Latest Updates
-
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.? -
వాస్తు ప్రకారం చీపురును ఎక్కడ పెట్టాలి? మీరు చేసే ఈ చిన్న తప్పులే పేదరికానికి కారణమా! -
కారం కారంగా..నోరూరించే ఎండుమిర్చి చట్నీ ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
అమ్మాయిలను అర్థం చేసుకునే 3 మాస్టర్ క్లాస్ టిప్స్.. ఇవి పాటిస్తే మీ రిలేషన్ సేఫ్.!
ఆడవారి మాటలకు అర్థాలే వేరులే.. అనే సామెత అనాదిగా వస్తోంది. వారి మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలుసుకోవడం చాలా కష్టమని భావించని పురుషులంటూ ఉండరు. లవ్‌లో, మ్యారేజ్‌లో బంధం ఏదైనా ఈ తిప్పలు తప్పవని సర్దుకుపోతూ ఉంటారు. అయితే కొన్ని సార్లు ఇది తీవ్ర పరిణామాలకు సైతం దారితీస్తుంది. ఈ క్రమంలో అమ్మాయిలను అర్థం చేసుకోవడానికి మూడు అద్భుతమైన టిప్స్ అందిస్తున్నారు మనస్తత్వ నిపుణులు.. అవేంటో చూద్దాం..

ప్రేమ బంధమైనా, పెళ్లి బంధమైనా జంటల మధ్య చిరు కలహాలు, కోపాలు సహజమే. నిప్పు కణికల మీద నీళ్లు చల్లినట్లుగా కాసేపటికే మాయమైపోతాయి. కానీ ఒక్కోసారి ఆ కలహాలు, కోపాల కారణంగా వచ్చే గొడవలు.. రోజుల కొద్దీ ఇద్దరి మధ్య మౌనానికి, మాటల యుద్ధానికి దారి తీస్తాయి. ఇందుకు కారణం ఇద్దరి మధ్యా సరైన అవగాహన లేకపోవడమే.. ముఖ్యంగా ప్రియురాలు లేదా భార్యను సరిగా అర్థం చేసుకోకపోవడమేనని నిపుణులు అంటున్నారు.
ప్రతి యువతికి తన జీవితంలో భాగస్వామిపై కొన్ని అంచనాలు ఉంటాయి. బంధం బలంగా ఉండాలన్నా.. మున్ముందు చిన్న చిన్న పొరపొచ్చాలు రాకుండా ఉండాలన్నా ముందుగా భార్యను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. వాళ్లు ఏవిధంగా ఆలోచిస్తారు.. ఎలా ఉంటారు అనేది తెలుసుకోవాలని చెబుతున్నారు.
రిలేషన్‌షిప్‌లో పాటించాల్సిన 3 టిప్స్
ఏ అమ్మాయి అయినా తనకు నచ్చిన వ్యక్తితో చాలా విషయాలు మాట్లాడాలని, షేర్ చేసుకోవాలని అనుకుంటుంది. అయితే ఈ విషయంలో కొందరు మగవారు నిర్లక్ష్యం చేస్తుంటారు. అందుకే పెళ్లి కాని అబ్బాయిలైనా, పెళ్లయిన పురుషులు అయినా.. ముందుగా మీ లవర్, భార్య ఏం చెబుతున్నారో పూర్తిగా వినాలని నిపుణులు సూచిస్తున్నారు. తాము చెప్పేది మీరు వినాలనుకుంటున్నారని.. పెడచెవిన పెట్టకుండా ప్రతి విషయం వింటే వారికి ఒక భరోసా ఉంటుంది. ఇంటి విషయాలు, సమస్యలు, కాలేజీ విషయాలు, వారు ఎగ్జయిటింగ్‌గా ఫీలయ్యే విషయాలు ఏం చెబుతున్నా ఓపికగా వినండి. పరిష్కారం, సలహాలు చెప్పకపోయినా పర్లేదు.. వారు చెప్పేది మీరు వింటే మీపైన ప్రేమ, భరోసా పెరుగుతుంది.
సైలెంట్‌గా ఉండొద్దు
మీ లవర్ లేదా భార్య.. ఎప్పుడైనా మీకు నచ్చని పని చేసినప్పుడు వారిపైన అలగడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. అలగడం, కోపంగా ఉండటం, మాట్లాడకుండా రోజుల తరబడి ముభావంగా ఉండటం మంచిది కాదు. దీనివల్ల బంధం బలహీనపడి ఇద్దరి మధ్యా దూరాన్ని పెంచుతుంది. ఈ పని నచ్చలేదు అని వారికి చెప్పి మాట్లాడటం ద్వారా చాలావరకు మనస్పర్థలు తొలగిపోతాయి. ఒకరిపై ఒకరికి అవగాహన పెరుగుతుంది.

పనుల్లో సహాయం
ఆడవారు ప్రతి చిన్న విషయాన్ని ఎమోషనల్‌గా ఆలోచిస్తారని నిపుణులు అంటున్నారు. అందుకే మీ లవర్ లేదా భార్య చేసే పనుల్లో మీరు కొంత సహాయం చేయడం ద్వారా వారిలో ఎనలేని సంతోషాన్ని చూడవచ్చు. కిచెన్ పనుల్లో, ఇంటి పనుల్లో ఉన్నప్పుడు వారికి ఏదైనా ఫోన్ కాల్ వచ్చినప్పుడు ఆ పనిని పూర్తి చేయడంలో మీరు సహాయం చేసినట్లయితే వారు చాలా ఆనందపడతారు. మీ భాగస్వామిని హ్యాపీగా ఉంచడానికి పెద్ద పెద్ద గిఫ్ట్‌లు, సర్‌ప్రైజ్‌లు ఇవ్వాల్సిన అవసరం లేదని.. ఇలా చిన్న చిన్న విషయాలను పట్టించుకోవడం ద్వారా వారి ప్రేమను సులభంగా గెలుచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
