TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
నా భర్తను పక్కింటి ఆవిడ దగ్గరకు పంపితే నా కాపురంలోనే మన్నుకొట్టింది - #mystory148
నాకు పెళ్లి అయి చాలా కాలం అవుతోంది. ఒక పాప, బాబు ఉన్నారు. ఇటీవలే మా ఇంటి పక్కన రెంట్ కు ఒక ఫ్యామిలీ దిగింది. వారిద్దరూ భార్యాభర్తలే. వాళ్లు మా ఇంటి పక్కన దిగినప్పటి నుంచి మా ఆయన ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి.
భర్తతో గొడవపడుతూ ఉంటుంది
పక్కింటి ఆవిడ ఎప్పుడూ భర్తతో గొడవపడుతూ ఉంటుంది. మగవారు చాలా మంది ఇలాగే ఉంటారు... అర్థం చేసుకుని కాపురాన్ని సక్రమంగా నడుపుకోవాలంటూ ఆ భార్యాభర్తలకు అప్పుడప్పుడు సర్ది చెబుతుంటాడు నా భర్త. అలా నా భర్త వారికి నచ్చజెప్పుతుంటే నేను కూడా చాలా ఆనందించేదాన్ని.
నాకు చాలా సంతోషం వేసేది
అప్పుడప్పుడు ఆమె భర్త కొడుతుంటే కూడా నా భర్త అడ్డు వెళ్లి అడ్డుకున్నాడు కూడా. ఇలా చాలా సార్లు చేశాడు. పక్కింటి వారి సంతోషాన్ని కూడా కోరుకునే మా ఆయన్ని చూసి నాకు చాలా సంతోషం వేసేది. ఇక పక్కింటి ఆయన ఆఫీసుకు వెళ్లిన తర్వాత వాళ్ల ఆవిడకు ధైర్యాన్ని చెప్పేవాడు.
నన్ను అక్కా అని పిలిచేది
నేను కూడా మా ఆయన చేసే మంచి పనులకు అడ్డు చెప్పేదాన్ని కాదు. ఆమె మా ఇంటికి కూడా తరుచుగా వచ్చేది. నన్ను అక్కా అని పిలిచేది. ఒక రోజు నేను మా పుట్టింటికి బయల్దేరాను. మా ఆయన ఎంతో ప్రేమతో నన్ను బైక్ పై ఎక్కించుకుని బస్టాండ్ దగ్గర డ్రాప్ చేసి వచ్చాడు.
ఆల్బమ్ మీ ఇంట్లోనే ఉంది కదా
బస్సు వచ్చే సమయంలో మా అమ్మ ఫోన్ చేసి మీ చెల్లి పెళ్లి ఆల్బమ్ మీ ఇంట్లోనే ఉంది కదా.. దాన్ని కాస్త పట్టుకురా అని చెప్పింది. దాంతో నేను వెంటనే మా ఆయనకు ఫోన్ చేశాను. ఆయన ఫోన్ తగలకపోవడంతో నేను ఇంటికి వెళ్లాను.
మా పక్కింటి ఆవిడే
మా ఇంట్లో మా ఆయనతో పాటు మరో ఆమె కనిపించింది. ఆయన ఒళ్లో కూర్చొని ఏవేవో కబుర్లు చెబుతుంది. నేను షాక్ అయ్యాను. తీరా ఆమె ఎవరా అని చూస్తూ మా పక్కింటి ఆవిడే. నాకు దిమ్మదిరిగిపోయింది.
నాపైనే ఎదురు తిరిగింది
తర్వాత బ్యాగ్ ఇంట్లో పడేసి ఆమె మెడపట్టి బయటకు పంపాను. అయితే పక్కింటి ఆవిడ నాపైనే ఎదురు తిరిగింది. నీ భర్త నీకు విడాకులు ఇస్తాడు.. నేను, ఆయన త్వరలో పెళ్లి చేసుకోబుతున్నాం అంది.
నిర్ఘాంతపోయాను
తనే సొంత పెళ్లాంళా మారి, నన్ను పరాయిదానిలాగా మార్చేసింది. నేను నిర్ఘాంతపోయాను. ఏం చేయాలో తోచలేదు. తర్వాత నా భర్త, ఆమె ఇద్దరూ కలిసి ఎటో వెళ్లిపోయారు.
లెక్కలేనన్ని సార్లు శారీరకంగా కలిశారట
నాకు తర్వాత కొన్ని విషయాలు తెలిశాయి. నా భర్త రోజూ ఆమెను ఓదార్చుతున్నట్లు నా ముందు బిల్డప్ ఇస్తూ ఆమెతో సెక్స్ లో పాల్గొనేవాడట. అలా లెక్కలేనన్ని సార్లు వారిద్దరూ శారీరకంగా కలిశారట. ప్రస్తుతం పక్కింటి ఆవిడ మా ఆయన వల్లే ప్రెగ్నెంట్ కూడా అయ్యిందట.
అమాయకురాలిగా ఉండిపోయాను
మా ఇంటికి పక్కన ఆవిడకు సర్ది చెప్పడగానికి నా ఎదురుగానే మా ఆయన వెళ్తున్నా కూడా నేను అమాయకురాలిగా ఉండిపోయాను. వాళ్ల కాపురం నిలబెడుతున్నాడనుకున్నా కానీ ఇలా నా కాపురాన్ని నేనే కూల్చుకున్నానని తెలియదు.
కాపురాన్ని నాశనం చేసుకోవొద్దు
తర్వాత మా పుట్టింటి వాళ్లకు విషయం చెప్పాను. వాళ్లు ఈ విషయాన్ని బయటకు చెప్పి కాపురాన్ని నాశనం చేసుకోవొద్దంటూ సలహా ఇచ్చి వెళ్లి పోయారు. ఇప్పుడు ప్రస్తుతం నా భర్త ఇంట్లో ఉంటున్నా కూడా నాకు అతనితో కాపురం చెయ్యాలని అనిపించడం లేదు.
వేరే చోట కాపురం పెట్టింది
ప్రస్తుతం పక్కింటి ఆవిడను వాళ్ల ఆయనతో కలిసి వేరే చోట కాపురం పెట్టింది. కానీ మా ఆయనకు, ఆమెకు మధ్యలో ఇంకా ఆ రంకుతనం కొనసాగుతుందని నాకు అనిపిస్తూ ఉంది.
జాగ్రత్తగా మసలుకుంటున్నా
అయితే గతాన్ని తలచుకుని కుమిలిపోవడం కంటే.. భవిష్యత్‌లో ఇలాంటిది చోటుచేసుకోకుండా జాగ్రత్తగా మసలుకుంటున్నా. ప్రతి కుటుంబంలో భర్త పాత్ర చాలా ప్రధానమైనది. ఆయన బాధ్యతాయుతంగా నడుచుకుంటేనే కాపురం బాగుంటుంది.
భార్యలే కల్పిస్తుంటారు
భార్యలపై మోజు తగ్గిన భర్తలు పక్కింటి మహిళలతో సరసాలు చేసేందుకు అవకాశాల్ని భార్యలే కల్పిస్తుంటారు. భార్య ముందు జాగ్రత్తగా అన్ని రకాలుగా ఆలోచిస్తే భర్త అడ్డదారి తొక్కకుండా జాగ్రత్తపడొచ్చని నాకు అనిపించింది.
అన్నీ వదులుకుని వచ్చాను
నాది మా ఆయనది ప్రేమ వివాహం. మా పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నాం. ఆయన కోసం నేను అన్నీ వదులుకుని వచ్చాను. మాకు పిల్లలు పుట్టాక మా పుట్టింటి వాళ్లు మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన కోసం నేను అన్ని త్యాగాలు చేస్తే ఇలా ఇల్లీగల్ కాంటాక్స్ పెట్టుకుని నన్ను నిలువునా మోసం చేశాడు.
మార్చుకునేందుకు ప్రయత్నం
మా ఆయన పట్ల నేను ఇప్పుడు మరింత ప్రేమ చూపిస్తూ ఆయనను మార్చుకునేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా కాపురాన్ని సరిదిద్దుకోవడానికి నేను అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నా.