Latest Updates
-
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి! -
ఇడ్లీ, దోసెల్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్..చెట్టినాడ్ స్టైల్ సొరకాయ పచ్చడి..వేళ్లు కూడా నాకేస్తారు! -
మిగిలిపోయిన ఇడ్లీతో పది నిమిషాల్లో స్పైసీ ఇడ్లీ ఫ్రై.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
ఎలాంటోళ్లనైనా మీవైపు తిప్పుకోగలిగే 10 సైకలాజికల్ ట్రిక్స్
ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అనే మాట మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. మొదటిసారి ఎదుటివ్యక్తిని కలిసినప్పుడు వారిని కనుక ఆ సమయంలో ఆకర్షిస్తే ఇక ఎల్లకాలం వారిపై మీపై అదే పాజిటివ్ ఒపీనియన్ ఉంటదని సాధారణంగా చెబుతుంటారు. మనం కొత్త వ్యక్తులను కలిసిన సమయాలలో కూడా కొందరు అయితే ఫస్ట్ మీటింగ్ లోనే ఎదుటివాళ్లను ఆకట్టుకుంటుండటం మనం గమనించవచ్చు. వారు ఫన్నీగా ఉన్నా లేదా సైలెంట్ గా ఉన్నా లేదా చెప్పే మాటలవల్ల కానీ ఎదుటివ్యక్తులు వారివైపు ఎట్రాక్ట్ అవుతారు.
ఆఫీసు మీటింగ్ అయినా, స్నేహితుల పార్టీ అయినా.. అందరి మధ్యలో ప్రత్యేకంగా నిలవాలని, నలుగురి మనసు గెలవాలని ఎవరికి మాత్రం ఉండదు? ఇది కేవలం అందంగా కనిపించడం వల్లనో, గొప్పగా మాట్లాడటం వల్లనే సాధ్యం కాదు. దీని వెనుక కొన్ని సులభమైన, శక్తివంతమైన మానసిక సూత్రాలున్నాయి. పరిశోధనల ఆధారంగా నిరూపించబడిన ఈ 10 చిట్కాలను పాటిస్తే ఎవరైనా మిమ్మల్ని ఇష్టపడకుండా ఉండలేరు..ఎంతటివ్యక్తి హృదయాన్ని అయినా మీరు గెల్చుకోవచ్చు.

పేరుతో పిలవడం
ఒక వ్యక్తికి ప్రపంచంలో అత్యంత ఇష్టమైన, మధురమైన శబ్దం తన పేరు. మీరు ఎదుటివారిని వారి పేరుతో పిలిచినప్పుడు వారికి తెలియకుండానే మీపై ఒక గౌరవం, ఆత్మీయత కలుగుతాయి. ఇది మీరు వారికి ఇస్తున్న విలువికి నిదర్శనం.
ప్రతిబింబించడం
ఎదుటి వ్యక్తి శరీర భాషను సున్నితంగా అనుకరించండి. వారు చేతులు కట్టుకుంటే కాసేపటికి మీరు కూడా అలానే చేయడం లేదా వారి కూర్చునే భంగిమను మార్చడం వంటివి చేయండి. దీన్ని మిర్రరింగ్ అంటారు. ఇది మీ ఇద్దరి మధ్య మనం ఒకటే అనే అదృశ్య బంధాన్ని సృష్టిస్తుంది.
మంచి శ్రోతగా ఉండటం
ఈ ప్రపంచంలో మాట్లాడేవాళ్లే ఎక్కువ..వదిలితేల లొడా లొడా అర్థం పర్థం లేకుండా ఏది పడితే అది మాట్లాడుతూ ఉండేవాళ్లు చాలామందే ఉంటారు.. కానీ ఓపికగా వినేవాళ్లు చాలా అరుదు. మీరు ఎదుటివ్యక్తి మాటలను శ్రద్ధగా, ఆసక్తిగా వింటే వారు మీ సమక్షంలో ఎంతో సురక్షితంగా, సౌకర్యంగా భావిస్తారు.
బలహీనతలను ఒప్పుకోవడం
ఎప్పుడూ పరిపూర్ణంగా కనిపించాలని ప్రయత్నించవద్దు. మీ చిన్న చిన్న పొరపాట్లను లేదా బలహీనతలను సరదాగా అంగీకరించినప్పుడు మీరు మరింత నిజాయితీపరులుగా, నమ్మదగినవారిగా కనిపిస్తారు. దీన్నే సైకాలజీలో ప్రాట్ ఫాల్ ఎఫెక్ట్ అంటారు.
తెలివైన హాస్యం
చిన్నపాటి హాస్యం వాతావరణాన్ని తేలికపరుస్తుంది. అయితే అది ఎవరినీ కించపరిచేలా, ఇబ్బంది పెట్టేలా ఉండకూడదు. సమయస్ఫూర్తితో కూడిన సానుకూల హాస్యం అద్భుతంగా పనిచేస్తుంది.
కళ్లలోకి చూసి మాట్లాడటం
కంటికి కన్ను కలిపి మాట్లాడటం మీలోని ఆత్మవిశ్వాసాన్ని, నిజాయితీని తెలియజేస్తుంది. ఇది ఎదుటి వ్యక్తి మీతో వేగంగా కనెక్ట్ అవ్వడానికి, మీ మాటలను నమ్మడానికి సహాయపడుతుంది.

వ్యక్తిగత విషయాలు పంచుకోవడం
అతిగా కాకుండా మీ గురించి ఒక చిన్న వ్యక్తిగత విషయం పంచుకుంటే, ఎదుటివారు కూడా తమ మనసు విప్పడానికి సిద్ధపడతారు. ఇది సాధారణ సంభాషణను సైతం లోతైన బంధంగా మార్చగలదు.
నిజాయితీగా ప్రశంసించడం
అబద్ధపు పొగడ్తలు తేలిగ్గా తెలిసిపోతాయి. బదులుగా..మీరు ఈరోజు ఇచ్చిన ప్రజెంటేషన్ చాలా స్పష్టంగా ఉంది వంటి నిజాయితీతో కూడిన ప్రశంస వారి మనసులో బలంగా నాటుకుపోతుంది.
సహాయం అందించడం
మొదటి పరిచయంలోనే ఒక చిన్న సహాయం అందిస్తే అది మీపై వెంటనే ఒక సానుకూల దృక్పథం, నమ్మకం ఏర్పడేలా చేస్తుంది.
ఉత్సాహంగా ఉండటం
ప్రతికూలత ఎవరికీ నచ్చదు. మీరు ఉత్సాహంగా, సానుకూల దృక్పథంతో ఉంటే మీ సావాసం ఇతరులకు శక్తినిస్తుంది. ప్రజలు మీతో సమయం గడపడానికి మళ్లీ మళ్లీ ఇష్టపడతారు. కాబట్టి ప్రజల హృదయాలను గెలుచుకోవడానికి మీరు సూపర్‌హీరో కానవసరం లేదు. కొంచెం ఇంగితజ్ఞానం, నిజాయితీ, సరైన హావభావాలు చాలు.



Click it and Unblock the Notifications











