Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
Wife Secret: భార్య తన భర్తకు ఎప్పటికీ చెప్పని సీక్రెట్ ఇదే..భర్త ఆ రహస్యం కనిపెట్టకపోతే పెద్ద ప్రమాదమే!
ఈ రోజుల్లో పెళ్లి అంటే కొందరి కేవలం శృంగారం,వంట చేసి పెట్టే వ్యక్తిని తెచ్చుకోవడం లేదా పిల్లలను కనాలంటే ఎవరో ఒకరు ఉండాలిగా అనే తప్పుడు భావన చాలామందిలో ఉంటోంది. భాగస్వామి ఎందుకు అవసరమో,తమకు పెళ్లి ఎందుకు కావాలో కూడా తెలియక చాలామంది ఈ బంధంలోకి అడుగుపెడుతున్నారు. కట్ చేస్తే కొద్దిరోజులకే విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. సర్దుకుపనోతే సద్దుమణిగే చిన్న చిన్న విషయాలకు కూడా ఇగోలకు పోయి విడాకులు తీసుకుంటున్నారు చాలామంది.
అసలు పెళ్లి అంటే కేవలం రెండు మనసుల కలయిక లేదా ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు..రెండు కుటుంబాల మేళవింపు. ఇదొక పవిత్ర బంధం, ఇద్దరు వ్యక్తులు కలిసి జీవితాంతం సాగించే ఒక మధురమైన ప్రయాణం. ఈ ప్రయాణంలో ప్రేమ, నమ్మకం, బాధ్యతలతో ఇద్దరూ ఒక్కటవుతారు. కాలక్రమేణా రెండు శరీరాలు, ఒకే ఆత్మగా మారిపోతారు. అందుకే భార్యాభర్తల మధ్య దాపరికాలు ఉండవని, ఉండకూడదని అంటారు.

చాలామంది భర్తలు.. తమ భార్యను ప్రాణంగా భావించి, తమ జీవితంలోని ప్రతి రహస్యాన్ని పంచుకుంటారు. నా భార్యకు నా గురించి అన్నీ తెలుసు అని గర్వంగా పక్కనోళ్లకు చెబుతారు. అయితే ప్రతి నాణేనికి రెండో వైపు ఉన్నట్లే ఈ నమ్మకానికి కూడా ఓ కనిపించని కోణం ఉంది. భార్యలు తమ మనసులో భద్రంగా దాచుకున్న ఒక రహస్యం మాత్రం భర్తకు ఎప్పటికీ చెప్పరు. ఆమె దాన్ని ఎన్నడూ బయటపెట్టకపోవడానికి కారణం ఏంటీ, అసలు ఆమె భర్తకు చెప్పని రహస్యం ఏమిటో ఇక్కడ చూడండి.
పెళ్లైన తర్వాత మగాళ్ల జీవితంలో పెద్దగా భారీ మార్పులు ఏవీ రావు. అతను అదే ఇంట్లో, అదే మనుషుల మధ్య తిరుగుతాడు.అయితే ఒక అమ్మాయి జీవితం పెళ్లి తర్వాత పూర్తిగా మారిపోతుంది. పుట్టి పెరిగిన ఇల్లు, తల్లిదండ్రులను వదిలి, ఓ కొత్త ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, భిన్నమైన మనస్తత్వాలు, కొత్త అలవాట్లు వీటన్నింటితో ఆమె సర్దుకుపోవాలి. ఈ క్రమంలో ఆమె మనసులో ఓ నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంది. బయటకు నవ్వుతూ కనిపించినా లోపల ఓ అలజడి, ఓ చెప్పలేని సంఘర్షణ నిరంతరం ఆమెను వెంటాడుతూనే ఉంటుంది.
భార్య ఎన్నటికీ భర్తకు చెప్పని ఆ రహస్యం మరేదో కాదు..పెళ్లయ్యాక ఆమె పడే ఈ మానసిక సంఘర్షణ, సర్దుకుపోవడంలో ఆమె చేసే నిశ్శబ్ద త్యాగం. తన వాళ్లను వదిలి వచ్చానన్న ఒంటరితనం, అత్తవారింట్లో అందరినీ మెప్పించాలన్న ఒత్తిడి, తన ఇష్టాయిష్టాలను చంపుకొని బతకడం.. ఇవన్నీ ఆమె గుండెల్లో చెప్పలేని గాయంగా మిగిలిపోతాయి. ఈ బాధను భర్తతో పంచుకుంటే అతను ఏమనుకుంటాడో, తన కుటుంబాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాడేమోనన్న భయంతో ఆమె మౌనంగానే ఉండిపోతుంది. కాలం గడిచేకొద్దీ ఈ మౌనం ఆమెలో మానసిక వేదనను పెంచుతుంది.
నిపుణులు కూడా చెప్పేది ఇదే.
భర్త చేయాల్సిందల్లా ఒక్కటే
తన భార్య చెప్పలేని ఆ బాధను అర్థం చేసుకోవడం, ఆమె మౌనాన్ని చదవగలగడం భర్త చేయాల్సిన పని. నేనున్నాను అని భార్యకు భరోసా ఇవ్వాలి. ఆమె పడే ఆవేదనను పంచుకొని, తన గుండెపై భారాన్ని తేలిక చేయాలి. భర్త ఆమెకు అండగా నిలిచినప్పుడు, ఆమె పడే సంఘర్షణను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే ఆ వివాహ బంధం పరిపూర్ణమవుతుంది. అప్పుడే వారు నిజంగా రెండు శరీరాలు, ఒకే ఆత్మ అవుతారని నిపుణులు చెబుతున్నారు.



Click it and Unblock the Notifications
