Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
మ్యారేజ్ లైఫ్ బోర్ కొడుతుందా.. ప్రతిరోజూ రొమాంటిక్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
జీవితం అంటే పెళ్లికి ముందు ఆ తర్వాత అని అంటుంటారు. అప్పటివరకూ తల్లిదండ్రుల పర్యవేక్షణలో పెరిగిన యువతీయువకులు వివాహ జీవితంలోకి అడుగుపెట్టాక చాలా మారిపోతాయి. భాగస్వామి రాకతో కొత్త బంధాలు, బాధ్యతలతో ఎన్నో అనుభవాలు ఉంటాయి. ఈ క్రమంలో తొలినాళ్లలో బాగానే ఉన్నా.. కాలం గడుస్తున్న కొద్దీ దంపతుల మధ్య మొదట్లో ఉన్న ప్రేమ తగ్గిపోతుందనేది వాస్తవం. అయితే ఏళ్లు గడుస్తున్నా మ్యారేజ్ లైఫ్ బోర్ కొట్టకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు.

వివాహ బంధంలో కాలం గడిచేకొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగం, వ్యాపారంలో ఒత్తిడి, కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకం, ఆర్థిక వ్యవహారాలు, ఇబ్బందులు ఇలా పలు రకాల కారణాలతో భాగస్వామితో ప్రేమతో గడిపే సందర్భాలు తగ్గిపోతుంటాయి. దీంతో పెళ్లయిన తొలినాళ్లలో దంపతుల మధ్య ఉన్న శారీరక, మానసిక కెమిస్ట్రీ క్రమంగా తగ్గిపోతుంది. ఒకరికొకరు సమయం కేటాయించుకోలేకపోవడంతో మ్యారేజ్ లైఫ్ విసుగ్గా అనిపించడం సహజమని.. మీ బంధంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా ఆ మాధుర్యాన్ని మళ్లీ పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
ఏకాంత సమయం అవసరం
ఇంట్లో పెద్దవాళ్లు, పిల్లలు ఉన్నప్పుడు భార్యాభర్తలు మాట్లాడుకోవడానికి సమయం దొరకదు. ఇక ఫోన్లు, సోషల్ మీడియా, టీవీల పుణ్యమా అని వాటి ధ్యాసలో పడి భాగస్వామితో మాట్లాడటం మరిచిపోతున్నారు. ఈ క్రమంలో ఎంత బిజీ లైఫ్ అయినా భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి సమయం తప్పనిసరిగా కేటాయించుకోవాలని చెబుతున్నారు. రోజులో సంతోషకరమైన విషయాలను మాత్రమే పంచుకోవడం, భాగస్వామిని ఆకర్షించేలా అందంగా తయారవడం వంటి వాటి ద్వారా ఇరువురిలో ఉత్తేజాన్ని పెంచే హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. దీంతో వారి బంధం నీరసించిపోదు.
రొటీన్ లైఫ్ వద్దు
భార్యాభర్తలు ఉద్యోగాలు, ఇంటి బాధ్యతల్లో నిమగ్నమవుతూ ప్రతి రోజూ అవే పనుల్లో ఉండటం ద్వారా లైఫ్ రొటీన్‌గా సాగిపోతుంది. దీంతో ఒకానొక పరిస్థితుల్లో జీవితం విసుగు పుడుతుంది. ఇలాంటి సమయాల్లో అప్పుడప్పుడూ కొత్త ప్రదేశాలకు వెళ్లడం, టూర్లు ప్లాన్ చేసుకోవడం వంటి వాటి ద్వారా జంట మధ్య కొత్త అనుభవాలు పెంపొందించుకోవచ్చు. దీని ద్వారా వారి మధ్య ఉత్సాహం పెరిగి, బంధం బలపడుతుంది.
ప్రశంసలు అవసరం
దంపతుల మధ్య అభినందనలు, ఒకరికొకరులో నచ్చినవి చెప్పుకోవడం వంటివి తగ్గిపోతున్నాయి. భాగస్వామి తన కోసం, కుటుంబం కోసం ఏం చేసినా ఆ పనులను లైట్ తీసుకుంటారు. అందులోని ప్రేమను వారు గుర్తించరు. కానీ చిన్న అభినందన వారిలో సంతోషాన్ని మరింత పెంచుతుంది. భార్య చేసిన వంటలను మెచ్చుకోవడం, భర్త ఏదైనా కానుక తీసుకువస్తే ధన్యవాదాలు చెప్పి హగ్ చేసుకోవడం వంటివి వారి బంధంలో బలమైన భావోద్వేగాన్ని ఏర్పరుస్తుంది.

అభిప్రాయ భేదాలు
భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడూ అభిప్రాయ భేదాలు రావడం సహజం. అయితే వాటిని గొడవలుగా మార్చకూడదు. వారి ఆలోచనలు, అభిప్రాయాలు, ఇష్టాలను గౌరవిస్తూ సమస్యను సున్నితంగా పరిష్కరించుకోవాలి. వారి వారి దృక్కోణంలో నుంచి ఆలోచిస్తూ భావాలను గౌరవించుకోవాలి.
ప్రేమను వ్యక్తపరచాలి
భార్యాభర్తలకి ఎన్ని బాధ్యతలు ఉన్నా వారి బంధాన్ని మరింత బలపరిచేది ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ. ఆ ప్రేమను అప్పుడప్పుడూ వ్యక్తపరుస్తూ ఉండాలి. భాగస్వామితో ప్రేమగా మాట్లాడుతూ ఉండటం ద్వారా ఒత్తిడి తగ్గుతుంది. దంపతులు తమ జీవితంలోని ప్రత్యేకమైన రోజులను గుర్తుంచుకుని చిన్న చిన్న సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం ద్వారా అనుభూతులు పెరిగి దశాబ్దాల బంధమైనా ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గదని మనస్తత్వ నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
