Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మగాళ్లు శృంగారం కంటే వీటినే ఎక్కువగా కావాలనుకుంటారు
శారీరక సంతృప్తి కంటే పురుషులకు ఆడవారిలో ఇంకాం ఏం కావాలి.. వాటి వల్ల శృంగారం పురుషులు ఎలా సంతృప్తి పొందుతారో ఇప్పుడు చూద్దాం.
ఆడవారిని మగవారు కేవలం శృంగారభరితంగానే చూస్తారని, వారికి ఆడవారి శరీరం ఉంటే సరిపోతుందన్న తప్పు భావన చాలా మంది మహిళల్లో ఉంటుంది. కానీ అది పూర్తిగా తప్పు. ఎందుకంటే మగవారికి ఆడవారిలో శృంగారం కంటే ఎక్కువగా కావాల్సినవి వేరే ఉంటాయి.

శారీరక సంతృప్తి కంటే పురుషులకు ఆడవారిలో ఇంకాం ఏం కావాలి.. వాటి వల్ల శృంగారం పురుషులు ఎలా సంతృప్తి పొందుతారో ఇప్పుడు చూద్దాం.

1. గౌరవం
మగవారు శృంగారం కంటే కూడా గౌరవం ఎక్కువ కోరుకుంటారు. ఇతర వ్యక్తులు, ముఖ్యంగా భాగస్వాములు అగౌరవపరిస్తే పురుషులు ఏమాత్రం సహించలేరు. ఇది సంబంధానికి మంచి గౌరవప్రదమైన, సానుకూలత కలిగిస్తుంది. పురుషులకు గౌరవించడం వల్ల వారికి ఎంతో ఆకట్టుకోవచ్చు.

2. అభినందనలు
పొగడ్తలు వినడానికి ఇష్టపడనివారు ఎవరుంటారు చెప్పండి. పొగడ్తలకు ఎవరైనా పడిపోతారు. శరీర రూపాన్ని, మాట్లాడే తీరును, ఆలోచనలు, హ్యూమర్ ఇలా దేనినైనా పొగడటానికి ట్రై చేశారనుకోండి పురుషులు పడిపోతారంతే.

3. కృతజ్ఞత
కృతజ్ఞతా భావం చాలా విలువైనది. అత్యంత విలువైన దీనిని చూపిస్తే ఎవరికైనా ఇష్టంగానే ఉంటుంది. పురుషులు భిన్నమేమీ కాదు. వారి భాగస్వామి తమ పట్ల కృతజ్ఞత చూపడాన్ని పురుషులు ఇష్టపడతారు.
శృంగారమే కాకుండా కృతజ్ఞత భావాన్ని చూపడం ద్వారా కూడా పురుషులను ఆకట్టుకోవచ్చు. వారిని సంతృప్తి పరచవచ్చు.

4. వారి వల్ల గర్వపడటం
తమ భాగస్వామి తమ పట్ల ఎంత గర్వంగా ఉన్నారో చూపించినప్పుడు పురుషులు ఎక్కువగా ఇష్టపడతారు. ఒకరి బాడీ లాంగ్వేజ్ ఉపయోగించి వారు తమ పట్ల ఎంత గర్వంగా ఉన్నారో చూపించడం ప్రేమను చూపించడానికి గొప్ప మార్గం. పురుషులు తమ పని లేదా ప్రయత్నాలను గుర్తించినప్పుడు చాలా సంతోషిస్తారు.

5. అరవకపోవడం
ఏ సంబంధంలోనైనా కలహాలు సాధారణం. అయితే వాటి వల్ల ఒకరిపై ఒకరు అరుచుకోవడం సంబంధానికి ఏమంత మంచిది కాదు. ఆడవారు తమపై అరిస్తే పురుషులకు ఏమాత్రం నచ్చకపోగా వారిలో కోపాన్ని పెంచుతుంది. ఇది రానురాను అయిష్టంగా మారుతుంది.

పురుషులు ఇలాంటి పనులు చేస్తే మీరంటే వారికి ఇష్టమని అర్థం చేసుకోవచ్చు
1. సమయం గడపడానికి తాపత్రయపడతారు
పురుషులు తమ భాగస్వామి అంటే ఇష్టం ఉంటే అది వారి చేతల్లో కనిపిస్తుంది. వారు మీతో సమయం గడపడానికి ప్రయత్నిస్తుంటారు.
2. అసూయ
చిన్న చిన్న విషయాల్లోనూ అసూయ చూపిస్తారు. అసూయ చూపిస్తున్నారంటే మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారనడానికి సంకేతం.
3. లక్ష్యాలు, కలల గురించి మాట్లాడతారు
పురుషులు తమ లక్ష్యాల గురించి ఇతర వ్యక్తులతో మాట్లాడటం చాలా అరుదనే చెప్పాలి. తన ఆశలు, కలల గురించి మీకు చెబితే, మిమ్మల్ని వారు ప్రత్యేకంగా చూస్తున్నారనడానికి సంకేతం. మిమ్మల్ని గౌరవిస్తాడని, మీ అభిప్రాయాలకు విలువ ఇస్తాడని అర్థం.



Click it and Unblock the Notifications