Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
మీ భర్త మిమ్మల్ని లైఫ్ లాంగ్ ప్రేమిస్తాడని తెలిపే సంకేతాలు..!!
మీ భర్త మిమ్మల్ని ప్రేమించడం ఎప్పటికీ ఆపరని తెలిపే సంకేతాలున్నాయి. మరి మీ భర్త మిమ్మల్ని లైఫ్ లాంగ్ ప్రేమిస్తారో లేదో ఈ లక్షణాలను బట్టి తెలుసుకోండి..
భార్యాభర్తలు అంటే.. అన్ని విషయాలు షేర్ చేసుకుంటూ.. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. ప్రతి విషయంలోనూ ఒకరిపై ఒకరికి నమ్మకం కలిగి ఉన్నప్పుడే.. వాళ్ల మధ్య ప్రేమ, అన్యోన్యత కలకాలం ఉంటాయి. ఏ చిన్న సమస్య వచ్చినా.. ఇద్దరి మధ్య బంధం బలహీనమవుతుంది.
అయితే చాలామంది పెళ్లైన కొత్తలో ఉన్న ప్రేమ తర్వాత ఉండదని భావిస్తారు. జీవితాంతం ఒకేరకమైన ప్రేమను ఆశించడం కష్టమని చెబుతుంటారు. అయితే.. జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. భాగస్వామిపై ఉన్న ప్రేమ మాత్రం తగ్గనప్పుడే.. నిజమైన ప్రేమగా చెబుతారు.
అయితే.. మగవాళ్లలోనే ఎక్కువగా మార్పులు కనిపిస్తుంటాయని.. పెళ్లైన కొంతకాలానికి వాళ్లలో భార్యపై ప్రేమ తగ్గుతుందనే నమ్మకం చాలామందికి ఉంది. అయితే.. మీ భర్త మిమ్మల్ని ప్రేమించడం ఎప్పటికీ ఆపరని తెలిపే సంకేతాలున్నాయి. మరి మీ భర్త మిమ్మల్ని లైఫ్ లాంగ్ ప్రేమిస్తారో లేదో ఈ లక్షణాలను బట్టి తెలుసుకోండి..

కేరింగ్
మీకు ఏదైనా మంచి జరిగినట్టు చాలా మీ భర్త చాలా హ్యాపీగా ఫీలవుతున్నాడంటే.. అతను మిమ్మల్ని లైఫ్ లాంగ్ ప్రేమించే తత్వం ఉన్నవ్యక్తి అని సంకేతం. మంచి జరిగినా, చెడు జరిగినా అతను మీ పక్కనే ఉంటాడు. కేవలం బర్త్ డేలు, ఇతర అకేషన్స్ కి మాత్రమే కాకుండా.. సాధారణ రోజుల్లో కూడా మీకు గిఫ్ట్స్ ఇస్తాడు.

మంచి జరగాలని
అతను మీకు బెస్ట్ అవ్వాలి అని కోరుకుంటున్నాడని.. మీ భర్త మిమ్మల్ని ప్రేమించడం ఎప్పటికీ మానేయడని సంకేతం. ముఖ్యంగా అతను మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో టైం స్పెండ్ చేస్తాడు. అత్యంత ప్రేమను పంచడానికి ఎప్పుడూ మీ పక్కనే ఉంటాడు.

మిమ్మల్ని బాగా ట్రీట్ చేస్తాడు
మీపై ఉన్న ఫీలింగ్స్ అన్నీ చాలా నిజాయితీగా ఉంటాయి. ముఖ్యంగా తనకంటే ముందు.. మీ ఫీలింగ్స్, కోరికలు, అవసరాలనే ఎక్కువ తీరుస్తాడు.

మీతో గడుపుతారు
మిమ్మల్ని ప్రేమించడం ఎప్పటికీ ఆపని వ్యక్తి.. ఎప్పుడూ మీతో గడుపుతాడు. ఎప్పుడూ మీకు దూరంగా ఉండటానికి ఇష్టపడరు.

ప్రాధాన్యత
అతని మనసులో ఎప్పుడూ మీరు ఉంటారు. మీకోసం ఎప్పుడూ.. సమయాన్ని కేటాయిస్తాడు. అలాగే.. ఎలాంటి ప్లాన్ ఉన్నా, ఎలాంటి ఆలోచనలనైనా.. ముందుగా మీతోనే పంచుకుంటారు. మీకే ప్రాధాన్యత ఇస్తాడు.

మీ గురించి ఇతరులు తెలుసుకోవాలనుకుంటాడు
పబ్లిక్ లో మీ చేయి పట్టుకున్నప్పుడు.. తను మీతో ఉంటే ఎంత హ్యాపీగా ఉంటాడు అనే విషయాన్ని తెలుపుతుంది. అంటే.. మీతో అతను చాలా హ్యాపీగా ఉన్నాడని.. ప్రతిఒక్కరికీ వివరిస్తున్నాడు. అలాగే ఫ్యామిలీ ఫంక్షన్ లేదా ఆఫీస్ ఈవెంట్ కి మిమ్మల్ని తీసుకెళ్తే హ్యాపీగా ఫీలవుతాడు అంటే.. అతను మిమ్మల్ని లైఫ్ లాంగ్ ప్రేమిస్తాడని సంకేతం.

నిజాయితీ
తన గత రిలేషన్స్ గురించి అన్ని మీకు చెప్పడం, ఎలాంటి సీక్రెట్స్ మెయింటెయిన్ చేయడం లేదని.. అతను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాడని సంకేతం. అతను ఎప్పుడూ మీతోనే ఉంటాడని సంకేతం.



Click it and Unblock the Notifications
