Latest Updates
-
బ్లాక్ కాఫీలో నిమ్మకాయ వేసి తాగితే ఏమవుతుందో తెలుసా? -
హై ప్రొటీన్, ఫైబర్ నిండిన కినోవా జంతికలు..డయాబెటిస్, వెయిట్ లాస్ ఉన్నవారికి బెస్ట్ ఆప్షన్ -
ఆదివారం రెగ్యులర్ చికెన్ కి బ్రేక్.. కేరళ మలబార్ చికెన్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ,దోసెతో అద్భుతం.. -
గ్రహాల రాశుల మార్పు: ఆగష్టు చివరి వారంలో వీరికి ఊహించని ధన లాభం -
జీర్ణ సమస్యలకు చెక్ పెట్టే సంజీవని..100% కల్తీ లేని త్రిఫల చూర్ణం ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
మీ ఇంట్లో బొద్దింకలు పదే పదే కనిపిస్తున్నాయా? అయితే ఈ దోషం ఉన్నట్లే! -
జంక్ ఫుడ్ వద్దు.. సాయంత్రం వేళ పిల్లల ఆరోగ్యానికి మేలు చేసే వేడివేడి సూప్ ఇదే! -
గ్రైండర్ అక్కర్లేదు..మిక్సీలో రుబ్బిన పిండితోనే పర్ఫెక్ట్ హోటల్ స్టైల్ మినప వడలు..ఎలా చేసుకోవాలంటే.. -
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు వెనక నుంచి పిలిస్తే అపశకునమా? -
నీరసాన్ని తరిమికొట్టే పవర్ స్నాక్..పిల్లల జ్ఞాపకశక్తిని పెంచే డ్రై ఫ్రూట్ చిక్కీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..
అదృష్ట లక్ష్మి అనుగ్రహంతో ధనవంతులు కావాలనుకుంటున్నారా ఇలా చెయ్యండి
జీవితం అంటే కష్టాలతో పాటు సంతోషాలతో నిండి ఉంటుంది. మీ ఆర్థిక స్థితి బాగుంటే మీ జీవితం సంతోషంగా, ఎలాంటి కష్టం లేకుండా ఉంటుంది. అంటే డబ్బు ఉంటే సులువుగా చాలా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఎక్కువ డబ్బు లేకపోవడం వలన సమస్యలు మరింత తీవ్రమవుతాయి. మీరు కూడా ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు కావాలంటే, లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉండాలంటే వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి. ఆ దిశగా మీరు తగిన చర్యలు తీసుకోవాలి. వాస్తు ప్రకారం లక్ష్మీ దేవిని ఆకర్షించే మార్గాలను తెలుసుకోండి.
* లవంగాలు
ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు చేతిలో ఐదు లవంగాలు తీసుకెళ్లాలి. పని మీద మీరు బయటకు వెళ్లేటప్పుడు ఐదు లవంగాలను ఎర్రటి గుడ్డలో వేసుకుని జేబులో పెట్టుకోవాలి. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఆ లవంగాలను మీ ఇంటిలోని పూజా మందిరంలో ఉంచండి.

* భగవద్గీత 11వ అధ్యాయం చదవండి
శ్రీమద్భగవద్గీత చదవడం ద్వారా జీవితంలోని సమస్యలన్నీ తీరుతాయని పెద్దలు చెబుతున్నారు. గీతలోని 11వ అధ్యాయాన్ని చదవడం ద్వారా డబ్బు సమస్య పరిష్కరించబడుతుంది, అంతేకాకుండా, ఎల్లప్పుడూ మీ దేశాన్ని, మహిళలను గౌరవించండి. స్త్రీలను చిన్నచూపు చూసి ఎప్పుడూ అగౌరవపరచవద్దు. మహిళలను కించపరిచి వారిని చులకనగా చూస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని కరుణించదని జోతిష్యం చోబుతోంది.
* దీపం వెలిగించి కనకధార స్త్రోస్త్రం పఠించండి
లక్ష్మీ దేవి ముందు నెయ్యితో దీపం వెలిగించి, కనకధారా స్తోత్రాన్ని రోజూ పఠించే వారి ఇళ్లలో డబ్బుకు లోటు ఉండదు. కనకధారా స్తోత్ర పారాయణం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు ఐశ్వర్యం వర్షిస్తాయి. లక్ష్మిదేవి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉంటాయి. వీలైనన్ని సార్లు ఇంట్లో ఆవు నెయ్యితో దీపం వెలిగించడం చాలా శుభపరిణాలు సూచిస్తాయి.
* సంపద వృద్ధికి సూర్య భగవానుని స్తుతించండి
సూర్యుని ముందు గాయత్రీ మంత్రాన్ని జపించిన వ్యక్తికి అన్ని గ్రహ దోషాలు తొలగిపోతాయి. గాయత్రీ మంత్రాన్ని జపించడం వల్ల ఆ వ్యక్తి విశ్వాసం పెరుగుతుంది, అతని ప్రవర్తనను మృదువుగా చేస్తుంది మరియు ధర్మం, అర్థ, కామ మరియు మోక్షాలను అందిస్తుంది. ప్రతిరోజు సూర్యనమస్కారం చేసే అలవాటు ఉన్న వాళ్లు జీవితంలో పైకి వస్తారు.
* శనివారం ఇలా లక్ష్మిని పూజించండి
శనివారం శనిగ్రహం. ఈ రోజు ఎలాంటి పరిస్థితుల్లో ఇనుప వస్తువులను కొనడం మానుకోండి. అంతే కాకుండా ఈ రోజున నల్లని కొత్త బట్టలు కొనడం సరికాదు. శనివారం సాయంత్రం మీ ఇంట్లో దీపం వెలిగించి లక్ష్మీదేవిని ప్రార్థించండి. లక్ష్మిదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది చాలా మంది శుక్రవారం లక్ష్మిదేవిని పూజిస్తారు. శుక్రవారంతో పాటు శనివారం కూడా లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చెయ్యడం చాలా మంచిది. .
* లక్ష్మీ పూజలో ఈ రంగు ఆసనం వేయండి
మనమందరం ఇంట్లో పూజ చేసేటప్పుడు కూర్చోవడానికి ఆసనాలు వేస్తాము. వాస్తు ప్రకారం, ఒక వ్యక్తి లక్ష్మీ మంత్రాన్ని జపించేటప్పుడు అతను గులాబీ ఆసనాన్ని ఉపయోగించాలి. అదేవిధంగా, ఎవరైనా హనుమాన్ మంత్రాన్ని పఠిస్తే అతను ఎరుపు రంగు ఆసనాన్ని ఉపయోగించాలి. పూజ చేసినప్పుడల్లా, పూజ చేసిన తర్వాత ఆసనానికి నమస్కరించాలి.
అలాగే మీరు కుర్చునే ఆసనం మీద ఎప్పుడూ అడుగు పెట్టకండి. పూజ కోసం ఉపయోగించే ఆసనానికి మీ కాలు ఏమాత్రం తగలకుండా జాగ్రత్తలు తీసుకోండి. పైన తెలిపిన నియమాలను కొంతకాలం పాటించి చూడండి లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించి మీ ఆర్థికలావాదేవీల్లో మార్పులు వచ్చిన విషయం మీకే తెలుస్తుంది.



Click it and Unblock the Notifications