Latest Updates
-
ఎక్స్ ట్రా చీజీ గార్లిక్ బ్రెడ్..తింటుంటే స్వర్గం కనబడుతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
ప్రోటీన్, క్యాల్షియం, ఐరన్ ఒకే దాంట్లో.. బీట్ రూట్ రాగి పనీర్ పరాఠా ఎలా చేసుకోవాలంటే.. -
యూట్యూబ్‌లో వ్యూస్ కోసం తొమ్మిదేళ్ల బాలుడి తెగింపు.. విషయం తెలిసి ఖంగుతున్న తండ్రి.! -
మీ ఒంట్లోని కొవ్వు రంగు చెక్ చేసుకున్నారా.. ఈ కలర్లో ఉంటే గుండెకి రిస్క్ తప్పదు.! -
క్రికెట్ గ్రౌండ్ లో బ్యాటింగ్ అదరగొడతాడు..కానీ బెడ్ మీద మాత్రం లేదు..రోహిత్ శర్మ మాజీ ప్రియురాలి కామెంట్స్! -
ఒకవైపు షుగర్, మరోవైపు స్వీట్ క్రేవింగ్స్.. అయినా పర్లేదు, ఇలా చేసుకుని ఎన్ని కప్పులైనా తినేయొచ్చు.! -
గ్యాస్ మీద కాప్సికమ్ కాల్చి పెరుగుతో కలిపి ఈ పచ్చడి చేస్తే.. ఆ రుచే వేరబ్బా! -
జొన్న రొట్టె తినేవారికి ఎవర్ గ్రీన్ కాంబినేషన్.. గోంగూర గుడ్డు కర్రీతో లెక్క పెట్టకుండా తినేస్తారు.! -
దొండకాయ ఉల్లికారం ఇలా చేశారంటే..వద్దన్న వాళ్లే మళ్లీ మళ్లీ అడిగి తినడం గ్యారెంటీ! -
పిల్లల్లో ఏటా పెరుగుతున్న లుకేమియా కేసులు.. బ్లడ్ క్యాన్సర్‌కి తల్లిదండ్రులూ ఒక కారణమా.?
ప్రేమలో మంకీ బ్రాంచింగ్.. డేటింగ్ ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ సరికొత్త ద్రోహం గురించి మీకు తెలుసా?
కార్పొరేట్ ప్రపంచంలో ఒక ఉద్యోగం చేస్తూనే..సేఫ్టీ కోసం మరో ఉద్యోగం వెతకడం మనం తరచుగా చూస్తుంటాం. కెరీర్ లో ఎదగాలనో లేదా ప్రస్తుత జాబ్ నచ్చకనో చాలామంది ఇలా చేస్తుంటారు. ఉద్యోగాల వరకు ఇది మామూలే కావచ్చు, కానీ ఈ బ్యాకప్ ట్రెండ్ ఇప్పుడు డేటింగ్ ప్రపంచంలోకి కూడా వచ్చేసింది. దీనినే మంకీ బ్రాంచింగ్ (Monkey Branching) అని పిలుస్తున్నారు.
కోతులు ఒక కొమ్మను గట్టిగా పట్టుకుని, మరో కొమ్మ దొరికిన తర్వాతే మొదటి దానిని వదులుతాయి కదా.. ప్రేమలో కూడా కొందరు సరిగ్గా ఇలాగే చేస్తున్నారు. ప్రస్తుత బంధాన్ని పూర్తిగా వదులుకోకుండానే, మరో కొత్త బంధం కోసం వెతకడమే ఈ మంకీ బ్రాంచింగ్.

మంకీ-బ్రాంచింగ్ అంటే ఏమిటి?
ఈ ట్రెండ్ లో ఉన్నవారు తమ ప్రస్తుత భాగస్వామికి ఏమాత్రం అనుమానం రాకుండానే, నెమ్మదిగా మరొకరి వైపు ఆకర్షితులవుతారు. ఇందులో శారీరక ద్రోహం లేకపోవచ్చు కానీ భావోద్వేగ ద్రోహం కచ్చితంగా ఉంటుంది. కొత్త బంధం పక్కాగా సెట్ అయింది అనిపించాకే పాత బంధానికి బ్రేకప్ చెబుతారు. ఇది ఎదుటివారి నమ్మకాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది. ఒక సాధారణ బ్రేకప్ కంటే ఇది ఎక్కువగా బాధిస్తుంది.
అసలు ఇలా ఎందుకు చేస్తారు?
ప్రేమలో ఇలా మోసం చేయడానికి ప్రధాన కారణం వారి అభద్రతా భావమే. ఒంటరిగా ఉండాలంటే వీరికి విపరీతమైన భయం. తమ భావోద్వేగ అవసరాల కోసం ఎప్పుడూ ఎదుటివారిపైనే ఆధారపడతారు. ఒకరికే కట్టుబడి ఉండటం వీరికి ఇష్టం ఉండదు. అందుకే ఎప్పుడూ ఒక ఆప్షన్ రెడీగా ఉంచుకుంటారు.
ముఖ్యంగా మన భారతీయ సమాజంలో డేటింగ్ అనేది తరచుగా పెళ్లికి దారితీస్తుందనే ఒత్తిడి ఉంటుంది. అందువల్ల ప్రస్తుత భాగస్వామితో సర్దుకుపోలేక, అలాగని ఒంటరిగా ఉండలేక ఏకకాలంలో మరొకరి కోసం వెతుకుతుంటారు.
ఈ ద్రోహాన్ని పసిగట్టడం ఎలా?
మంకీ బ్రాంచింగ్ చేసేవారిని గుర్తించడం కాస్త కష్టమే అయినా, ఈ తొలి సంకేతాలతో వారిని పసిగట్టవచ్చు.
భాగస్వామి అకస్మాత్తుగా ఎమోషనల్ గా మీకు దూరం అవుతారు.
గతంలోలాగా మీతో మనసువిప్పి మాట్లాడరు, మీ పనుల్లో ఆసక్తి చూపరు.
భవిష్యత్తు లేదా పెళ్లి ప్రస్తావన వస్తే మాట దాటేస్తారు.
వారి దృష్టి ఎప్పుడూ వేరే ఎక్కడో ఉన్నట్లు అనిపిస్తుంది. మొబైల్ ను దాచడం మొదలుపెడతారు.
సోషల్ మీడియాలో, బయట ప్రపంచంలో మీతో కలిసి తిరగడానికి ఇష్టపడరు.
మీ మధ్య గొడవలు వస్తే వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయరు.



Click it and Unblock the Notifications
