Latest Updates
-
మీ ఇంటి డాబాపైన ఈ మొక్కలు పెడుతున్నారా.. వెంటనే తీసేయకపోతే ఈ బాధలు తప్పవు.! -
చుక్క నీళ్లు లేకుండా అరటికాయ ముద్ద కూర.. చిక్కటి గ్రేవీతో అన్నం, చపాతీలోకి పర్ఫెక్ట్.! -
ఒత్తయిన జుట్టుకి దివ్య ఔషధం కరివేపాకు నిల్వ పచ్చడి.. ఈ ఒక్కటి కలిపారంటే పది రెట్లు రుచి.! -
భార్యాభర్తలు కలయిక తర్వాత తప్పకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. లేదంటే.! -
మళ్లీ మళ్లీ ప్రేమలో ఎలా పడాలి.. ప్రతిరోజూ రొమాంటిక్గా సాగేందుకు టిప్స్.! -
నోట్లో వేస్తే కరిగిపోయేలా ప్రొటీన్ రిచ్ ఇడ్లీలు.. మినప్పప్పు, రవ్వతో పనిలేదు.! -
మీ ఇంట్లో రోజూ చేసే ఈ 5 పొరపాట్లే షుగర్ వ్యాధికి అసలు కారణం! -
తులసి మొక్క ఇలా మారితే అశుభానికి సంకేతమా.. వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారంటే.! -
ఈ క్యారెట్ పాయసం చేస్తే.. గిన్నెలో ఒక్క చుక్క కూడా వదలకుండా లాగించేస్తారు! -
కారు ఎక్కగానే వాంతులు అవుతున్నాయా.. ఈ రెండూ వెంట ఉంటే చాలు.. వెంటనే రిలీఫ్.!
భాగస్వామి ఫోన్ ను పదే పదే చెక్ చేయడానికి అసలు కారణాలివే..!
ఏదైనా బంధానికైనా నమ్మకం అనే పునాది చాలా గట్టిగా ఉండాలి. అప్పుడే అది కలకాలం ఉంటుంది. అయితే ఈ రోజుల్లో చాలా బంధాలు అనుమానాల వలయంలో చిక్కుకుంటున్నాయి. కొంతమంది తరచుగా తమ భాగస్వామి ఫోన్ ను రహస్యంగా చెక్ చేయడం, వారి వాట్సాప్ చాట్ లు చదవడం లేదా ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసుకోవాలని తహతహలాడటం చేస్తుంటారు.

చాలాసార్లు దీన్ని మితిమీరిన ప్రేమగానో, తమ భాగస్వామిపై ఉన్న శ్రద్ధగానో పొరబడతారు. కానీ వాస్తవానికి అది ప్రేమ కాదు. ఈ అలవాటు వెనుక సంబంధంలో ఉన్న అభద్రతా భావం, దాగున్న భయం, లేదా నమ్మకం సన్నగిల్లడం వంటి మానసిక కారణాలు ఎన్నో ఉంటాయి.
అనుమానం, గత చేదు అనుభవాలు
నిపుణులు చెబుతున్న ప్రకారం.. ఎవరైనా తమ భాగస్వామి ఫోన్ ను పదేపదే తనిఖీ చేయడానికి ప్రయత్నిస్తే, దాని వెనుక ఉన్న అతి పెద్ద కారణం అనుమానం. తమ భాగస్వామి తమకు తెలియకుండా ఏదైనా దాస్తున్నారని లేదా తమ బంధంలో పూర్తిగా నిజాయితీగా ఉండటం లేదనే సందేహం వారిని అలా ప్రేరేపిస్తుంది.
అంతేకాకుండా గతంలో ఎవరి చేతిలోనైనా మోసపోయి ఉన్నా లేదా గత ప్రేమకథలు విఫలమైనా ఆ చేదు అనుభవాల తాలూకు గాయాలు ప్రస్తుత బంధంపై ప్రభావం చూపుతాయి. మళ్లీ ఎక్కడ మోసపోతామో అన్న భయం వారిని అలా ప్రవర్తించేలా చేస్తుంది.
కోల్పోతామనే భయం
చాలామందిలో తమపై తమకే పూర్తి నమ్మకం ఉండదు. నా భాగస్వామి వేరొకరి ఆకర్షణలో పడతారేమో?, నాకంటే మెరుగైన వారు దొరికితే నన్ను వదిలేసి వెళ్లిపోతారేమో? అనే ఆందోళన వారిని నిరంతరం వెంటాడుతుంటుందని నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి అభద్రతా భావంతో ఉన్నప్పుడు, పదేపదే ఫోన్ చెక్ చేయడం ద్వారా తమకు తాము సర్దిచెప్పుకోవడానికి, తాత్కాలిక ఊరట పొందడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ అలవాటు తాత్కాలికంగా మనశ్శాంతిని ఇచ్చినా, దీర్ఘకాలంలో బంధాన్ని లోపలి నుంచే తొలిచేస్తుందని చెబుతున్నారు.
ప్రేమకు, కంట్రోల్ కి మధ్య ఉన్న తేడా
ప్రేమకు, నియంత్రణ లేదా కంట్రోల్ కి మధ్య చాలా సన్నని గీత ఉంటుంది. ఒకరి బాగోగుల గురించి ఆరా తీయడం వేరు, వారి ప్రతి కదలికపై నిఘా పెట్టడం వేరు. మీ భాగస్వామి ఎక్కడున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? ఫోన్ లో ఎవరితో చాట్ చేస్తున్నారు? అని ప్రతిక్షణం తెలుసుకోవాలని పట్టుబట్టడం ప్రేమ అనిపించుకోదు. అది వారి జీవితాన్ని శాసించాలనుకునే నియంత్రణ వైఖరి అవుతుంది. ఇలాంటి ప్రవర్తన బంధంలో అవతలి వ్యక్తికి స్వేచ్ఛ లేదనే భావనను కలిగించి, ఊపిరి సలపనివ్వని వాతావరణాన్ని సృష్టిస్తుంది.

ప్రైవసీ ఎందుకు ముఖ్యం?
భార్యాభర్తలు లేదా ప్రేమికులు అయినప్పటికీ ప్రతి ఒక్కరికీ కొంత వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ)కచ్చితంగా అవసరం. మీరు పదేపదే వారి ఫోన్ చెక్ చేస్తున్నప్పుడు..నాపై నీకు నమ్మకం లేదు అనే బలమైన సంకేతాన్ని పరోక్షంగా పంపుతున్నట్లే. ఇది అవతలి వ్యక్తి మనసును నొప్పించవచ్చు. క్రమంగా చిన్న చిన్న విషయాలకే వాదనలు పెరిగిపోయి, చివరకు అది సంబంధం విడిపోయే స్థాయికి కూడా దారితీయవచ్చు.
పరిష్కారం ఏమిటి?
మీ భాగస్వామిలో తరచుగా ఫోన్ చెక్ చేసే అలవాటు ఉన్నట్లు మీరు గమనిస్తే వెంటనే కోపగించుకొని గొడవకు దిగకండి. సమస్యను సున్నితంగా, ప్రశాంతంగా పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇద్దరూ కూర్చొని మనసువిప్పి మాట్లాడుకోండి. వారి భయాలు ఏమిటి? ఏ అభద్రతా భావం వారిని అలా చేస్తోంది? అనేది అర్థం చేసుకోండి. మీ ఇద్దరి మధ్య ఉన్న అనుమానపు పొరలను పారదర్శకమైన మాటలతో తొలగించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications