Latest Updates
-
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు! -
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్‌కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.!
జెన్ జీ డేటింగ్ డిక్షనరీలో కొత్త పదం పఫర్ ఫిషింగ్.. మీ లవ్ స్టోరీలోనూ ఇలాగే జరుగుతోందా?
ప్రేమ.. మొదట్లో ఎంతో అందమైన కలలా అనిపిస్తుంది. పరిచయం అయిన కొత్తలో మొబైల్ స్క్రీన్లు నిరంతరం మెసేజ్ లతో వెలిగిపోతుంటాయి. రాత్రంతా నిద్రను సైతం పక్కనపెట్టి, ఒకరికొకరు ఎన్నెన్నో గుసగుసలు, కబుర్లు చెప్పుకుంటూ గడుపుతారు. ఆ సమయంలో ప్రపంచంలో వాళ్లిద్దరూ తప్ప ఇంకెవరూ లేరన్నంతగా ఒకరిలో ఒకరు మునిగిపోతారు.

కానీ నిర్మలమైన ఆకాశంలో అకస్మాత్తుగా నల్లటి మేఘాలు కమ్ముకున్నట్లు, ఆ మధురమైన బంధంలో ఒక్కసారిగా మార్పు వస్తుంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి, ఎంతో దగ్గరయ్యారు అనుకునేలోపే.. అవతలి వ్యక్తి అనూహ్యంగా దూరమైపోతారు. అరచేతిలో పెట్టిన కర్పూరం గాలిలో కలిసిపోయినట్లు, ఆ ప్రేమ ఎటో మాయమైపోతుంది. ఈ మధ్యకాలంలో జెన్ జీ యువత డేటింగ్ డిక్షనరీలో ఈ తరహా ప్రవర్తనకు పెట్టిన కొత్త పేరే పఫర్ ఫిషింగ్.
సడెన్ గా దూరం అవ్వడం
ఈ పేరు వినడానికి ఏదో చేపల వాసన కొడుతున్నట్లు అనిపించినా, దీనికి సముద్రానికీ లేదా ఉప్పునీటికీ ఎలాంటి సంబంధం లేదు. ఇది పూర్తిగా మనుషుల మనసు లోతుల్లో దాగి ఉండే ఒక సంక్లిష్టమైన మానసిక స్థితి. ఇలాంటి బంధాలు మొదట్లో వసంతకాలపు చల్లని గాలిలా ఎంతో హాయిగా ఉంటాయి. హృదయం నిండా ప్రేమను నింపుకుని, రోజూ కలుసుకోవడం, భావోద్వేగాలను పంచుకోవడం అద్భుతంగా సాగుతుంది.
కానీ ఆ బంధం కొంచెం స్థిరపడి, లోతైన సంబంధంలోకి అడుగుపెడుతున్న సమయంలోనే అసలు సమస్య మొదలవుతుంది. అవతలి వ్యక్తి ప్రవర్తనలో మార్పులొస్తాయి. ఎటువంటి సరైన కారణం లేకుండానే వారు మెల్లమెల్లగా దూరమవ్వడం ప్రారంభిస్తారు. ఫోన్ కాల్స్ తగ్గిపోతాయి. నిమిషాల్లో వచ్చే రిప్లైలు, రోజుల తరబడి రావు. కొందరైతే ఎలాంటి వివరణా ఇవ్వకుండా జీవితంలోంచి శాశ్వతంగా అదృశ్యమైపోతారు.
అందుకే చేపతో పోలిక
అందుకే నిపుణులు ఈ ప్రవర్తనను సముద్రంలోని పఫర్ ఫిష్ అనే చేపతో పోల్చారు. ఆ చేపకు సముద్రంలో ఏదైనా ప్రమాదం పొంచి ఉందని అనిపించిన వెంటనే, శత్రువుల నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఒళ్లంతా ముళ్ల బంతిలా ఉబ్బించుకుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా కొంతమంది వ్యక్తులు ఇలాగే ప్రవర్తిస్తుంటారు.
ఒకరితో మానసికంగా బాగా దగ్గరవుతున్నప్పుడు, వారి అంతరంగంలో ఒక అదృశ్య ప్రమాద ఘంటిక మోగుతుంది. నా స్వేచ్ఛను కోల్పోతున్నానేమో? నన్ను నేను బంధీగా మార్చుకుంటున్నానేమో? అనే ఆందోళన వారిని వెంటాడుతుంది. ఆ భయంతోనే తమను తాము రక్షించుకోవడానికి, తమ చుట్టూ ఎవరూ ఛేదించలేని ఒక గోడను నిర్మించుకుంటారు.

చిన్నతనంలోనే మూలాలు
ఈ దొంగచాటు దాగుడుమూతల ఆట ఈనాటిది కాదు, దీని మూలాలు బాల్యంలోనే ఉంటాయని మనస్తత్వవేత్తలు విశ్లేషిస్తున్నారు. చిన్నతనంలో తగినంత ప్రేమ దొరక్కపోవడం, నిర్లక్ష్యానికి గురికావడం లేదా అస్థిరమైన వాతావరణంలో పెరగడం వల్ల వారి మనసులో ఒక రకమైన అభద్రతా భావం నాటుకుపోతుంది. వారు ఎవరినీ సులభంగా నమ్మలేరు.
బంధం ఒక తీవ్రమైన మలుపు తీసుకోగానే, తాము ఒక పంజరంలో చిక్కుకుంటున్నామన్న భావన వారికి కలుగుతుంది. ఫలితంగా వారిలో ఒకసారి విపరీతమైన ప్రేమ, మరోసారి తీవ్రమైన నిర్లక్ష్యం అనే ప్రవర్తన కనిపిస్తుంది. కొన్నిసార్లు ప్రాణానికి ప్రాణంగా దగ్గరవుతారు, ఆ మరుక్షణమే ముఖం చాటేస్తారు. అలాగే తమ భాగస్వామిలో లేనిపోని తప్పులు వెతకడం వీరికి ఒక రోజువారీ అలవాటుగా మారిపోతుంది.
అయితే ఇలా చేసే వారందరినీ పూర్తిగా విలన్లుగా చూడటం కూడా సరైంది కాదు. బంధంలో కాస్త వ్యక్తిగత సమయం అడగడంలో ఎలాంటి తప్పూ లేదు. కానీ అసలు సమస్యంతా సంభాషణ లోపించడమే. మీ మనసులోని భయాన్ని దాచిపెట్టి, ఏమీ చెప్పకుండా అకస్మాత్తుగా మాయమైపోతే, అది అవతలి వ్యక్తిని మానసిక అగాధంలోకి నెట్టేస్తుంది.
ఈ నిందల ఆట నుంచి బయటపడటానికి ఒకే ఒక మార్గం ఉంది. బంధాన్ని నిలబెట్టుకోవాలనుకుంటే, భయపడి పారిపోవడం ఆపేయాలి. ఇద్దరూ ముఖాముఖి కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోవడమేనని నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
