Latest Updates
-
భర్తలు మిస్ అవుతున్న ఈ చిన్న విషయం.. విడాకులకి దారితీస్తుందని తెలుసా.? -
వ్యసనాలను వదులుకోలేకపోతున్నారా.. యోగాతో ఇలా చెక్ పెట్టేయొచ్చు.! -
హార్ట్ ఎటాక్ వచ్చే 10 రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే! -
ఈ 5 సూపర్ ఫుడ్స్ చాలు.. వర్షాకాలంలో మీ ఇమ్యూనిటీకి ఢోకానే ఉండదు.! -
Father's Day 2026: చాలా మంది తండ్రులు 60 ఏళ్లు దాటాక పశ్చాత్తాపపడే ఒక్క విషయం అదే! -
జుట్టు చివర్లు దారుణంగా చిట్లిపోతున్నాయా.. మీరు చేస్తున్న తప్పులివే.! -
Success Story : ఇదిరా సక్సెస్ అంటే..పేదరికరంలో పుట్టాడు, ఆటో డ్రైవర్ నుంచి ఎయిర్ లైన్ ఓనర్ అయ్యాడు.. -
పెళ్లయింది తర్వాతేంటి.. అమ్మాయిలు గూగుల్ని అడుగుతున్న సలహాలు ఇవేనట.! -
పోషకాల పవర్ హౌస్..ఇంట్లోనే రాగి మాల్ట్ పౌడర్ ఎలా చేసుకోవాలంటే.. -
ఆర్థరైటిస్ పేషెంట్లకు అలర్ట్.. ఏసీలో ఎక్కువసేపు ఉంటున్నారా.?
మీ పార్ట్‌నర్ అలక మాన్పించే ఐడియాస్
అలిగావా.. చిట్టి చిలకా.. అంటూ మీ ముద్దుల భాగస్వామి అలక తీర్చండిలా. కోపంగా ఉన్నప్పుడు నువ్వు ఇంకా అందంగా ఉంటావంటూ.. చిలిపి మాటలతో మీ పార్ట్ నర్ ముఖంలో చిరునవ్వు తీసుకురండి. ఆలుమగల మధ్య అలకలు చాలా కామన్. ముచ్చటగా నాలుగు మాటలు చెప్తే.. ఇట్టే కరిగిపోతారు.
మంచి భర్తగా మార్కులు కొట్టేయాలంటే..!!
అలకలు, కోపాలు, తాపాలు భార్యాభర్తల బంధంలో సరదాగా చోటు చేసుకునే సన్నివేశాలు. బుంగమూతి పెట్టుకుని ఎంతకీ.. మీ వైపు మనసు మారకపోతే మాత్రం చాలా కష్టం. వాళ్ల అలక తీర్చడానికి రకరకాలు ప్రయత్నించినా.. కొన్ని సందర్భాల్లో అస్సలు వీలు కాదు. అలాంటప్పుడు కొద్దిగా.. మనసు పదును పెడితే..చిటికెలో మీ భాగస్వామి ముఖంలో సంతోషాన్ని చూడవచ్చు. అదెలా అంటారా.. అయితే ఈ ఆర్టికల్ చదవండి.

అంగీకారం
మీ పార్టనర్ అలకకు మీరే కారణమైతే.. వెంటనే మీరు బాధ్యత తీసుకోవాలి. బతిమాలో, ఏదో ఒకటి చేసి.. వాళ్ల కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలి. అలాకాకుండా.. మీ పాటికి మీరు పనిలో పడితే.. వాళ్లు మరింత బాధపడతారు. కాబట్టి బుజ్జగించి, తప్పు ఒప్పుకుని, సారీ చెప్పి అలకతీర్చే ప్రయత్నం చేయాలి.
మనిషికి దూరంగా ఉన్నా.. మనసుకి దగ్గరయ్యే మార్గాలు
పాత సన్నివేశాలు
అలక తీర్చబోయి మరింత రిస్క్ లో పడకండి. తన మనసు మరింత గాయపడేలా.. గతంలో జరిగిన గొడవల ప్రస్తావన అస్సలు వద్దు. ఇంకా అవసరమైతే.. గతంలో ఇద్దరి మధ్య జరిగిన సరదా సన్నివేశాలు, హ్యాపీయెస్ట్ మూవ్ మెంట్స్, తనతో గడిపిన సరదా ట్రిప్స్ గురించి గుర్తు చేసి.. పరిస్థితిని కూల్ గా మార్చేయండి.

కోరిక
మీ పార్ట్ నర్ కోపంగా ఉన్నారంటే.. అంతో ఇంతో మీ ప్రభావం ఉంటుంది. అడిగినది లేదన్నప్పుడు, తనకు ఇష్టమైన పని మీరు కాదన్నప్పుడే అలక మీ మధ్యలోకి వస్తుంది. కాబట్టి.. అలక తీర్చడానికి మీ భాగస్వామి మనసు తెలుసుకుని ప్రవర్తించండి. తనకు నచ్చిన పని చేయడానికి అంగీకరించండి. లేదా తను అడిగిన బహుమతి ఇవ్వండి.



Click it and Unblock the Notifications