Latest Updates
-
ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే! -
పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా -
విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
రాగి జావ తాగుతున్నారా? ఈ నిజం తెలియకపోతే ఎంత తాగినా వేస్ట్! -
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
క్రంచీ, టేస్టీ జీడిపప్పు పకోడి..మస్త్ కిక్కిచ్చే స్నాక్ ఈజీగా చేసుకోండిలా.. -
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ ! -
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా.. -
ఈ చిన్న సీక్రెట్ తెలిస్తే..ఇంట్లోనే క్షణాల్లో రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ,సాఫ్ట్ ఫ్రెంచ్ ఫ్రైస్
విడాకులు తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన 5 కీలక విషయాలు
జీవితంలో ఎప్పుడూ సుఖాలే ఉండవు..ఎప్పుడూ కష్టాలే ఉండవు. కష్టసుఖాల మిశ్రమమే జీవితం అని మన పెద్దలు చెబుతూనే ఉంటారు. భార్యాభర్తల మధ్య కూడా ఎప్పుడూ సంతోషమే ఉండదు..కోపాలు,తాపాలు,అలకలు అన్నీ ఉంటాయి. వైవామిక బంధంలో సర్దుకుపోతుంటే ఒకరినొకరు అర్థం చేసుకుంటే అంతా సక్రమంగానే సాగిపోతుంది. అదే నువ్వెంత అంటే నువ్వెంత అంటే మాత్రం ఇక ఆ కాపురం కోర్టు మెట్లక్కవలసి వస్తుంది. వైవామిక బంధంలో తరుచూ వచ్చే సమస్యలను కొందరు కూర్చొని మాట్లాడుకొని మునుపటిలా బంధం కొనసాగేలా సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకుంటారు..మరికొందరు మాత్రం ఎంత ప్రయత్నించినా గతంలోలా సంబంధాన్ని పునరుద్ధరించలేం ఇక విడాకులే ఈ సమస్యకు పరిష్కారం అని ఓ నిర్ణయానికి వచ్చేస్తుంటారు.
అప్పటిదాకా కొన్నేళ్ల పాటు కలిసి ఉండి విడిపోతే మొదట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ క్రమంగా ఆ బాధను అధిగమించవచ్చు. సమాజంలో ఇలాంటి ఉదాహరణలు బోలెడు ఉన్నాయి.మన చుట్టూ ఉన్నవాళ్లలో ముక్యంగా ఈ రోజుల్లో కుదరకపోతే విడాకులు ఇస్తూ రెండు మూడు పెళ్లిళ్లు చేసుకునేటోళ్లు కూడా ఉన్నారు. మీరు ఇరుక్కుపోయిన సంబంధాన్ని బయటకు లాగితే రెండు వైపులా నిలబడి ఉన్న ఇద్దరూ ఎక్కువగా బాధపడతారు. ఈ పరిస్థితిలో విడాకులు బెస్ట్ ఆప్షన్. ఇలాంటి రిలేషన్ షిప్ సిట్యుయేషన్ లో ఉన్న చాలా మందికి బ్రేకప్ ఎలా అడగాలో అర్థం కాదు. కాబట్టి మీ భాగస్వామిని ఎలా బ్రేకప్ అడగాలో లేదా వారికి ఏమి చెప్పాలో ఇక్కడ చూడండి.

బహిరంగంగా మాట్లాడాలి
చాలా సందర్భాల్లో సంబంధంలో సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం దానిని అంగీకరించలేకపోతుంటాం. నిజానికి సంబంధం ముగిసిపోతోంది, దాని గురించి మనకు ఒక సూచన వచ్చినా మన మనస్సు దానిని అంగీకరించడానికి ఇష్టపడదు. ఇది మీ భాగస్వామి విషయంలో కూడా జరగవచ్చు. అప్పుడు మీరు వారితో బహిరంగంగా మాట్లాడాలి, ఈ సంబంధం ఇకపై పనిచేయడం లేదని వారికి వివరించాలి.
ఇలా చెప్పాలి
మీరు మాట్లాడటానికి సమయం, స్థలాన్ని అర్థం చేసుకోవాలి. నిజానికి, చాలాసార్లు అలాంటి మాటలు చెప్పిన తర్వాత అవతలి వైపు ఉన్న వ్యక్తి దానిని అర్థం చేసుకోవడానికి ఇష్టపడరు. వాళ్లు లేదా మీరు అరచుకోవచ్చు లేదా తగాదా పడే అవకాశం ఉంటుంది..ఇది అసౌకర్య వాతావరణాన్ని సృష్టించే అవకాశం ఉంది. అటువంటి పరిస్థితిని నివారించడానికి మీరు నిశ్శబ్ద ప్రదేశాన్ని ఎంచుకోవాలి. దానికి మీ సొంత ఇల్లు ఉత్తమం. అయితే మీరు వేరే చోటికి వెళ్లే ప్రజలు మిమ్మల్ని ఆ విధంగా గమనించని ప్రదేశాన్ని సెలక్ట్ చేసుకోవాలి.
మీ భాగస్వామి ప్రతిచర్యకు సిద్ధంగా ఉండండి
మొదటగా మీ భాగస్వామి విడాకుల నిర్ణయంపై కోపంగా ఉండవచ్చు,అరుస్తారని లేదా ఏడవవచ్చని మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరు అలాంటి పరిస్థితికి సిద్ధంగా ఉండాలి.
ఏమి చెప్పాలి?
విడాకులు అడగడం అంత తేలికైన విషయం కాదు. కాబట్టి మీ తీవ్రమైన నిర్ణయాన్ని ప్రకటించే ముందు మీరు ప్రశాంతంగా ఏమి చెప్పాలో ఆలోచించాలి. విడాకులు అడుగుతున్నప్పుడు మీ భాగస్వామికి తప్పుడు ఆశలు ఇవ్వడం అస్సలు సరైనది కాదు. విషయాన్ని వారికి తక్కువ స్వరంలో వివరించాలి, ఏ పరిస్థితిలోనైనా ప్రశాంతంగా ఉండాలి.
నిందించకూడదు
విడాకులు కోరుతున్నప్పుడు ఒకరు మరొకరిని నిందించకూడదు. మరొకరు తప్పు చేసినప్పటికీ నిందించకపోవడమే బెటర్. మీరు మీ నిర్ణయం విషయంలో ఎలాంటి రాజీ లేకుండా దృఢంగా ఉన్నారని, కౌన్సెలింగ్ అక్కర్లేదని స్పష్టం చేయాలి. తద్వారా ఎలాంటి గొడవలు లేకుండా పరిస్థితి సద్దుమణుతుంది.



Click it and Unblock the Notifications
