Latest Updates
-
కూరలను కూడా పక్కన పెట్టి కడుపు నిండా తినేలా చేసే కాలీఫ్లవర్ పచ్చడి.. ఆవకాయ కంటే ఈజీగా.! -
దివ్యమైన మంగళ గోచారం: 55 రోజుల పాటు ఈ నాలుగు రాశుల వారికి రాజయోగమే.! -
బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్ గా.. ఇంట్లో ఉన్న వాటితోనే క్రిస్పీ పొటాటో రింగ్స్..ఎలా చేసుకోవాలంటే.. -
కొవ్వు తక్కువ, పోషకాలు ఎక్కువ..థైరాయిడ్ పేషెంట్లకు మఖానా ఎందుకు బెస్ట్? -
అసలైన అంబూర్ చికెన్ బిర్యానీ సీక్రెట్ ఇదే.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి! -
రియల్ లైఫ్ బిచ్చగాడు.. వేల కోట్ల ఆస్తి వదిలి ముంబై వీధుల్లో అడుక్కుంటూ..! -
పితృ పక్షాలకు ముందు అరుదైన కలయిక..ఈ 4 రాశుల దశ, దిశ మారనుంది! -
కోల్కతా ఫేమస్ టాంగ్రా డ్రై చిల్లీ చికెన్.. డ్రింక్స్ టైమ్ కి కూడా సూపరో సూపర్..ఎలా చేసుకోవాలంటే.. -
ఇన్ స్టాగ్రామ్ లో అమ్మను బ్లాక్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్ ..దొంగచాటుగా కూతురి వీడియోలు చూసి తల్లి.. -
అయ్యంగార్ స్టైల్ కొబ్బరిపాల రసం.. అమృతంలా ఉంటుంది!
భార్య ఇలా ఉంటే వెంటనే విడాకులు ఇచ్చేయడం బెటర్!..లేకుంటే మీరే పోతారు!
ఆచార్య చాణక్యుడు పేరు వినగానే ఆయన అందించిన నీతి సూత్రాలు గుర్తుకువస్తాయి. వందల సంవత్సరాల క్రితం చాణక్యుడు తన నీతి శాస్త్రం ద్వారా చెప్పిన అమూల్యమైన మాటలు నేటితరానికి కూడా సరిపోలేలీ ఉంటాయి. ఆయన చెప్పిన సూత్రాలు నేటికి ఆచరణీయమైనవి. రాజ్యం గురించే కాకుండా వ్యక్తి జీవితానికి అవరసమైన విలువైన విషయాలను చాణక్యుడు చెప్పాడు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉండే సంబంధాలను వివరించారు.
ఒక వ్యక్తి తన జీవితకాలంలో ఎక్కువకాలం భార్యతోనే కలిసి ఉంటారు. ఈ క్రమంలో భార్య ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నదో తెలుసుకోవాలి. తన భార్య ఏ విధంగా ప్రవర్తిస్తుందో గుర్తించడం చాలా అవసరం అని చాణక్యుడు అంటున్నారు, అయితే చాణక్యుడు చెప్పిన ప్రకారం ఒక వ్యక్తి తన భార్యకు ఇలాంటి లక్షణాలు ఉంటే కలిసి ఉండటం కంటే విడిపోవడమే మంచిదని అంటున్నారు.

ఎలాంటి లక్షణాలు ఉన్న భార్యకు దూరంగా ఉండాలి
-భార్యాభర్తలు అన్యోన్య దంపతుల్లా కలిసి మెలిసి ఉండాలి. కానీ కొందరు ఆడవాళ్ల తమ భర్తలపై పెత్తనం చెలాయించాలని చూస్తారు. ఎప్పుడూ తనదే పైచేయి ఉండాలని చూస్తారు. ఈ క్రమంలో మొగుడు చేసే ఏ పని అయినా ఎగతాళి చేస్తూ చీప్ గా చూస్తారు. ఇలాంటి భార్యతో ఉండటం వల్ల ఎప్పటికైనా ప్రమాదమేనని చాణక్యుడు అంటారు.
-కొంతమంది ఆడవాళ్లు తమకోసం మాత్రమే పనిచేయాలని అనుకుంటారు. భర్త పొద్దంతా ఉద్యోగం చేసి లేదా వ్యాపారానికి వెళ్లి ఇంటికి వస్తే అస్సలు పట్టించుకోరు. కనీసం ఆహారం విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉంటారు.
-కొందరు భార్యలు తమ భర్త గురించి ఇతరులకు చెడు చెబుతుంటారు. తన భర్తలోని మంచి విషయాలను ఏ మాత్రం పట్టించుకోరు. తమ కంటే తమ భర్త తక్కువ అని చెప్పుకునే వారికి దూరంగా ఉండడమే మంచిది అని చాణక్యుడు చెప్పారు.
-అత్యాస ఉన్న భార్య చాలా అనర్థాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చాణక్యుడు చెబుతున్నాడు. భార్యకు అత్యాశ ఉంటే పురుషుడి సంపాదన అంతా భార్య ఖర్చులకే సరిపోతుంది. అందువల్ల ఇలాంటి వారితో విడిపోవడం మంచిదని అంటున్నారు.
-ఆడవాళ్లు సాంప్రదాయంగా ఉండటం వల్ల చక్కగా కనిపిస్తారు. అయితే కొందరు ఏమాత్రం నాగరికత లేకుండా వ్యవహరిస్తారు. పొద్దున్నే సరైన టైంకి నిద్ర లేకపోవడం, ఇంటికి అవసరమైన పనులు చేయకుండా పురుషుడితో ఎక్కువగా పనులు చేయించుకోవాలని చూస్తారు. దీంతో భర్త ఉద్యోగంతో పాటు ఇంట్లోనూ కష్టం ఎదుర్కొంటారు. ఇలాంటోళ్లతో కలిసి ఉండటం వల్ల జీవితాంతం కష్టాలు పడాల్సి వస్తుంది.
-కొందరు స్త్రీలకు అమితంగా కోరికలు ఉంటాయి. భర్తతో కాకుండా ఇతరులతో కలిసి ఉండాలని కోరుకుంటారు. ఈ విషయంలో భర్త వారించినా కూడా వినరు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వస్తాయి. ఆ తర్వాత భర్త గట్టిగా కోప్పడితే వారు అనుకున్నది సాధించలేకపోయామని ఎప్పుడూ భర్తకు దూరంగా ఉంటారు. ఇలాంటి వారి గురించి తెలిసిన వెంటనే వారి నుంచి దూరంగా ఉండటం ఉత్తమమని చాణక్యుడు చెప్పారు.



Click it and Unblock the Notifications
