For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒక్కసారి సెక్స్ లో పాల్గొన్నందుకు అతను నా జీవితాన్నే నాశనం చేశాడు - My Story #12

By Bharath
|
అమ్మాయిలూ ఒక్కసారి ఈ వీడియో చూడండి, ఊహించుకోండి.

నా పేరు హిమజ. నేను కర్ణాటకలోని బళ్లారిలో ఉంటాను. నా స్టడీస్ పూర్తయ్యాక జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న రోజులవి. కానీ నేను సోషల్ మీడియాలో ఎక్కువగా టచ్ లో ఉండేదాన్ని. ఇంటర్ నెట్ లో ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుసుకుంటూ ఉండేదాన్ని.

ఫేస్ బుక్

ఫేస్ బుక్

నేను ఫేస్ బుక్ లో రెగ్యులర్ గా ఫ్రెండ్స్ తో టచ్ లో ఉండేదాన్ని. నాకు ఫేస్ గ్రూప్ లో ఒక అబ్బాయితో పరిచయం ఏర్పడింది. అతని ఫ్రొపైల్ చెక్ చేశాను. అంతా ఓకే. ఫోటోస్ లలో చాలా బాగున్నాడు. అతను కూడా బాగా చదువుకున్నవాడే.

రేంజ్ రోవర్ తో..

రేంజ్ రోవర్ తో..

రేంజ్ రోవర్ కారును డ్రైవ్ చేస్తూ స్టైల్ గా ఫొటోలు దిగాడు. చూడాడానికి బాగా అందంగా ఉన్నాడు. అలాంటి హ్యాండ్ సమ్ అబ్బాయిని ఎవరూ చూసిన కచ్చితంగా ప్లాట్ అవుతారు. నేను కూడా అతనికి ప్లాట్ అయ్యాను. ఫేస్ బుక్ లో చూసి ప్రేమలో పడ్డాను.

మెసేజ్

మెసేజ్

తర్వాత అతనికి ఫేస్ బుక్ మెసేంజర్ లో ఒక మెసేజ్ పంపాను. నా పేరు నా డీటేల్స్ అన్నీ వివరించాను. తనను ఎక్కడ చూసింది ఇలా అన్ని వివరాలతో మెసేజ్ పంపాను. అతన్ని మెచ్చుకుంటూ కొన్ని మెసేజ్ లు పంపాను.

రిప్లై

రిప్లై

అతని నుంచి వెంటనే రిప్లై వచ్చింది. హాయ్ అంటూ మొదలైన మా సంభాషణ అక్కడి నుంచి ఎక్కడి దాకో వెళ్లింది. తర్వాత అతను కూడా ప్రొఫైల్ని చెక్ చేసి నన్ను కూడా మెచ్చుకుంటూ మెసేజెస్ పంపాడు.

ఒక రోజు కలవాలనుకున్నాం

ఒక రోజు కలవాలనుకున్నాం

మొత్తానికి ఇద్దరం రోజూ చాటింగ్ ల్లో బిజీ అయిపోయాం. చివరకు ఒక రోజు మేము కలవాలనుకున్నాం. అతనే డేట్ పిక్స్ చేశాడు. ఆ రోజు పలానా చోటుకు రా అని చెప్పాడు. నేను కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యాను.

బాగా రెడీ అయ్యాను

బాగా రెడీ అయ్యాను

నేను అతన్ని కలవడానికి బాగా రెడీ అయ్యాను. నేను ఇనాళ్లు కలలుగన్న ఆ హ్యాండ్ సమ్ అబ్బాయిని చూడబోతున్నాననే ఆనందం మనస్సు నిండా ఉంది. ఎప్పుడెప్పుడు చూడాలా అని పరితపించాను. మంచి మోడ్రన్ డ్రెస్ లో అతని ముంగిట వాలిపోయాను.

ఇద్దరం కలిశాం

ఇద్దరం కలిశాం

మేమిద్దరం ఒక హోటల్ దగ్గర కలిశాం. అతను కూడా మంచి లుక్ లో కారులో అక్కడికి వచ్చాడు. చూడడానికి బాలీవుడ్ హీరోలా ఉన్నాడు. ఫస్ట్ టైమ్ డైరెక్ట్ గా చూడడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీలయ్యాను.

నా చేతిని నలిపాడు

నా చేతిని నలిపాడు

తర్వాత ఇద్దరం పరిచయం చేసుకున్నాం. అతను నాకు షేడ్ హ్యాండ్ ఇచ్చాడు. చేతిని సుకుమారంగా నలిపాడు. ఏవేవో కబుర్లు కాసేపు చెప్పుకున్నాం. ఫొటోల్లో కంటే డైరెక్ట్ గా నీవు చాలా అందంగా ఉన్నావంటూ నన్ను పొగిడాడు. నన్ను మొత్తానికి మైమరిపించాడు.

హోటల్ లో లంచ్

హోటల్ లో లంచ్

ఇద్దరం హోటల్ లంచ్ చేయాలనుకున్నాం. వెంటనే హోటల్ ల్లోకి వెళ్లి మాకు కావాల్సిన ఫుడ్ ఐటెమ్స్ ఆర్డర్ చేశాం. కబుర్లు చెప్పుకుంటూ ఒకరి కళ్లలోకి ఒకరం చూసుకుంటూ భోజనం పూర్తి చేశాం. చివరకు లంచ్ పూర్తయ్యాక అతనే బిల్ కట్టారు.

ఫోన్ లోనే సంభాషణ

ఫోన్ లోనే సంభాషణ

ఇక అక్కడి నుంచి వచ్చాక రోజూ మేమిద్దరం ఫోన్ లో మాట్లాడుకునేవాళ్లం. గంటల తరబడి మాట్లాడుకునే వాళ్లం. అసలు ఒక్కరోజు మాట్లాడుకున్నా కూడా నాకు ఏదో వెలితిగా ఉండేది. అందుకే ప్రతి రోజూ నేనే ఫోన్ చేసి మాట్లాడేదాన్ని

రూమ్ కు రమ్మనాడు

రూమ్ కు రమ్మనాడు

ఒక రోజు అతను ఫోన్ రూమ్ కు రమ్మన్నాడు. నేను బాగా రెడీ అయి వెళ్లాను. నన్ను అపార్ట్ మెంట్ లోని తన రూమ్ కు తీసుకెళ్లాడు. రూమ్ చాలా బాగుంది. రూమ్ నిండా ఫర్నీచర్ , కప్ బోర్డ్స్ ఉన్నాయి. అసలు బ్యాచిలర్ రూమ్ లాగా లేదు. నాకు అతని రూమ్ చాలా బాగా నచ్చింది.

ముద్దులు

ముద్దులు

నేను హాల్ కూర్చొన్నాను. అతను కిచెన్ లోకి వెళ్లి టీ తీసుకొని వచ్చాడు. టీ తాగాను. నా పక్కనే తను కూర్చొన్నాడు. నా వంకే ఓరగా చూశాడు. తర్వాత నా చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుని సున్నితంగా నొక్కాడు. ఆ తర్వాత నా బుగ్గపై ముద్దుపెట్టాడు. నన్ను తన కౌగిలిలోకి తీసుకుని లిప్ టు లిప్ కిస్ ఇచ్చాడు. నేను కూడా కాదనలేకపోయాను.

బెడ్ రూమ్ లోకి..

బెడ్ రూమ్ లోకి..

నన్ను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లాడు. అతని బెడ్ రూమ్ చాలా బాగుంది. ఒక బ్యాచిలర్ ఇంత అందంగా బెడ్ రూమ్ పెట్టుకున్నాడని ఆశ్చర్యపోయాను. బెడ్ పై కూర్చొని ఒకరికొకరం ముచ్చట్లు చెప్పుకున్నాం.

బెడ్ మీదకు తోశాడు

బెడ్ మీదకు తోశాడు

తర్వాత అతను నన్ను బెడ్ మీదకు తోసి నాపై పడిపోయాడు. అతని నుంచి నేను తప్పించుకోలేపోయాను. నాకు కూడా అతనంటే ఇష్టం ఉంది కాబట్టి నేను ఏమి అనలేకపోయాను. అతను నన్ను తన బిగి కౌగిళ్లలో బంధించేశాడు.

సెక్స్ లో పాల్గొందామన్నాడు

సెక్స్ లో పాల్గొందామన్నాడు

తర్వాత సెక్స్ లో పాల్గొందామన్నాడు. నాకు ఒక పక్క కాస్త భయం.. మరోపక్క కాస్త ఆసక్తి ఉంది. నాకు ఫుల్ మూడ్ తెప్పించాడు. చివరకు నాకు తెలియకుండానే నా ఒంటిపై ఉన్న బట్టలు మొత్తం తీసేశాడు. తను కూడా న్యూడ్ గా మారాడు.

కండోమ్ లేకుండానే సెక్స్

కండోమ్ లేకుండానే సెక్స్

ఇద్దరం సెక్స్ లో పాల్గొనడానికి రెడీ అయిపోయాం. కానీ నాకు మాత్రం ఏదో కాస్త భయంగానే ఉంది. నాకు అదే తొలిసారి. కండోమ్ వాడితే మేలని నేను చెప్పాను. తను మాత్రం అప్పటికే పని మొదలుపెట్టాడు. ఏయ్.. ఏముంది ఇంకొద్ది సేపు ఉంటే పని అయిపోతుందన్నాడు. నేను కూడా కాదనలేకపోయాను. అలా ఇద్దరం శృంగారంలో మునిగితేలిపోయాం. సెక్స్ ను బాగా ఎంజాయ్ చేశాం.

డ్రెస్ వేసుకుని బయల్దేరా

డ్రెస్ వేసుకుని బయల్దేరా

తర్వాత ఇద్దరం బాగా అలిసిపోయాం. అతను కిచెన్ లోకి వెళ్లి గ్లాస్ వాటర్ తీసుకొచ్చాడు. తనే నాకు తాగించాడు. నాపై చాలా ప్రేమ చూపాడు. తర్వాత నేను డ్రెస్ వేసుకుని తిరిగి ఇంటికి వెళ్లేందుకు బయల్దేరాను.

ట్యాక్సీ

ట్యాక్సీ

నన్ను పంపడానికి ట్యాక్సీ కూడా తీసుకొచ్చాడు. వెళ్లేటప్పుడు మళ్లీ ముద్దు పెట్టాడు. ట్యాక్సీలో వెళ్లేటప్పుడు నన్ను చూస్తూ చిరునవ్వులు చిందించాడు. నాపై ప్రేమ కురిపించాడు. నేను కూడా వీధి చివరి వరకు ట్యాక్సీ లో నుంచి అతన్నే చూశాను.

ఇంటికి వెళ్లాను

ఇంటికి వెళ్లాను

ఇంటికి సేఫ్ గా చేరుకున్నాను. వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి స్నానం చేశాను. ఫ్రెష్ అయి వొచ్చి హాల్ లో కూర్చొన్నాను. ఇంటికొచ్చాక కూడా అతని గురించే ఆలోచన. అతనితో జీవితాంతం ఇలాగే జీవితం హ్యాపీగా కొనసాగాలని అనుకున్నాను.

చాటింగ్

చాటింగ్

ఇంటికొచ్చాక అతనికి మెసేజ్ పంపాను. ఇప్పుడే ఇంటికొచ్చాను. సేఫ్ గా రీచ్ అయ్యాను అని మెసేజ్ పంపాను. అతను ఆన్ లైన్ లో ఉన్నా రిప్లై ఇవ్వలేదు. ఏదో బిజీలో ఉన్నాడనుకున్నా. మళ్లీ పంపినా రిప్లై ఇవ్వలేదు. వాట్సాప్ లో చాలా మెసేజ్ లు పంపాను. అతను చదివినట్లుగా బ్లూ మార్క్ టిక్స్ కనపడుతున్నాయి. అయినా రిప్లై లేదు.

బ్లాక్ చేశాడు

బ్లాక్ చేశాడు

చివరకు నన్ను సోషల్ మీడియాలో బ్లాక్ చేశాడు. మెసేంజర్, ఫేస్ బుక్, వాట్సాప్ లలో నన్ను బ్లాక్ చేశాడు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకలా చేశాడో కూడా నాకు అస్సలు అర్థం కాలేదు. నమ్మిన మనిషి.. నా వైపు ఎలాంటి తప్పు లేకుండా అలా చేయడంతో నాకు చాలా బాధ అనిపించింది.

సిమ్ మార్చాడు

సిమ్ మార్చాడు

ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వచ్చింది. సిమ్ మార్చాడు. ఎందుకు అలా చేశాడో అర్థంకాలేదు. అతని కోసం అపార్ట్ మెంట్ కు వెళ్తే అక్కడ ఖాళీ చేసి వెళ్లిపోయాడన్నారు. నాకు అతని గురించి చాలా వివరాలు కూడా తెలియదు. అసలు ఎందుకిలా చేస్తున్నాడని అర్థం కాలేదు.

ఎప్పుడూ గుర్తొచ్చేవాడు

ఎప్పుడూ గుర్తొచ్చేవాడు

రోజూ అతనే గుర్తొచ్చేవాడు. ప్రతి క్షణం అతని జ్ఞాపకాలతో కాలం గడిపాను. ఏం చెయ్యాలో అర్థం అయ్యేది కాదు. అతన్ని మరిచిపోలేకపోయేదాన్ని. అతనితో గడిపిని క్షణాలు గుర్తొచ్చి ఏడ్చేదాన్ని. అంతగా నమ్మితే ఎందుకిలా చేశాడని బాధపడేదాన్ని. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. అయినా అతను మాత్రం తిరిగిరాలేదు. అతని నుంచి ఎలాంటి స్పందన లేదు.

నేను వీక్ అయిపోయాను

నేను వీక్ అయిపోయాను

అతని గురించి ఆలోచించి ఆలోచించి నేను చాలా బలహీనంగా మారాను. ఏది తినాలని అనిపించేది కాదు. నాకు ఏదో రోగం వచ్చినట్లు అయిపోయాను. రోజురోజుకు చిక్కిపోతున్నాను. మా ఇంట్లో వాళ్లు కూడా ఎందుకిలా అయిపోతున్నావంటూ జాలిపడేవారు. కానీ వారి అసలు విషయం తెలియదు. అతన్ని మరచిపోలేక నేను చాలా బలహీనంగా మారిపోయాను.

హాస్పిటల్ వెళ్లాను

హాస్పిటల్ వెళ్లాను

మా ఇంట్లో వాళ్లు ఫోర్స్ మీద నేను చికిత్స కోసం ఒక రోజు హాస్పిటల్ కు వెళ్లాను. అక్కడ నన్ను డాక్టర్లు చెక్ చేసి కొన్ని టెస్ట్ లకు రెఫర్ చేశారు. అన్నీ టెస్ట్ లు చేయించుకున్నాను. కొన్ని టెస్ట్ లు ఎందుకు చేస్తున్నారో కూడా నాకు చెప్పకుండానే చేసేశారు.

హెచ్ ఐవీ పాజిటివ్

హెచ్ ఐవీ పాజిటివ్

చివరగా టెస్ట్ ల్లో భయంకరమైన నిజం బయటపడింది. నాకు హెచ్ ఐవీ పాజిటివ్ ఉన్నట్లు తేలింది. నేను అక్కడే కుప్పకూలిపోయాను. నేను నా జీవితంలో ఒక్కేఒక్కసారి తప్పు చేశాను. అయితే దాని ఫలితం ఇంత దారుణంగా ఉంటుందని నేను అనుకోలేదు.

కండోమ్ వాడండి

కండోమ్ వాడండి

నేను ఈ సమాజానికి చెప్పేది ఒక్కటే. మీరు ఎవరితోనైనా సెక్స్ లో పాల్గొనాల్సి వస్తే కండోమ్ వాడండి. నేను ఆ రోజు సెక్స్ లో పాల్గొన్నప్పుడు అతను కండోమ్ వాడి ఉంటే నేను ఎయిడ్స్ కు గురయ్యేదాన్ని కాదు. నా జీవితం నాశనం అయ్యేది కాదు.

ఒక్క క్షణం ఆనందానికి

ఒక్క క్షణం ఆనందానికి

ఒక్క క్షణం ఆనందం కోసం ఇలా నూరేళ్ల నిండు జీవితాన్ని నాశనం చేసుకోవాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరూ సెక్స్ లో పాల్గొనే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. మీ భాగస్వామి నమ్మకస్తుడా ? లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవాలి. చాలా మంది అబ్బాయిలు యవ్వనంలో చాలా తప్పులు చేస్తుంటారు. అలా అని ప్రతి అబ్బాయి అలా చేస్తాడని కాదు.

English summary

I met this boy on facebook he made me hiv positive

I met this boy on facebook he made me hiv positive