Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
Mother quotes : ముందు అమ్మ..ఆ తరువాతే భగవంతుడు.. ఎందుకంటే బ్రహ్మను సృష్టించింది కూడా అమ్మే..!
ఒక సారి గూగుల్ లో ప్రపంచంలో అందరూ ఎక్కువగా వెతికే పదం ఏదీ అని చూస్తే అమ్మ అని తెలిసిందట. ప్రపంచంలో అమ్మకి మించిన పదం అమ్మకు మించింది ఇంకేమి ఉంటుంది. ఎక్కువగా కవితలు పుస్తకాలు రాసింది కూడా అమ్మ పైనేనట. మాతృ దినోత్సవం సందర్బంగా అమ్మ గురుంచి చెప్పిన అమ్మ పై వచ్చిన మంచి కొటేషన్స్ ని మీకోసం అందిస్తున్నాం.
అమ్మ పై అద్భుతమైన కొటేషన్స్
ఈ భూమిపై పవిత్రమైన సరైన ప్రేమ ఏదైనా వుందీ అంటే అది తల్లీ బిడ్డల మధ్య ఉన్నా ప్రేమే.
తల్లితో గడిపిన ప్రతీ రోజూ అద్భుతంగా ఉంటుంది.
అమ్మ నా పక్కన ఉంటే నాకు కొండంత బలం ఉన్నట్లు అనిపిస్తుంది.

నా జీవితంలో నా మొదటి హీరో నా మొదటి ప్రాణ స్నేహితుడు మా అమ్మే. ఎందుకంటే మా అమ్మ నన్ను ప్రోత్సహించినంతగా ఎవ్వరూ నన్ను ప్రోత్సహించరు.
ఈ భూమి పై అమ్మ ప్రేమ కంటే శక్తివంతమైనది ఏదీ లేదు.
అమ్మ మాట, అమ్మ గొంతు విన్నప్పుడల్లా నాకు పోగొట్టుకున్న శక్తి తిరిగి వచ్చినట్టు అనిపిస్తుంది.
నువ్వు నా జీవితంలో మొదటి మహిళ కావడం నాకు చాలా సంతోషంగా ఉందమ్మా.
నేను నీకు రాజకుమారుడిని కావొచ్చు కాని నువ్వు మాత్రం నాకు మహారానివి అమ్మ.
ఈ భూమిపై దేవుడు మనకు పంపించిన గొప్ప బహుమతి అమ్మ.
అమ్మ ఎవరి స్థాన్నాన్నైనా తీసుకోవచ్చు కానీ అమ్మ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు
నాకు ఒకే ఒక్క ప్రేమపై నమ్మకం ఉంది అది మా అమ్మ ప్రేమ పైనే.
అమ్మ వడికన్నా వెచ్చనైనది.. అమ్మ వడికన్నా సురక్షితమైనది ఈ భూమిపై ఏదీ లేదు.
ఈ అబద్ధపు ప్రపంచంలో ఉన్నా ఒకే ఒక్క నిజం అదే అమ్మ.
దేవుడు అన్ని ప్రదేశాల్లో ఉండలేదు అందుకే మనకు అమ్మని అందించాడు.
అందమైన పువ్వుకంటే అమ్మ ప్రేమ మరింత అందంగా స్వచ్చంగా ఉంటుంది.
జీవితంలో నాకున్న మొదటి మధుర జ్ఞాపకాల్లో నువ్వే ముందు ఉన్నావు అమ్మ.
మనం చీకట్లో ఉన్నప్పుడు మనల్ని గుర్తించేది వెలుగునిచ్చేది అమ్మ.
అమ్మ ప్రేమకన్నా గొప్పదైనది పెద్దది ఏదీ లేదు.
ఇప్పటి వరకు నేను కొంతైనా సంతోషంగా ఉన్నానంటే అది మా అమ్మ వల్లే.
మనకు అతి పెద్ద సమస్య వచ్చినప్పుడు మనకు గుర్తుకువచ్చేది అమ్మ, మనకు వెళ్లాలనిపించేది అమ్మ దగ్గరికే.
అమ్మ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నా. నీ ఋణం ఎప్పటికీ తీర్చుకోలేను. నేను సంతోషంగా ఉన్నానంటే. నా ముఖం పై చిరునవ్వు ఉందంటే దానికి కారణం నువ్వే.
నేను జీవితం గురుంచి ఎక్కువగా నేర్చుకున్నది మా అమ్మ నుంచే.
తల్లిగా ఉన్నప్పుడు ఏ నిర్ణయాలైనా ఆచి తూచి నిర్ణయం తీసుకుంటుంది. అలా పుట్టిన దగ్గరి నుంచి మనకోసం ఎక్కువగా తపన పడేది ఆలోచించేది తల్లి మాత్రమే.
అమ్మను చూడడంతోనే నా జీవితం మొదలైంది.
అమ్మ ప్రేమ ఒక్కటే నిజం మిగతా ప్రేమలన్నీ అబద్దం.
అమ్మకు మనం ఎప్పుడూ కృతగ్నులమే. అమ్మ రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. అమ్మకు ఎంత సేవ చేసినా తక్కువే. అమ్మను పూజిస్తే, గౌరవిస్తే ధనం, సంతోషం, లాభం, సౌఖ్యం అన్నింటినీ ఆ భగవంతుడు కల్పిస్తాడు.



Click it and Unblock the Notifications
