Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
పురుషులు తమ జీవితభాగస్వామితో కూడా పంచుకోని విషయాలేంటో తెలుసా?
చాలా పురుషులు ముఖ్యంగా భర్తలు చాలా విషయాలను తమ భార్యల నుండి దాస్తుంటారు. వారి వ్యక్తిగత విషయాలను జీవిత భాగస్వామితో కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. అసలు పురుషులు ఎలాంటి అంశాలను దాచిపెడతారు, జీవితభాగస్వామికి కూడా చెప్పని ఆ
చాలా మంది ఆడవాళ్లు పురుషుల గురించి తప్పుగా అంచనా వేస్తుంటారు. జీవితం పట్ల లైట్‌గా ఉంటారని, సరళంగా ఉంటారని, పెద్దగా పట్టింపులు ఉండవని, రహస్యాలూ ఏమీ ఉండవని, వారిని చాలా సులభంగా అంచనా వేయవచ్చని అనుకుంటార. కానీ అందరు పురుషులు ఒకేలా ఉండరు. వారిలో కూడా చాలా లోతు ఉంటుంది. వారి వ్యక్తిత్వంలో, వ్యక్తిగత జీవితంలో చాలా పొరలు ఉంటాయి. దాని కింద భావోద్వేగాలు, కోరికలను అణిచిపెట్టి ఉంటారు. పురుషులు కూడా రహస్యాలను దాచిపెట్టగలరని చాలా మంది లేడీస్‌కు తెలియదు.

చాలా పురుషులు ముఖ్యంగా భర్తలు చాలా విషయాలను తమ భార్యల నుండి దాస్తుంటారు. వారి వ్యక్తిగత విషయాలను జీవిత భాగస్వామితో కూడా చెప్పుకోవడానికి ఇష్టపడరు. అసలు పురుషులు ఎలాంటి అంశాలను దాచిపెడతారు, జీవితభాగస్వామికి కూడా చెప్పని ఆ విషయాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వారికి కూడా మద్దతు అవసరం:
ప్రతి వ్యక్తికి మద్దతు అవసరం. భావోద్వేగ మద్దతు కోసం ప్రతి వ్యక్తి చూస్తారు. దానికి ఆడ, మగ అనే తేడాలు అవసరం లేదు. ఎమోషనల్ సపోర్ట్ కావాలని మహిళలు అడిగినట్లుగా పురుషులు అడగరు, అడగలేరు. కానీ వారికి ఆ అవసరం ఉంటుంది. తమను ఎవరైనా ప్రేమించాలని, చెడు సమయాల్లో, కష్ట సమయాల్లో వారికి మద్దతు ఇవ్వాలని, ఒత్తిడి నుండి బయటపడటానికి సహాయం చేయాలని వారు కూడా కోరుకుంటారు. కానీ నోరు తెరిచి అడగలేరు. జీవిత భాగస్వామికి కూడా ఈ విషయం చెప్పరు.

పురుషులు కూడా భయపడతారు, కానీ చెప్పరంతే:
భయం ఎవరికైనా ఉంటుంది. భయం, బాధ భావోద్వేగాలు. వాటికి ఆడ, మగ అనే తేడా లేదు. అయితే భయాన్ని, బాధను బలహీనతగా అనుకోవడం వల్ల చాలా మంది పురుషులు వాటిని బహిరంగంగా వ్యక్తపరచడానికి ఇష్టపడరు. భయం గురించి చెప్పినా, బాధ పడుతున్నామని ఎవరికైనా తెలిస్తే చులకన అయిపోతామని, హేలన చేస్తారన్న భయం వారిని భావోద్వేగాల గురించి చెప్పకుండా అడ్డుకుంటుంది.
ఎవరైనా దగ్గరి వ్యక్తులు, సన్నిహితులు, ప్రియమైన వారు, కుటుంబసభ్యులను కోల్పోతే ఆ బాధను కూడా దిగమింగుకుంటారు. కానీ మనసు నుండి బాధను తీసేసేలా ఏడవలేరు.

వాటిని పట్టించుకోరు:
చిన్న చిన్న విషయాలు పురుషులు పెద్దగా పట్టించుకోరు. మహిళలు చిన్న విషయాలను కూడా పెద్దగా చేసినట్లు పురుషులు చేయరు. బంధువులు మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దగా పట్టించుకోరు. అలాంటి వాటిని చాలా లైట్‌గా తీసుకుంటారు. అయితే ఈ వైఖరి కొన్నిసార్లు వారి సంబంధాన్ని సంతోషంగా ఉంచుతుంది. మరి కొన్నిసార్లు ఈ అజాగ్రత్తే పెద్ద తగాదాలకు కారణం అవుతుంది.

అప్పుడు అలా, ఇప్పుడు ఇలా:
చాలా మంది పురుషులు తమ చుట్టూ ఉన్న స్త్రీల వైపు చూస్తారు. వారు స్త్రీల వ్యక్తిత్వాన్ని, రూపాన్ని విశ్లేషిస్తారు. కొన్నిసార్లు వారు ఇష్టపడితే వారితో మాట్లాడాలని కోరుకుంటారు. ఇది వారికి సహజంగానే అలవాటుగా ఉంటుంది. అయితే వారు తమ సన్నిహితులతో ఉన్నప్పుడు వారు ఇతర మహిళలను పెద్దగా పట్టించుకోరు.



Click it and Unblock the Notifications