Latest Updates
-
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో డయాబెటిస్ బాధితులకు ఇన్ఫెక్షన్ ముప్పు మరింత తీవ్రం.. కారణాలివే.! -
పచ్చి కొబ్బరి మసాలాతో అదిరిపోయే కర్ణాటక స్పెషల్ చిత్రాన్నం.. ఒక్కసారైనా రుచి చూడాల్సిందే.! -
గురు గ్రహం నక్షత్ర మార్పు: ఈ నాలుగు రాశుల వారికి చదువు, ఉద్యోగాల్లో మహర్దశ ప్రారంభం.! -
ఇంట్లోకి గబ్బిలం వస్తే శుభమా? అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
చికెన్ కర్రీలోకి అదిరిపోయే కాంబినేషన్.. కేరళ మలబార్ పరోటా ఇలా చేస్తే పొరలు పొరలుగా వస్తుంది! -
అల్లం, పచ్చిమిర్చి ఘాటుతో కరకరలాడే పంచ్ మెల్ దాల్ పకోడా.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు! -
బ్రెయిన్ ఫాగ్ అంటే ఏంటి? గుండె జబ్బులకు ఇది ముందస్తు సంకేతమా! -
ఆకు కూరల కంటే ఎక్కువ బలం: మోకాళ్లలో గుజ్జు రప్పించి, ఎముకల్ని గట్టిగా చేసే నల్లేరు రోటి పచ్చడి -
Fridge Vastu: మీ ఇంట్లో ఫ్రిజ్ పైన ఈ 3 వస్తువులు పెడితే పట్టిందల్లా బంగారమే!
శాడిస్ట్ పెళ్లాంతో తట్టుకోలేకపోతున్నా: భార్య శృంగార కోరిక తీర్చలేక..పోలీస్ స్టేషన్ లో భర్త కంప్లెయింట్!
తన భార్య, అత్తమామలు తనను శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా దారుణంగా వేధించారంటూ 37 ఏళ్ల ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. కర్ణాటక రాజధాని బెంగళూరులో తాజాగా వెలుగుచూసిన ఈ ఘటన అందరినీ షాక్ కి గురిచేస్తోంది. అసలేం జరిగిందో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
అసలేం జరిగిందంటే?
బెంగళూరులోని నాగరభావికి చెందిన బాధిత యువకుడు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. 31 ఏళ్ల శిల్పను బాధిత వ్యక్తి ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత ఈ దంపతులు జక్కూరులోని ఒక విలాసవంతమైన విల్లాకు షిప్ట్ అయ్యారు. అక్కడే అసలు కథ మొదలైంది.

కాపురంలో అత్తమామల జోక్యం మితిమీరిపోయిందని బాధితుడు ఆరోపిస్తున్నాడు. అత్తగారు ఆశా.. తన కూతురికి ఇంతకంటే ధనవంతుడైన వరుడిని తీసుకువస్తానని, ఆమెను వదిలేయాలని అల్లుడిని మానసికంగా హింసించడం మొదలుపెట్టింది. ఇంట్లోకి కూడా రాకుండా అడ్డుకుంది. మరోవైపు మామగారు మాధవ్ కృష్ణ ఏకంగా ఇంటికి రౌడీలను పంపి బెదిరింపులకు పాల్పడ్డాడని బాధితుడు తన ఫిర్యాదులో వాపోయాడు.
భార్య లైంగిక వేధింపులు.. సంచలన నిజాలు
ఇక భార్య శిల్ప తీరు మరింత దారుణంగా ఉందని భర్త ఆరోపించాడు. తన ఆర్థిక పరిస్థితిని చులకన చేస్తూ, తన రిచ్ ఫ్రెండ్స్ తో కలిసి నిత్యం పార్టీలు, పబ్బులు, మందు తాగుతూ కాలం గడిపేదని తెలిపాడు. అంతేకాదు, ఆమె తనను లైంగికంగా తీవ్రంగా వేధించిందని సంచలన ఆరోపణలు చేశాడు. అసభ్యకరమైన వీడియోలు పంపి, అందులో ఉన్నట్లుగా ప్రవర్తించాలని ఒత్తిడి చేసేదట.
దారుణం ఏమిటంటే.. తన స్నేహితురాలితో (మరో మహిళతో) శృంగారంలో పాల్గొనాలని బలవంతపెట్టడమే కాకుండా, తమ పడకగది విషయాలను ఇతరులతో పంచుకోవాలని పట్టుబట్టేదని ఆవేదన వ్యక్తం చేశాడు. తన మాజీ ప్రియులతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఆమె స్వయంగా అంగీకరించిందని భర్త తెలిపాడు.

కట్టుబట్టలతో గెంటివేత.. ఆభరణాల దోపిడీ
ఈ నరకం భరించలేక జూలై 4, 2024న రెండు కుటుంబాల పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టాడు. అయినా పరిస్థితి మారలేదు. సెప్టెంబర్ 24న అతడిని ఇంట్లో నుంచి గెంటేశారు. భార్యను ఆమె తల్లి చెన్నైకి తీసుకెళ్లిపోయింది. తనను కేవలం యూనిఫాం, ఓ ల్యాప్ టాప్ తో మాత్రమే బయటకు పంపించారని బాధితుడు తెలిపాడు.
ఇంట్లో ఉన్న రూ. 1.87 లక్షల నగదు, బంగారం, ఇతర వెండి వస్తువులతో పాటు తన పాస్ పోర్ట్, ఒరిజినల్ సర్టిఫికెట్లను వారు లాక్కున్నారని పోలీసులకు తెలిపాడు. కనీసం పెళ్లి నాటి మధుర స్మృతులు కూడా మిగల్చకుండా ల్యాప్ టాప్ లోని ఫోటోలు, వీడియోలను డిలీట్ చేసి తనను తీవ్ర మానసిక క్షోభకు గురిచేశారని కన్నీటిపర్యంతమయ్యాడు.
కథలో ఊహించని ట్విస్ట్..
తన వస్తువులు తనకు ఇప్పించి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అతను పోలీసులను కోరాడు. ఈ మేరకు బెంగళూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ వ్యవహారంలో మరో ఊహించని మలుపు ఉంది.
భార్య కూడా ఏమాత్రం తగ్గకుండా భర్తపై తమిళనాడులో ఎదురు కేసు (కౌంటర్ ఎఫ్ ఐఆర్) నమోదు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా వీరిద్దరి మధ్య కోర్టులో కూడా ఓ కేసు నడుస్తోంది.ఈ హై డ్రామాలో అసలు నిజాలు ఏమిటనేది పోలీసుల దర్యాప్తులోనే తేలాల్సి ఉంది.



Click it and Unblock the Notifications
