Latest Updates
-
పెర్ఫ్యూమ్ స్ప్రే చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ డబ్బులు వృథా అయినట్లే.! -
ముంబై రోడ్ సైడ్ తవా పులావ్..మెతుకు కూడా మిగల్చకుండా తినేస్తారు..ఎలా చేసుకోవాలంటే.. -
పనీర్ కర్రీ కూడా పనికిరాదు.. ఈ ఆఫ్ఘానీ సోయా కర్రీ రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
గొంతు నొప్పిని ఒక్క ముద్దతో తరిమేసే వెల్లుల్లి కారం పచ్చడి.. అసలు సిసలైన పద్ధతి ఇదే.! -
చిన్న వయసులోనే మెటబాలిక్ సిండ్రోమ్.. ఇది వ్యాధి కాదు.. కానీ ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.! -
అమ్మ ఎప్పుడు వస్తుంది నాన్నా?.. మేనల్లుడి మోజులో పడి ముగ్గురు పిల్లలను వదిలేసిన తల్లి! -
మైదా లేకుండా హెల్తీగా రైస్ సేమియా.. మ్యాగీ చేసినంత ఈజీగా బ్రేక్ఫాస్ట్ రెడీ.! -
కర్కాటకంలో కుజ, గురు గ్రహాలు.. దురదృష్టం పోయి అదృష్ట జాతకంలో ఉన్న రాశులు ఇవే.! -
సొరకాయతో కరకరలాడే లచ్చా పరాటా.. ఇలా చేశారంటే వదిలిపెట్టకుండా తింటారు -
Japanese weight loss secret: రోజుకు 3 నిమిషాలు చాలు..జిమ్ లేకుండానే పొట్ట, బరువు ఇట్టే తగ్గిపోతాయి!
కరోనా కారణంగా మీ పెళ్లి వాయిదా పడితే కలత చెందకండి... ఈ పనులను చేయండి...
కరోనా వైరస్ కారణంగా మీ వెడ్డింగ్ కార్యక్రమం వాయిదా పడిందా? అయితే వీటి గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.
కరోనా వైరస్ కారణంగా కళ్యాణాల వంటి కార్యక్రమాలకు చాలా వరకు బ్రేక్ పడింది. లాక్ డౌన్ కారణంగా పెళ్లిళ్లకు వచ్చేందుకు ప్రభుత్వాలు కేవలం 50 మందికి మాత్రమే అనుమతినిచ్చాయి.

దీని కారణంగా అందరి ఎదుట గ్రాండ్ గా మ్యారేజ్ చేసుకుందామనుకున్న చాలా మంది కలలు కల్లలుగా మారిపోయాయి.

ఎందుకంటే మన దేశంలో పెళ్లి వంటి కార్యక్రమాలు ఎన్నో నెలలు ముందునుండే సిద్ధమవుతూ ఉంటారు. కానీ కారణంగా అవన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. అయితే దీనికే మీరు కలత చెందాల్సిన పని లేదు.

జీవితం అంటే కళ్యాణం ఒక్కటే కాదు.. కాబట్టి మీరు సురక్షితంగా ఉంటే చాలు. వివాహం మరికొంత కాలం వేచి ఉండి కూడా చేసుకోవచ్చు.

అయితే సామాన్య వ్యక్తులే కాదు సెలబ్రెటీలు కూడా కరోనా కారణంగా తమ కళ్యాణాన్ని వాయిదా వేసుకున్నారు. అందులో రానా, నితిన్ ఇది వరకే వారి వివాహ వివరాలను ప్రకటించారు.

అయితే హీరో నిఖిల్, నిర్మాత దిల్ రాజు, జబర్దస్త్ మహేష్ మాత్రం అతి తక్కువగా బంధువులను పిలిచి, వారి సమక్షంలో పెళ్లిళ్లు చేసుకున్నారు. ఇక మీరు ఇప్పుడు వివాహం వాయిద పడింది కాబట్టి వెంటనే ఈ పనులను వేగంగా చేసేయ్యండి...

తదుపరి తేదీలు...
ఇది వరకే నిర్ణయించిన మూహుర్తానికీ, తేదీలలో పెళ్లి కాకపోతే, మీరు వెంటనే తరువాత మళ్లీ ఎప్పుడు మంచి ముహుర్తం ఎప్పుడు ఉందో తెలుసుకునేందుకు ప్రయత్నించండి. ఎందుకంటే ఈ కరోనా భూతం ఎంతకాలం ఉంటుందో ఎవ్వరికీ తెలియదు.

పూర్తిగా అన్ లాక్ అయితే...
ఒకవేళ కరోనా వైరస్ కు విరుగుడు కనిపెట్టి.. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి.. లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తివేస్తే, అలాంటి తేదీలలో ముహుర్త సమయంలో వివాహం చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి.

ఫంక్షన్ హాల్స్ మరియు అలంకరణ..
మీరు మీ వివాహం కోసం ఇదివరకే ఫంక్షన్ హాల్స్ ను బుక్ చేసుకుని ఉంటే, మీరు వివాహ తేదీని వాయిదా వేసుకున్న విషయాన్ని వారికి తెలియజేయండి. మళ్లీ కొత్త ముహుర్తం పెట్టిన వెంటనే తెలియజేస్తామని సమాచారమివ్వండి. అలాగే డెకరేషన్ వారికి ఈ వివరాలను తెలియజేయ్యండి.

అతిథులకు చెప్పండి...
వివాహం వంటి ముఖ్యమైన ఘట్టం కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని మాకు తెలుసు. మీరు మీ వివాహం గురించి ఇది వరకే పత్రికలు ప్రింటింగ్ చేయించి, వాటిని పంపిణీ చేసి ఉంటే, వెంటనే వారికి పెళ్లిని వాయిదా వేసిన విషయం గురించి వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా తెలియజేయండి.

ఖర్చుల వివరాలు..
వివాహాన్ని వాయిదా వేయడం అనేది అంత సులభం కాదు. వివాహంలో వంటల మెనూ నుండి బట్టలు, నగలు, ఆభరణాలు గిఫ్ట్ ల వరకూ ఇలా ఎన్నింటి గురించో ఎక్కువగా లెక్కలేయాలి. అలాగే చాలా నష్టాన్ని కూడా భరించాల్సి ఉంటుంది. మీరు మరో కొత్త తేదీని మరియు ముహుర్తం పొందడం అనే విషయం కూడా అంత సులభమేమీ కాదు. అందుకే మరోసారి ఓపికగా కూర్చొని ఖర్చుల జాబితాను రూపొందించండి. దీని వల్ల నష్టం గురించి ఒక అవగాహన వస్తుంది.



Click it and Unblock the Notifications
