Latest Updates
-
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.!
ప్రేమంటే రొమాన్స్ మాత్రమేనా.. ఎన్ని రకాలు ఉన్నాయో తెలిస్తే ఇట్టే లవ్‌లో పడిపోతారు.!
ప్రేమ అంటే ఏమిటి.. అది ఎప్పుడు, ఎవరిపై కలుగుతుంది.. ఆ భావనను వర్ణించండి.? ఇలాంటి ప్రశ్నలకు ఎవరూ సరైన సమాధానం చెప్పలేరు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకమైన అనూభూతిని ఆస్వాదిస్తారు. కొందరు ప్రేమను కేవలం శృంగార సంబంధాలకే పరిమితం చేస్తారు. అయితే అది తప్పు. ప్రాచీన గ్రీకుతత్వ శాస్త్రం ప్రకారం ప్రేమ 8 రకాలను కలిగి ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం..

ప్రేమ అంటే ఎవరికైనా ముందుగా గుర్తొచ్చేది ఆకర్షణ, అనురాగం, రొమాన్స్. ఈ మూడింటి కలయికే ఈరోస్. భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య ఈ ఫీలింగ్ సర్వసాధారణం. ఇక వీటికి అతీతంగానూ కొన్ని జంటల మధ్య ఇలాంటి భావనలతో ప్రేమ కలుగుతుంది. ఈ బంధంలో ప్రధాన ఉద్దేశం శృంగారంగా ఉంటుంది.
భార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే ప్రేమకు విభిన్నమైనది స్నేహితుల మధ్య ప్రేమ. అదే ఫిలియా. ఫిలియా బంధంలో ఒకరిపై ఒకరికి నమ్మకం, విధేయత, గౌరవం, భావోద్వేగ అనుబంధాలపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరి మధ్య నిజమైన స్నేహం ఉంది ఉంటే అది ఈ రకమైన ప్రేమతోనే నిరూపించవచ్చు.
కుటుంబీకుల మధ్య ఉండే ప్రేమను స్టోర్జ్ అంటారు. ఇది తల్లిదండ్రులకు పిల్లల పైన, పిల్లలకు పేరెంట్స్‌పైన ఉండే అనురాగ సంబంధాలకు ఇది ఉదాహరణ. ఈ బంధంలో ఒకరిపై ఒకరికి భద్రతా భావం ఉంటుంది. నిస్వార్థమైన అనురాగం ఇమిడి ఉంటుంది. బాధ్యతల ద్వారా తమ ప్రేమను నిరూపించుకోవడమే స్టోర్జ్.
ఇద్దరి మధ్య షరతులు లేని ప్రేమను అగాపే అంటారు. ఇందులో జంటల మధ్య స్వప్రయోజనాలు, స్వార్థాలు ఉండవు. ఒకరి అభిప్రాయాలకు, ఆలోచనలకు మరొకరు ఎక్కువ విలువ ఇస్తారు. ప్రేమించిన వ్యక్తి లేదా బంధమేదైనా మరోవ్యక్తి శ్రేయస్సుకి ప్రాధాన్యత ఇచ్చి వారిపై గౌరవాన్ని చాటుకుంటారు. ఒక నిర్దిష్టమైన సంబంధానికి అగాపే పరిమితం కాదు.
బంధం ఏదైనా వారి మధ్య మితిమీరిన అనుబంధం, కట్టడి చేయడం, అసూయ ఏర్పడటం భావోద్వేగంగా వారిపై ఆధారపడటం వంటివి అబ్సెసివ్ ప్రేమ కిందికి వస్తాయి. దీని ద్వారా వారి మధ్య బంధం పదిలంగా ఉండదు. ఉద్రిక్తతలు, గొడవలు, ఈగోలతో బంధాలు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు ఉంటాయి.
ప్రేమ అంటే ఒక వ్యక్తికి మరో వ్యక్తిపై ఉండే ఇష్టం, బాధ్యతలు అనుకుంటాం. కానీ ఇతరులను ప్రేమించడం ఎంత ముఖ్యమో.. అంతకంటే ముందుగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం కూడా అంతే ముఖ్యం. దీనినే ఫిలౌటియా అంటారు. ఈ రకం ప్రేమలో ఆత్మగౌరవం, స్వీయ సంరక్షణ, స్వంత ఆనందానికి విలువ ఇవ్వడం అవసరం. గతంతో పోలిస్తే నేటి ఆధునిక కాలంలో ఫిలౌటియా రకం ప్రేమకు ఆదరణ పెరుగుతోంది.

మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రేమలో సహనం, అవగాహన, బాధ్యత, ఒకరిపట్ల మరొకరికి అంకితభావం అనేవి పెరుగుతూ వస్తున్నాయి. దీనినే ప్రగ్మా రకం అని అంటారు. ఒక బంధం ఎక్కువ కాలం విజయవంతంగా కొనసాగుతుంది అంటే ఆ బంధంలో ప్రగ్మా రకం ప్రేమ కీలక పాత్ర పోషిస్తోంది అని అర్థం.
కొన్ని ప్రేమ బంధాలు ఎప్పుడూ తేలికగా, సరదాగా సాగుతుంటాయి. గొడవలు, అలకలు, మనస్పర్థలు తక్కువగా ఉంటాయి. సరసాలు, జోకులు, ఒకరిని ఒకరు ఆటపట్టించుకోవడం, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాంటివి ఎక్కువగా ఉంటాయి. దీనినే లూడస్ అంటారు. ఇలాంటి బంధంలో ఇద్దరి మధ్య భావోద్వేగ బంధాలు ఎక్కువగా ఉండటంతో పాటు ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది.



Click it and Unblock the Notifications
