Latest Updates
-
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.?
భార్యభర్తల్లో నమ్మకాన్ని పెంచే.. శివపార్వతుల కళ్యాణ కథ...!
శివపార్వతీల నుండి వివాహ జీవితానికి సంబంధించిన చిట్కాలను తెలుసుకోండి.
పురాణాల ప్రకారం, మహా శివుడిని వివాహమాడేందుకు పార్వతీదేవి రెండో జన్మ ఎత్తింది. ఆ పరమశివుడికి భార్యపై ఉన్న ప్రేమానురాగాల కారణంగానే ఆ మాత మరో జన్మ ఎత్తింది.

అయితే అంతకుముందు శివుడు పార్వతీదేవి తండ్రిని ఓ విషయంలో అనుమానిస్తాడు. ఇది సహించలేని పార్వతీదేవి శివుడు చేస్తే యజ్ణంలోని మంటల్లో దూకి తనను తాను బలి ఇచ్చుకుంటుంది.

దీంతో శివుడు చాలా నిరాశకు గురవుతాడు. ఆయన ప్రపంచంతో సంబంధాలను తెంచుకుని, హిమాలయాలకు వెళ్లిపోతాడు. అక్కడే ధ్యానం చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటాడు.

అయితే అదే సమయంలో శివుడు మళ్లీ ఈ ప్రపంచంలోకి రావడానికి దేవుళ్లందరూ ఆదిశక్తి అయిన సతీదేవిని మళ్లీ జన్మించాలని వేడుకుంటారు.

వారందరి విన్నపంతో సతీదేవి పార్వతీదేవిగా మరోసారి జన్మించింది. రెండోసారి హిమలయరాజు హిమవంతుడు, భార్య మీనవతిలకు బిడ్డగా పుడుతుంది. అప్పటి నుండి శివుడికి తన ప్రేమను తెలపడానికి ఎంతగానో ప్రయత్నించింది. అయితే ఎంతకీ ఫలితం రాకపోవడంతో.. గౌరీ కుంద్ లో శివుడి కోసం తపస్సు చేస్తుంది. ఆ తర్వాత విషయం తెలుసుకున్న శివుడు, తన ధ్యానాన్ని వీడి పార్వతీ దేవి కోసం వచ్చేశాడు. ఇంతకాలం వేచి ఉండేలా చేసినందుకు పార్వతిదేవిని క్షమాపణలు కూడా కోరతాడు.

అంతులేని ప్రేమ..
పురాణాల ప్రకారం, శివుడు మరియు పార్వతీ దేవి మధ్య ప్రేమ అంతులేనిదిగా ఉంటుంది. ఒకరాజు కుమార్తె(పార్వతి) అయినప్పటికీ, బైరాగి(శివుడు)తో ప్రేమలో పడుతుంది. ఆ తర్వాత వివాహం కూడా చేసుకుంటుంది.

ఆదర్శ దంపతుల కర్తవ్యం..
వీరిద్దరూ సమాజంలో ఉన్న పద్ధతులను ప్రబలంగా అనుసరించారు. పార్వతీదేవి శివుడితో పెళ్లికి ముందు అందరి సమ్మతి పొందింది. అందరూ అంగీకరించిన తర్వాతే కుటుంబం మొత్తాన్ని ఒకచోట చేర్చుకోవడం ఆదర్శ దంపతుల కర్తవ్యం.

తీవ్రమైన తపస్సు..
శివుడితో సతిగా వివాహ జీవితం ప్రారంభం కాని సమయంలో, ఆమె తరువాతి జన్మలో పార్వతీ అవతారం ఎత్తింది. అంతేకాదు పార్వతీ దేవి శివుడిని భాగస్వామిని పొందేందుకు తీవ్రమైన తపస్సు చేసింది. దీని కోసం అన్ని రకాల కష్టాలను ఎదుర్కోంది.

భాగస్వామి పట్ల భక్తి..
పార్వతీ దేవి ప్రతి జన్మలో శివుడిని మాత్రమే తన భర్తగా పొందడానికి ధ్యానం చేసింది. అదే సమయంలో, కైలాస అధిపతి తల్లి పార్వతిని మాత్రమే జీవిత భాగస్వామిగా అంగీకరించారు. ఇలా వివాహ జీవితంలో ఒకరికొకరు నమ్మకం మరియు అంకితభావం కలిగి ఉండటం చాలా ముఖ్యం...

ఆదర్శ తల్లిదండ్రులు..
ఆదర్శ కుటుంబం ఎలా ఉండాలో శివుడు మరియు పార్వతీదేవి అందరికీ చూపించారు. భార్యభర్తల మధ్య ప్రేమ మరియ సాన్నిహిత్య సంబంధం ఉన్నప్పటికీ, వీరు ఇద్దరు కలిసి తమ పిల్లలను చాలా పూర్తి బాధ్యతతో చూసుకున్నారు.

ఒకరికొకరు ప్రేమగా..
శివుడు మరియు పార్వతీదేవి దంపతుల వివాహం ఒకరికొకరు సమానమైన ప్రేమలో మునిగిపోవడం వల్ల వీరిద్దరూ అర్థనాదీశ్వరులుగా పిలువబడ్డారు. వీరిద్దరికీ అతీంద్రియ శక్తులు ఉన్నాయి. అయితే ఇవి ఉన్నప్పటికీ, వీరు ఒకరికొకరు సహకరించుకునేవారు. వీరిద్దరూ ఒకరి ప్రశ్నలకు ఒకరు సమాధానాలు చెప్పుకునేవారు. వీరి రహస్యాలను కఠినమైన కథనాలతో చెప్పేవారు.

ప్రేమలో గౌరవం..
వైవాహిక జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రేమించుకోవడం అనేది చాలా ముఖ్యం. అయితే ఆ సంబంధంలో కూడా గౌరవం ఉండాలి. ప్రస్తుతం చాలా మంది జంటలు సంబంధాలలో గౌరవం లేకుండా కొనసాగుతూనే ఉన్నారు. అయితే శివపార్వతుల విషయానికొసతే, వారిరువురు గౌరవం విషయంలో తమ జీవితాలను త్యాగం చేయడానికి కూడా వెనుకాడలేదు.

విజయవంతమైన వివాహ జీవితానికి..
శివుడు ఒక యోగి మరియు సన్యాసి. అతను ఎల్లప్పుడూ సమాధి వద్దే ఉండేవాడు. అక్కడే ధ్యానం చేసేవాడు. కానీ పార్వతీ దేవి మాత్రం ఇంటి వద్దే హాయిగా ఉండేది. ఎంత దూరంగా ఉన్నా వీరిద్దరి మధ్య ప్రేమ మాత్రం తగ్గలేదు. అందుకే విజయవంతమైన వివాహ జీవితానికి ఈ జంట మంచి ఉదాహరణగా నిలిచింది.



Click it and Unblock the Notifications
