ్ల మధ్య చిన్న చిన్న విషయాలకే కొట్టుకోవడం, గొడవపడటం సహజం. ఇంట్లో అజమాయిషీ చెలాయించడం, ఒకరిపై ఒకరు అమ్మకి ఫిర్యాదు చేయడం, మళ్లీ తర్వాత కలిసిపోవడం ఇలాంటి సిల్లీ గొడవలు ఏ ఇంట్లో అయినా కామన్.. కానీ పెద్దయ్యాక, పెళ్లిళ్లు అయ్యి ఎవరి జీవితం వారు ఏర్పరుచుకున్నాక పరిస్థితులు మారిపోతాయి. చిన్న గొడవలు కాస్త పెద్దవిగా మారతాయి. దీంతో రాకపోకలు తగ్గిపోతాయి, దూరం పెరుగుతుంది. మాటలు పూర్తిగా కనుమరుగవుతాయి. కానీ రాఖీ పండుగ వస్తే గతంలో దాచుకున్న మధురానుభూతులు మళ్లీ గుర్తొస్తూ దూరమయ్యాయనే బాధను మళ్లీ పెంచుతాయి. ఈ క్రమంలో ఈ రాఖీ పౌర్ణమికి ఆ దూరాన్ని చెరిపేస్తూ సోదరుడి చేతికి రాఖీ కట్టి, ఆ సంతోషకరమైన రోజులను మళ్లీ తీసుకువచ్చే ప్రయత్నం చేయండి.
రాఖీ పౌర్ణమి రోజు మీ తోబుట్టువులతో దూరాన్ని తగ్గించి, కోపం పోగొట్టేందుకు ఖరీదైన బహుమతులు కొనాల్సిన అవసరం లేదు. ఆ రోజున వారితో నాణ్యమైన, మంచి సమయాన్ని గడపండి. మీ మనసులోని భావాలను పంచుకోండి. రక్షాబంధన్ రోజు పాత గొడవలను, బాధపెట్టే విషయాలను తలచుకోకండి. ఇంకా కొన్ని సింపుల్ టిప్స్ పాటించడం ద్వారా మీ మధ్య గొడవలు, మనస్పర్థలు తొలగి మీ బంధాన్ని కాపాడుకోవచ్చు.
పాత విషయాల ప్రస్తావన వద్దు..
తోబుట్టువుల మధ్య తప్పులు, గొడవలు అనేవి సహజం. కానీ రాఖీ పౌర్ణమి సందర్భంగా గతం గురించి తలచుకోకండి. ఈ పండుగతో కొత్త ఆరంభానికి ప్రయత్నించండి. గతంలో జరిగిన గొడవల్లో ఏదైనా విషయం మిమ్మల్ని బాధపెట్టినట్లయితే కోపంగా మాట్లాడకుండా మీ మనసులోని భావాలను సున్నితంగా వారితో ప్రస్తావించండి. తర్వాత వారు చెప్పేది పూర్తిగా వినండి.
నాణ్యమైన సమయం గడపండి..
రాఖీ కట్టిన తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోకుండా మీ తోబుట్టువులతో సమయం గడపండి. కలిసి భోజనం చేయడం, సినిమా చూడటం, చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకోవడం వంటి వాటి ద్వారా మీ బంధంలో ఆత్మీయత పెరుగుతుంది.
సర్‌ప్రైజ్ గిఫ్ట్
రాఖీ రోజున ఖరీదైన గిఫ్టులు పంచుకోవాల్సిన అవసరం లేదు. మీ సోదరుడికి ఇష్టమైన స్వీట్ లేదా వంట చేసి పెట్టండి. ఇలాంటి వాటి ద్వారా వారి ముఖంలో ఆశ్చర్యంతో పాటు చిరునవ్వును చూడవచ్చు. ఇది మీ గతంలో జరిగిన గొడవలను తుడిచేస్తుంది.

ప్రశంసలు
గొడవలు మరిచిపోయి మీ తోబుట్టువులు చేసిన మంచి పనులను, వారి గుర్తింపును ప్రశంసించండి. దీని ద్వారా మీ బంధంలో పాజిటివిటీ పెరుగుతుంది. వారి విజయాలను, వారి మంచి అలవాట్లను మెచ్చుకోవడం ద్వారా ఒకరిపై ఒకరికి అనురాగం బలపడుతుంది.
నవ్వించే జోకులు
రాఖీ రోజున తోబుట్టువుల మధ్య సరదా సంభాషణ సర్వసాధారణం. కానీ ఎదుటి వారి మనసును నొప్పించేలా జోకులు వేసుకోవద్దు. పరిమితులను, హద్దులను అర్థం చేసుకుని వారితో ఆరోగ్యకరమైన సంభాషణ కొనసాగించండి.
పాత జ్ఞాపకాలు
అన్నాచెల్లెళ్లు, అక్కాచెల్లెళ్లు తమ బాల్యంలో గడిపిన సంతోషకరమైన సందర్భాలు తప్పనిసరిగా ఉంటాయి. ఇక చిన్నతనంలోని ఫొటోలు, తల్లిదండ్రులు చెప్పిన కథలు ఉండే ఉంటాయి. వాటిని ఒకసారి చూసుకుంటూ, పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఫ్యామిలీతో సరదాగా గడపండి.
ఈ మాట తప్పనిసరిగా చెప్పండి..
దాని కంటే ముందుగా రాఖీ కట్టేటప్పుడు మీ సోదరుడికి కచ్చితంగా ఈ మాట చెప్పండి. 'మన మధ్య ఎన్ని గొడవలొచ్చినా.. ఎల్లప్పుడూ ఒకరికొకరం ఇలా తోడుగా ఉందాం.’ అనే చిన్న మాట మీ బంధంలో భావోద్వేగాన్ని మరింతగా పెంచుతుంది.



Click it and Unblock the Notifications
