For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

marriage life: పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా?

పెద్దలు కుదిర్చిన పెళ్లితో లాభమా.. నష్టమా అనే వివరాలను తెలుసుకుందాం.

|

మన దేశంలో కమనీయం వంటి కళ్యాణ కార్యక్రమం అంటే ప్రతి ఒక్కరి జీవితంలో కీలకమైన ఘట్టం. ఒకప్పుడు పెళ్లి అంటే అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాల వారిని చూసి పెళ్లి చేయాలి అనేవారు.

Arranged marriage Pros and cons in Telugu

అందుకే ఆ బాధ్యతను తల్లిదండ్రులకు, కుటుంబసభ్యులకు అప్పజెప్పేవారు. అయితే పెద్దలు కుదిర్చిన పట్ల ప్రస్తుతం తరం వారిలో వ్యతిరేకత మొదలవుతోంది.

Arranged marriage Pros and cons in Telugu

ఎందుకంటే తమ లైఫ్ లో అతి ముఖ్యమైన ఘట్టమైన పెళ్లి విషయంలో తమ ప్రమేయం లేకుండా పేరేంట్స్ ఇష్టం మేరకు తమకు కాబోయే జీవిత భాగస్వామితో ఏడడుగులు నడవాలంటే, ఎవ్వరికీ ఇష్టముండదు.

Arranged marriage Pros and cons in Telugu

చాలా మంది తమ ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా చేసే బలవంతపు పెళ్లి చేసేసి వివాహ తంతు ముగిసిపోయిందని చెబుతుంటారు. కానీ, పెద్దలు కుదిర్చిన పెళ్లిలో కూడా కొన్ని లాభాలున్నాయి...ఆ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

మగువలలో అందంతో పాటు అవి ఉంటేనే మగాళ్లు ఈజీగా అట్రాక్ట్ అవుతారట...!మగువలలో అందంతో పాటు అవి ఉంటేనే మగాళ్లు ఈజీగా అట్రాక్ట్ అవుతారట...!

ఇద్దరూ అంగీకరిస్తే..

ఇద్దరూ అంగీకరిస్తే..

పెద్దలు కుదిర్చిన పెళ్లిలో స్త్రీలకు పురుషులు, పురుషులకు స్త్రీలు నచ్చితేనే.. ఇద్దరి అంగీకారం మేరకు కళ్యాణం జరుగుతుంది. అంటే పెళ్లి నిర్ణయం మీ చేతుల్లోనే ఉంటుంది. మిగిలిన విషయాలు అంటే కట్నకానుకలు, తదితర విషయాలన్నీ పెద్దల చేతిలో ఉంటాయి.

ఇష్టాలకు విలువ..

ఇష్టాలకు విలువ..

పెద్దలు కుదర్చి పెళ్లిలో మొట్టమొదటి ఘట్టం పెళ్లిచూపులు. అక్కడి నుండే మీకు సరైన జోడిని సెలెక్ట్ చేసేందుకు పెరేంట్స్ తెగ అన్వేషిస్తారు. ముఖ్యంగా ఏదైనా సంబంధం వచ్చిందంటే.. మనం ముందుకు వెళ్లొచ్చా.. లేదా అని మన కంటే ఎక్కువగా ఆలోచిస్తారు. అక్కడితో ఆగకుండా తెలిసిన వారందరినీ కలిసి ఆరా తీస్తారు.

మీ భాగస్వామి..

మీ భాగస్వామి..

పెద్దలు కుదిర్చిన పెళ్లిలో కుటుంబ వ్యవహారాలు, కట్టుబాట్లు, కుటుంబ నేపథ్యానికి దగ్గరగా ఉండే భాగస్వామిని మీకు జోడిగా చేసేందుకు ప్రయత్నిస్తారు. అంతేకాదు వారు మీ పుట్టింటి వారితో కూడా ఇట్టే కలిసిపోతారు. ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని మీరే సరిచేసుకుంటారు.

అడ్జస్ట్ మెంట్స్..

అడ్జస్ట్ మెంట్స్..

పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడం వల్ల.. మీ పుట్టినిల్లు, మెట్టినిల్లు కుటుంబ వ్యవహారాలు, ఆచారాలు, సంప్రదాయాలు దాదాపు ఒకే రకంగా ఉంటాయి. దీని వల్ల మీరు వారితో త్వరగా కలిసిపోతారు. అంతేకాదు మిమ్మల్ని మీరు పెద్దగా మార్చుకోవాల్సిన అవసరం లేదు.

ఇవి మీ ప్రేమికుడు మరొకరితో కూడా డేటింగ్ లో ఉన్నారని తెలిపే లక్షణాలు...ఇవి మీ ప్రేమికుడు మరొకరితో కూడా డేటింగ్ లో ఉన్నారని తెలిపే లక్షణాలు...

భవిష్యత్తుపై స్పష్టత..

భవిష్యత్తుపై స్పష్టత..

పెళ్లి తర్వాత భవిష్యత్తు గురించి చాలా మందికి చాలా రకాల ఆలోచనలు ఉంటాయి. ముఖ్యంగా తమ లైఫ్ పార్ట్ నర్ ఎలా ఉండాలో కూడా క్లారిటీ ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన భాగస్వామి దొరికేంత వరకు ఎదురుచూడొచ్చు.

ప్రారంభంలో అపనమ్మకం..

ప్రారంభంలో అపనమ్మకం..

పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ప్రారంభంలో ఒకరిపై ఒకరికి పెద్దగా నమ్మకాలు ఉండకపోవచ్చు. అందుకే నమ్మకం విషయంలో చాలా మంది స్టార్టింగ్ నుండే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. పెళ్లైన కొత్తలోనే కొత్త లైఫ్ పార్ట్ నర్ పై విశ్వాసం పెంచుకోవడం చాలా కష్టం. ఇలాంటివి భవిష్యత్తులో సమస్యలకు దారి తీస్తాయి. అంతేకాదు చిన్న చిన్న విషయాలకే గొడవలు పెరిగి విడాకుల వరకు వెళ్తుంది.

ఫ్యామిలీ ప్రాబ్లమ్స్..

ఫ్యామిలీ ప్రాబ్లమ్స్..

పెద్దలు కుదిర్చిన పెళ్లిలో కపుల్స్ మధ్య కలహాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల మీ ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల చాలా హాని కలుగుతుంది. ముఖ్యంగా అత్తమామలు వైవాహిక జీవితంలో జోక్యం చేసుకోవడం వల్ల.. లేదా మిమ్మల్ని ఎగతాళి జోకులు వేయడం వంటివి చేస్తే మీ కుటుంబంలో సమస్యలు పెరుగుతాయి.

వ్యక్తిగత ప్రాధాన్యం..

వ్యక్తిగత ప్రాధాన్యం..

పెద్దలు కుదిర్చిన పెళ్లిలో సాధారణంగా అబ్బాయిలకే ప్రాధాన్యం ఉంటుంది. అమ్మాయిని కచ్చితంగా తక్కువ చేస్తారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే వ్యక్తిగత ప్రాధాన్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి వివాహాలలో తల్లిదండ్రుల అదనపు పాత్ర ఉంటుంది.

English summary

Arranged marriage Pros and cons in Telugu

Here we are talking about the pros and cons of arranged marriage in Telugu. Read on
Desktop Bottom Promotion