Latest Updates
-
ఇవేం లవ్ మ్యారేజ్ లు రా బాబోయ్: పెళ్లయిన ఏడాదికే ప్రియుడితో హోటల్ లో భర్తకు దొరికిన భార్య..వీడియో చూడండి -
ఒరేయ్ అబ్బాయిలు బంపరాఫర్...పెళ్లి కానోళ్లకు ఫ్రీగా ఫిన్లాండ్ వీసా, అక్కడోళ్లతో డేటింగ్..ఖర్చులన్నీ వాళ్లవే! -
పోషకాలు పుష్కలంగా, రుచి అత్యద్భుతంగా..సొరకాయ రొట్టెలు ఈజీగా చేసుకోండిలా -
విటమిన్ B12 లోపానికి చెక్, నరాల వీక్నెస్ తగ్గించే మేక లివర్ కర్రీ..ఎలా చేసుకోవాలంటే.. -
రాగి జావ తాగుతున్నారా? ఈ నిజం తెలియకపోతే ఎంత తాగినా వేస్ట్! -
ప్రభుత్వ హాస్పిటల్స్ దుస్థితికి ఇదే నిదర్శనం.. ట్రీట్మెంట్ కోసం ప్రైవేట్ హాస్పిటల్ కి ఎయిమ్స్ డైరెక్టర్! -
మెతుకు మిగల్చకుండా తినే రుచి..తమిళనాడు స్పెషల్ దిండిగల్ తలపకట్టి చికెన్ బిర్యానీ ఇంట్లోనే చేసుకోండిలా.. -
క్రంచీ, టేస్టీ జీడిపప్పు పకోడి..మస్త్ కిక్కిచ్చే స్నాక్ ఈజీగా చేసుకోండిలా.. -
కరివేపాకు మరమరాలు..మూవీ, వెబ్ సిరీస్ చూస్తూ తినడానికి బెస్ట్ టేస్టీ,హెల్తీ స్నాక్ ! -
డీప్ ఫ్రై లేని హెల్తీ స్నాక్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పొంగనాలు ఈజీగా ఇంట్లో చేసుకోండిలా..
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే..
పాతికేళ్ల దాంపత్యం... ఎన్నో ఆటుపోట్లు, మరెన్నో సుఖదుఃఖాలు కలిసి పంచుకున్న బంధం అది. పిల్లలు పెద్దవారయ్యారు, ఇక జీవితంలో స్థిరపడ్డాం అనుకునే సమయం. సరిగ్గా అప్పుడే, నలభై లేదా యాభై పడిలోకి అడుగుపెట్టగానే ఆ బంధంలో ఊహించని కుదుపు వస్తుంది. దశాబ్దాలుగా ఎంతో బలమైనది అనుకున్న కుటుంబం హఠాత్తుగా పేకమేడలా కూలిపోతుంది. వినడానికి ఆశ్చర్యంగా, కాస్త బాధాకరంగా అనిపించినా ఇది నగ్న సత్యం.

ఈ రోజుల్లో మధ్య వయసులో విడాకులు తీసుకుంటున్న జంటల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇలా దశాబ్దాల బంధం విచిత్రంగా, అనూహ్యంగా విచ్ఛిన్నం కావడాన్నే ఆధునిక పరిభాషలో మెనోడివోర్స్ అని పిలుస్తున్నారు.
అసలు ఈ మెనోడివోర్స్ అంటే ఏమిటి?
ఈ పదం వినడానికి కొత్తగా అనిపించినా, దీని వెనుక ఉన్న సమస్య మాత్రం పాతదే. మెనోపాజ్,డివోర్స్ అనే రెండు ఇంగ్లీష్ పదాల కలయికే ఈ మెనోడివోర్స్. సులభంగా చెప్పాలంటే.. మహిళల్లో నెలసరి ఆగిపోయే దశ (మెనోపాజ్) సమయంలో భార్యాభర్తల మధ్య తలెత్తే తీవ్రమైన మనస్పర్థలు, అవి చివరికి విడాకులకు దారితీయడాన్ని ఇది సూచిస్తుంది.
సాధారణంగా మహిళల్లో 40 నుండి 50 ఏళ్ల వయసులో ఈ దశ వస్తుంది. సరిగ్గా ఈ వయసులోనే ఎన్నో ఏళ్లుగా సాఫీగా సాగిపోతున్న దాంపత్య సమీకరణాలు ఒక్కసారిగా తలక్రిందులవుతాయి.
హార్మోన్ల మాయ.. పెరుగుతున్న మానసిక దూరం
మెనోపాజ్ అనేది విడాకులకు ప్రత్యక్ష కారణం కాదని మానసిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయితే బంధం విచ్ఛిన్నం కావడానికి ఇదొక ఉత్ప్రేరకంలా పనిచేస్తుంది. ఈ దశలో మహిళల శరీరంలో హార్మోన్ల స్థాయిల్లో భారీ హెచ్చుతగ్గులు ఏర్పడతాయి. దీని ప్రభావం వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రంగా పడుతుంది. కారణం లేని చిరాకు, ఆకస్మిక కోపం, తీవ్రమైన అలసట, డిప్రెషన్ వంటివి ఈ సమయంలో సర్వసాధారణం. కొన్నిసార్లు శారీరక సాన్నిహిత్యం పట్ల కూడా ఆసక్తి సన్నగిల్లుతుంది.
తన భార్య ఎలాంటి క్లిష్టమైన శారీరక, మానసిక సంఘర్షణను ఎదుర్కొంటోందో భర్త అర్థం చేసుకోలేకపోవడం ఇక్కడే అసలు సమస్యకు దారితీస్తుంది. ఆమె ప్రవర్తనను వ్యక్తిగతంగా తీసుకుని పురుషులు దూరం జరగడం మొదలుపెడతారు. దాంతో అపార్థాలు పెరుగుతాయి. ఇదే వయసులో చాలామంది మహిళలు తమ జీవితాన్ని, కెరీర్ ను, బాంధవ్యాలను పునఃసమీక్షించుకుంటారు. తమకంటూ కొంత స్వేచ్ఛను, భావోద్వేగ మద్దతును కోరుకుంటారు. ఆ సమయంలో భాగస్వామి అండగా నిలవకపోతే, వారిలో తీవ్రమైన ఒంటరితనం, కోపం పేరుకుపోయి, చివరికి విడిపోవడమే సరైన పరిష్కారం అనే నిర్ణయానికి వస్తారు.

బంధం నిలబడాలంటే ఏం చేయాలి?
మనసు విప్పి మాట్లాడుకోవడం: కమ్యూనికేషన్ అనేది ఏ బంధానికైనా ప్రాణం. మీ శరీరంలో, మనసులో జరుగుతున్న మార్పుల గురించి, మీ బాధల గురించి దాచకుండా మీ భాగస్వామితో పంచుకోండి.
పురుషుల సానుభూతి: ఈ దశలో భర్తల పాత్ర అత్యంత కీలకం. భార్య కోపాన్ని లేదా చిరాకును మీ మీద దాడిగా భావించకండి. అది హార్మోన్ల ప్రభావం వల్ల జరుగుతోందని అర్థం చేసుకుని, ఆమె పట్ల సానుభూతితో, ఓర్పుతో వ్యవహరించండి.
నిపుణుల సలహా: హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలు శృతిమించితే, లేదా ఒత్తిడి తట్టుకోలేకపోతే వెంటనే గైనకాలజిస్ట్ లేదా మానసిక నిపుణుల (థెరపిస్ట్) సహాయం తీసుకోవడం చాలా ఉత్తమం.
క్వాలిటీ టైం: రోజువారీ ఉరుకులు పరుగుల జీవితానికి, ఇంటి వాతావరణానికి కాస్త విరామం ఇవ్వండి. ఇద్దరూ కలిసి ఏకాంతంగా, ప్రశాంతంగా బయట ఎక్కడైనా కొంత సమయం గడపండి. పాతికేళ్ల క్రితం నాటి మధురస్మృతులను నెమరువేసుకుంటూ ఒకరినొకరు కొత్తగా అర్థం చేసుకోండి.



Click it and Unblock the Notifications
