Latest Updates
-
కిచెన్‌లో శ్రమ తగ్గించే చిట్కాలు.. ఈ టెక్నిక్స్‌తో అన్నం అంటుకోదు, పప్పు పొంగిపోదు.! -
టీ తాగితే ఎముకలు కరిగిపోతాయా? ఈ విషయాలు మీకు తెలుసా? -
డైలీ ఐదు చాలు.. వీటిని రాత్రంతా నానబెట్టి తింటే రక్తహీనత బాధే ఉండదు.! -
రాఖీ, కృష్ణాష్టమి స్పెషల్..అచ్చు స్వీట్ షాప్ రుచితో ఇంట్లోనే పర్ఫెక్ట్ సోన్ పాప్డీ చేసుకోండిలా.. -
శుక్ర గోచారం 2026..ఆగష్టు 25 నుంచి ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు! -
శ్రావణ మాసం స్పెషల్ మజ్జిగ ఆలు కర్రీ..జన్మ జన్మలు గుర్తిండిపోయే రుచి! -
పాముకాటుకి గురైతే మేల్కొని ఉండాలా.. పొరపాటున కళ్లు మూస్తే ఏం జరుగుతుంది.? -
పిల్లల్లో క్యాన్సర్ తొలి లక్షణాలు..ప్రతి పేరెంట్ తెలుసుకోవాల్సిన నిజాలు.. -
రాఖీ 2026 స్పెషల్: స్వీట్ షాప్ టేస్ట్‌ను తలదన్నేలా ఇంట్లోనే ఈజీగా కొకొనట్ బర్ఫీ.! -
పాతకాలం పద్దతిలో జొన్నల అన్నం..శరీరానికి అపరిమిత బలం..వారానికి 2 సార్లు తిన్నా 100 ఏళ్లు బలంగా బతికేస్తారు!
Akshaya Tritiya 2023 Daan: అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులను దానం చేస్తే ఎంతో పుణ్యఫలం...!
హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈరోజును చాలా పవిత్రమైన రోజుగా భావిస్తారు.

ఈ ఏడాది అంటే 2023లో ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం నాడు వస్తోంది. ఈ రోజున కచ్చితంగా బంగారం, వెండిని కొనాలని చాలా మంది ఆశపడతారు. అయితే అక్షయ తృతీయ అంటే కేవలం బంగారం, ఇతర వస్తువులు కొనడమే కాదు.. ఈ పవిత్రమైన రోజున విరాళం ఇవ్వడం ద్వారా అనేక ప్రయోజనాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్యశాస్త్రం ద్వాదశ రాశులలోని ప్రతి రాశి చక్రం వారు ఈ వస్తువులను కచ్చితంగా దానం చేయాలట. ఇలా చేస్తే ఏడాది పొడవునా మీకు శుభ ఫలితాలొస్తాయట. ఇంతకీ వైశాఖ మాసంలోని మూడో రోజున ఏమేమి దానం చేయాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

నీటితో నిండిన కలశం..
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు.. ఈ పవిత్రమైన కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందట. ఈ పండుగ వేసవికాలంలో వస్తుంది కాబట్టి.. ఈ సమయంలో నీటితో నిండిన కలశాన్ని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతారు. మీ కుటుంబ జీవితంలో కూడా ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది.

బార్లీ దానం..
అక్షయ తృతీయ రోజున బార్లీ బియ్యాన్ని దానం చేయడాన్ని బంగారంతో సమానంగా భావిస్తారు. దీని వల్ల మీ జీవితంలో సంతోషం పెరుగుతుంది. అలాగే నీటితో నిండిన మట్టి కుండలను దానం చేయడం వల్ల ఎన్నో తీర్థయాత్రలను దర్శనం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే అక్షయ తృతీయ రోజున చాలా మంది జలదానం చేస్తారు.

అన్నదానం..
అక్షయ తృతీయ రోజున ఎవరైతే అన్నదానం చేస్తారో.. వారి కుటుంబం ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో, సిరి సంపదలతో నిండి ఉంటుందని పండితులు చెబుతారు. దీంతో పాటు అక్షయ తృతీయ రోజున మొక్కలు నాటడం, జంతువులకు, పక్షులకు ఆహారంతో పాటు దాహాన్ని తీర్చేందుకు ఏర్పాట్లు చేస్తే చాలా మంచి ఫలితాలొస్తాయని నమ్ముతారు.

గోవు దానం..
మన హిందూ పురాణాల ప్రకారం, దేవతలు గోమాతలో నివసిస్తారని భావిస్తారు. ఈ నేపథ్యంలో
అక్షయ తృతీయ రోజున గోవులను దానం చేయడం వల్ల పుణ్యఫలాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు.

ఈ వస్తువులను..
అక్షయ తృతీయ రోజున బెల్లం, నెయ్యి మరియు ఉప్పు వంటి వస్తువులను దానం చేయడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయట. మీ వ్యక్తిగత జీవితంలో కచ్చితంగా పురోగతి లభిస్తుందట.

నువ్వులు, బట్టలు..
అక్షయ తృతీయ రోజున నల్లని నువ్వులు మరియు కొత్త బట్టలను దానం చేస్తే.. మీ ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోయి.. మీకు కష్టాల నుండి విముక్తి లభిస్తుందట. అక్షయ తృతీయ రోజు ఈ పనులు చేయడం వల్ల మంచి జరుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
సనాతన ధర్మం ప్రకారం, అక్షయ తృతీయ రోజున చాలా పవిత్రంగా భావిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో శుక్ల పక్షం యొక్క తృతీయ తిథిలో అక్షయ తృతీయ పండుగను జరుపుకుంటారు. ఈ ఏడాది అంటే 2022లో మే 03వ తేదీ మంగళవారం నాడు ఈ పవిత్రమైన పండుగ వచ్చింది. ఈరోజున శుభకార్యాలు చేయడానికి చాలా పవిత్రమైనదని నమ్ముతారు. ఈరోజున కచ్చితంగా బంగారం, వెండిని కొనాలని చాలా మంది ఆశపడతారు.
అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించడంతో పాటు.. ఈ పవిత్రమైన కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందట. ఈ పండుగ వేసవికాలంలో వస్తుంది కాబట్టి.. ఈ సమయంలో నీటితో నిండిన కలశాన్ని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఎంతో పుణ్య ఫలం లభిస్తుందని పండితులు చెబుతారు. మీ కుటుంబ జీవితంలో కూడా ఆనందం మరియు శ్రేయస్సు పెరుగుతుంది.అలాగే నీటితో నిండిన మట్టి కుండలను దానం చేయడం వల్ల ఎన్నో తీర్థయాత్రలను దర్శనం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే అక్షయ తృతీయ రోజున చాలా మంది జలదానం చేస్తారు.



Click it and Unblock the Notifications