Latest Updates
-
భోజనం తర్వాత అస్సలు ఉండకూడని అలవాట్లు.. లేదంటే ఇట్టే బరువు పెరిగేస్తారు.! -
కుల దేవత పూజ ఎందుకు తప్పనిసరి? ఇంట్లో శాంతి, అభివృద్ధి కోసం పూర్వీకులు చెప్పిన నియమాలు ఇవే! -
‘నాకే కనక కొడుకు పుడితే’.. హద్దు మీరుతున్న హాస్యం.. స్టాండప్ కమెడియన్ ఓల్డ్ వీడియోపై రచ్చ.! -
డేటింగ్లో పార్ట్నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.! -
యువకులను ఆకర్షిస్తున్న ‘లుక్స్మాక్సింగ్’ ట్రెండ్.. గాడి తప్పితే బాడీ షెడ్డుకే.! -
వారానికోసారైనా మునగాకు రసం తింటే.. మందుల ముచ్చటే ఉండదు.! -
ఉదయాన్నే కాఫీ, టీ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్లలేకపోతున్నారా.. ఇక మీ బాడీ రిస్క్‌లో పడినట్లే.! -
జూన్ 16, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తోంది.. ఆర్థికంగా ఊహించని లాభాలు మీ సొంతం! -
సంతానలేమి సమస్యలకు పరిష్కారం.. భార్యాభర్తలు తప్పక చేయాల్సిన యోగాసనాలివే.! -
గురు పుష్య అమృత యోగం: ఈ రోజు బంగారం కొంటే మీ జాతకం మారుతుందా?
Relationship Tips: శృంగార సమయంలో పురుషులు చూసేది వీటినే, ఏంటో తెలుసా?
ప్రతి దాంపత్యంలో తప్పనిసరిగా ఉండాల్సినది శృంగారం. శృంగారం వల్లే ఇద్దరు వ్యక్తులు అన్ని రకాలుగా దగ్గరయ్యారని చెప్పొచ్చు. మనసులతో ఎంతగా ప్రేమించుకున్నా దానికి పరిమితులు ఉంటాయి. పరిమితుల్లేని ప్రేమను వ్యక్తం చేయడానికి శృంగారానికి మించినది మరొకటి లేదని అంటారు రిలేషన్‌షిప్ ఎక్స్‌పర్ట్స్.
శృంగారం సమయంలో ఇద్దరు వ్యక్తులు శారీరకంగా, మానసికంగా ఒక్కటవుతారు. శృంగారం గురించి మాట్లాడుకోవాలనుకుంటే పురుషులు, మహిళల ఇష్టాయిష్టాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. వీటి వల్ల తదుపరిసారి సెక్స్ లో పాల్గొన్నప్పుడు మరింత ఆనందంగా ఉంటుంది.

శృంగారం చేస్తున్న సమయంలో ఒకటి ఇష్టాయిష్టాలు, భావోద్వేగాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎదుటి వారు ఏమనుకుంటున్నారో అంచనా వేయగలిగితే వారి ఇష్టాలకు తగ్గట్లుగా శృంగారం చేయడం ద్వారా సంతృప్తిగా ఉంటుంది. పురుషుల విషయానికి వస్తే వారు శృంగారం చేస్తున్నప్పుడు మహిళల్లో కొన్ని విషయాలను గమనిస్తుంటారు. వాటి కోసం చూస్తుంటారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. మహిళల దుస్తులు:
ఔనన్నా, కాదన్నా ఎదుటివారిలో చూస్తే మొదటగా కనిపించేది దుస్తులే. వేసుకున్న దుస్తులను బట్టి వ్యక్తిపై అభిప్రాయం మారుతుంది. ముఖ్యంగా మహిళలు వేసుకునే దుస్తులను పురుషులు చాలా గమనిస్తారు.
పురుషులను సెక్స్ మూడ్ లోకి తీసుకురావడానికి దుస్తుల నుండి మొదలు పెడతారు మహిళలు. స్త్రీలు ఎలాంటి దుస్తులు వేసుకున్నారో పురుషులు తప్పకుండా గమిస్తుంటారు.
2. భాగస్వామి శరీరం:
సెక్స్ సమయంలో తమ భాగస్వామి శరీరం ఎలా కదులుతుందో పురుషులు తీక్షణంగా గమనిస్తారు. శరీరం మృదువుగా ఉందా లేదా కండలు తిరిగిందా అని కూడా చూస్తారు.
పురుషులు శారీరక సాన్నిహిత్యం సమయంలో భాగస్వామికి వీలైనంత దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. మహిళలు సౌకర్యవంతంగా ఉండాలని పురుషులు కోరుకుంటారు. వారి సౌకర్యంతోనే సంతృప్తి లభిస్తుందని అనుకుంటారు.

3. కళ్లు చూస్తారు:
చాలా మంది మహిళలు ఈ విషయంలో పురుషులను తప్పుగా అంచనా వేస్తుంటారు. శృంగార సమయంలో పురుషులు తమ శరీరాన్ని చూస్తారని, అదే కావాలని అనుకుంటారని అనుకుంటారు.
కొంత వరకు అది నిజమే అయినప్పటికీ వంద శాతం శరీరాన్ని మాత్రమే చూడరు. సెక్స్ చేస్తున్న సమయంలో పురుషులు మహిళల కళ్లల్లోకి చూస్తారు. చాలా మంది పురుషులకు ఆత్మన్యూనత భావం ఉంటుంది.
ముఖ్యంగా సెక్స్ విషయానికి వస్తే వారు తమ భాగస్వామిని సంతృప్తి పరుస్తున్నారా, పనితీరు వారికి నచ్చుతుందో లేదో, వారికి ఈ భంగిమ ఓకేనా, ఇంకేదైనా వారికి కావాలా ఇలాంటి చాలా ప్రశ్నలు వస్తుంటాయి. వాటికి సమాధానం కోసం కళ్లను చూస్తుంటారు.
4. నోటి నుండి వచ్చే శబ్దం:
సెక్స్ సమయంలో స్త్రీల నోటి నుండి వచ్చే శబ్ధాలను పురుషులు ఎక్కువగా గమనిస్తుంటారు. స్త్రీల స్వరం ఎంత లోతుగా ఉందో, ఆమెకు ఎంత ఆకర్షణ ఉందో తెలుసుకోవడానికి మగాళ్లు ప్రయత్నిస్తుంటారు.
శృంగార సమయంలో స్త్రీలు ఎంత ఎక్కువగా శబ్ధం చేస్తే వారు అంతగా ఎంజాయ్ చేస్తున్నారని తప్పుగా భావిస్తారు. అలాగే వారి నోటి నుండి వచ్చే శబ్దాలు పురుషులను మరింత ఉత్సాహపరుస్తాయి. సెక్స్ డ్రైవ్ ను మెరుగుపరుస్తాయి.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications