Latest Updates
-
వినాయక చవితి స్పెషల్: పండుగ పూట త్వరగా, రుచికరంగా రవ్వ మోదకాలు.. చేయండిలా.! -
గణనాథుడికి పూజలో శనగల ప్రసాదం.. ఈ టిప్స్‌తో పదే నిమిషాల్లో ఈజీగా చేసుకోండి.! -
వినాయక చవితి స్పెషల్..బొజ్జ గణపయ్యకు ఇష్టమైన శనగపిండి లడ్డూలు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
గణపతి బప్పా మోరియా.. మీ ప్రియమైన వారికి వినాయక చవితి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి.! -
ఏకదంతుడి నుంచి ధూమ్రవర్ణుడి వరకు.. గౌరీ తనయుడి అవతారాల వెనుక పరమార్థం ఇదే.! -
గణేశ్ చతుర్థి స్పెషల్: మీ ఇంటి గణపతికి శనగపప్పు మోదకాలు. ఇలా చేస్తే వారం రోజుల పాటు నిల్వ.! -
ఆంధ్రా విలేజ్ స్టైల్ పప్పు రొయ్యల వంకాయ కర్రీ.. ఇలా చేశారంటే ఇల్లంతా ఘుమఘుమలే.! -
ఐరన్, ప్రొటీన్ అబ్బా.. సూపర్ హెల్తీ, టేస్టీ పాలక్ పన్నీర్ చపాతీ..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
నీకు టీబీ ఉంది,అడిగితే లేవదు,నన్ను సుఖపెట్టలేవు..రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్తపైనే తిరగబడ్డ భార్య! -
మూషిక వాహనంపై బొజ్జ గణపయ్య.. గణేశ్ పూజలో ఎలుక ప్రాముఖ్యత, సందేశం ఇదే.!
డేటింగ్‌లో పార్ట్‌నర్ గురించి ఎలా తెలుసుకోవాలి.. ఇంతవరకూ ఎవరూ చెప్పని సీక్రెట్స్.!
నేటి ఆధునిక కాలంలో డేటింగ్ చాలా కామన్ అయింది. ఒకరికొకరు తెలుసుకోవడానికి డేటింగ్ కల్చర్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలా అని డేటింగ్ ప్రక్రియ అంత సులభమా అంటే కాదనే అంటున్నారు మనస్తత్వ నిపణులు డాక్టర్ ఎస్టేర్ పెరెల్. నచ్చిన వ్యక్తితో బయటకు వెళ్లినప్పుడు ఆ రోజుని ది బెస్ట్‌గా ఎలా మార్చుకోవాలో చాలా మందికి తెలియదనే చెబుతున్నారు. మరి మీరు డేటింగ్‌కి వెళ్లినప్పుడు ఆ పర్సన్ గురించి పూర్తిగా ఎలా తెలుసుకోవాలి. ఇంతవరకూ ఎవరూ చెప్పని సలహాలని సూచిస్తున్నారు..

నచ్చిన వ్యక్తితో డేటింగ్‌కి వెళ్లినప్పుడు ఆ వ్యక్తి గురించి చాలా తెలుసుకోవాలని తాపత్రయపడుతుంటారు. అంతేకాకుండా తమ గురించిన విషయాలను పంచుకోవాలని భావిస్తుంటారు. అయితే ఈ క్రమంలోనే తెలిసీ తెలియక చేసిన పొరపాట్ల కారణంగా మీరు అనుకున్నవి జరగవు. మీతో వచ్చిన మనిషి మీకు సరి జోడా కాదా అనేది ఒక నాలుగు సలహాల ద్వారా ఈజీగా తెలుసుకోవచ్చు. అవేంటంటే..
ప్రశ్నలు అడగండి..
డేటింగ్‌లో ఉన్నప్పుడు మీ భాగస్వామి గురించి తెలుసుకోవడానికి ఆసక్తిని ప్రదర్శించండి. వారి గురించి మీకు పూర్తిగా తెలుసనే అపోహను పక్కనపెట్టి వారు చెప్పే విషయాలను వారి కోణంలో నుంచి శ్రద్ధగా వినండి. అప్పుడే ఎదుటి వ్యక్తి చెప్పే విషయాలు మీకు బోర్ కొడుతున్నాయా.. ఉత్సాహాన్ని ఇస్తున్నాయా అనేది ఓ అంచనాకి వస్తారు.
తొందరపడి అన్నీ చెప్పొద్దు
కొత్త వ్యక్తితో బయటకు వెళ్లినప్పుడు అంత తొందరగా అతి చనువు పనికిరాదు. ఏం మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి వాగుతూ ఉంటారు. అలా చేయకండి. వారితో అప్పుడే అన్ని విషయాలను పంచుకోకండి. వారిపైన నిజమైన నమ్మకం లేనిదే మీ గురించిన అన్ని విషయాలను బయటపెట్టకండి. మీరు మాట్లాడే విధానం, ఎలాంటి విషయాలు మాట్లాడుతున్నారనేది మీకు మీరే గ్రహించుకోవాలి.
స్వేచ్ఛ అవసరం..
ఒక బంధం బలంగా ఉండాలంటే వారి మధ్య ముఖ్యంగా స్వాతంత్ర్యం, అనుబంధం పూర్తిగా ఉండాలి. అంతేకానీ ఒకరి ఇష్టాలను మరొకరి అభిరుచికి అనుగుణంగా మార్చుకుంటాం అనే ధోరణి పనికి రాదు. ఎదుటి వ్యక్తి దగ్గర గుర్తింపు పొందడానికి మీ ఆసక్తులను, లక్ష్యాలను, స్నేహాలను వదులుకోకండి. ఒక రిలేషన్ మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలే కానీ మీ స్థాయిని తగ్గించకూడదు.

సవాళ్లను ఎలా అధిగమిస్తున్నారు..
ఓ వ్యక్తిని చూడగానే వారిలో ముందుగా ఆకర్షించేది ఫిజికల్ అప్పియరెన్స్. కానీ దానికంటే ముఖ్యమైనది భావోద్వేగాల పరంగా వారు ఎంత పరిపక్వత చెందారు అనేది. డేటింగ్‌లో మీ పార్ట్‌నర్ వారి జీవితంలో ఎదురైన సవాళ్లను ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకోవాలి. వారికి గతంలో బ్రేకప్ లాంటి స్టోరీస్ ఉన్నట్లయితే ఆ బంధం నుంచి వారు ఎలా బయటపడ్డారు.. ఆ సమస్యలను, గొడవలను ఎలా ఎదుర్కొన్నారో తెలుసుకోవడం ముఖ్యం. అప్పుడే వారు ఎమోషనల్ స్ట్రాంగ్‌గా ఉన్నారా.. వీక్‌గా ఉన్నారా అనేది తెలుస్తుంది.
ఎదుటి వ్యక్తి తమ తప్పులను అంగీకరిస్తారా.. లేదంటే ఆ బాధ్యతను ఇతరుల మీదకి నెట్టేసి వారిని నిందిస్తారా అనేది వారి మాటల్లో తెలుసుకునే పరిపక్వత మీకుండాలి. ఇక్కడే వారిలోను తెలుసుకునే అవకాశం ఉంటుంది. తమ జీవితంలోకి సరైన వ్యక్తిని ఆహ్వానించాలనే ఆశతోనే డేటింగ్ చేస్తారు. ఈ క్రమంలో నమ్మకమైన బంధాన్ని సంపాదించుకోవడం చాలా ముఖ్యం. ఏదో కలిశాం మాట్లాడాం అని కాకుండా.. మీకు నచ్చిన వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు.. వారిలో మీరు ఏం కోరుకుంటున్నారు అనేది తెలుసుకోగలిగితే.. మీకు సరిజోడిని ఇట్టే గుర్తింవచ్చు.



Click it and Unblock the Notifications
