Latest Updates
-
ఇంట్లోనే అచ్చమైన స్వీట్ షాప్ స్టైల్ పాలకోవా..కేవలం రెండే పదార్థాలతో చేసుకోండిలా.. -
తెల్ల జుట్టుకి చెక్ పెట్టి, యవ్వన శక్తిని పెంచే ఆమ్లా మురబ్బా.. ఇలా చేస్తే ఏడాది పాటు నిల్వ.! -
అమెరికాలో బ్యాన్, భారత్ లో బెస్ట్.. ఆవ నూనె వాడటం ఆరోగ్యానికి మంచిదేనా? -
నోరూరించే కార్న్ చిల్లీ చీజ్ టోస్ట్.. పెనం మీదే నిమిషాల్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
అత్యంత తీవ్రంగా, సైకోల్లా ప్రవర్తించే రాశులు ఇవే.. మీ ఫ్రెండ్స్ ఉన్నారా? -
మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ ప్రస్తావించిన ఉసిరి.. నారింజ కంటే 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి.. లాభాలు ఇవే! -
ఈ ఒక్కటి కలిపితే చాలు.. రోడ్ సైడ్ టమాటా గ్రేవీ రెడీ..ఇడ్లీలు లెక్కపెట్టకుండా తినేస్తారు -
బాలింతలకు డెలివరీ తర్వాత సత్తువనిచ్చి నొప్పులను తగ్గించే బలమైన లడ్డూ.! -
కరకరలాడే ఫిష్ పకోడీ.. ఈ పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేయండి! -
చికెన్ కంటే ఎక్కువగా ప్రొటీన్ లభించే ఆహార పదార్థాలు ఏంటో తెలుసా.?
వర్షాకాలంలో పండ్లు, కూరగాయలు ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే.. ఇలా చేయండి.!
వర్షాకాలం ప్రారంభమైంది. ఈ కాలంలో గాలిలో తేమ సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా పండ్లు, కూరగాయలు త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సీజన్‌లో వాటిని సరిగ్గా నిల్వ చేయాల్సిన అవసరం ఉంది. తద్వారా ఎక్కువగా కాలం తాజాగా ఉంటాయి. లేదంటే వారం రోజులకి సరిపడా మార్కెట్ నుంచి తెచ్చుకున్న కూరగాయలు రెండు, మూడు రోజుల్లోనే పాడైపోయే ప్రమాదం ఉంది. మరి వర్షాలకు వీటిని ఎక్కువ కాలం తాజాగా ఎలా ఉంచుకోవాలో చూద్దాం..

వర్షాలకు వాతావరణం ఆహ్లాదకరంగా ఉండి వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగించినా.. ఇంట్లో నిల్వ ఉంచిన పండ్లు, కూరగాయులు త్వరగా పాడైపోవచ్చు. గాలిలో తేమ కారణంగా వీటిపై బూజు, బ్యాక్టీరియా, క్రిములు వేగంగా అభివృద్ధి చెంది అన్నిటికీ సోకే అవకాశం ఉంది. తద్వారా కుళ్లిపోవడం, మెత్తబడటం, దుర్వాసన వెదజల్లడం జరుగుతుంది. దీంతో వాటిని పడేయడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అసలే కూరగాయల ధరలు మండిపోతున్న క్రమంలో పాడైపోకుండా తాజాగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది.
ఈ కాలంలో పండ్లు, కూరగాయలను సరిగ్గా నిల్వ చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే తాజాదనాన్ని, రుచిని కోల్పోతాయి. అంతేకాకుండా పోషక విలువలు కూడా తగ్గిపోతాయి. అందుకే వీటిని నిల్వ చేసేటప్పుడు కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి.
కొనే ముందు చెక్ చేసుకోండి..
మార్కెట్‌లో పండ్లు, కూరగాయలు కొనుగోలు చేసే ముందు జాగ్రత్త వహించాలి. అయితే ఒక్కోసారి పొరపాటున పాడైపోయినవి కూడా వాటిలో రావచ్చు. అలాంటప్పుడు ఇంటికి రాగానే ముందుగా వాటిని క్షుణ్ణంగా పరిశీలించాలి. పాడైపోయి, కుళ్లిపోయిన వాటిని వెంటనే పారవేయాలి. లేదంటే వీటిలోని బ్యాక్టీరియా ఇతర కూరగాయలకు వ్యాపిస్తుంది. పండ్లు, కూరగాయలు ఎప్పుడైనా వండే ముందు శుభ్రంగా కడగాలి. కడిగిన తర్వాత నిల్వ ఉంచకూడదు. లేదంటే తేమ కారణంగా అవి పాడైపోతాయి.
శుభ్రమైన, పొడి ప్రదేశం గాలి బాగా ప్రసరించే చోట మాత్రమే పండ్లు, కూరగాయలను నిల్వ ఉంచడం ఉత్తమం. ఇక, రిఫ్రిజిరేటర్‌లో ఉంచాల్సిన పండ్లు, కూరగాయలను వేర్వేరు డబ్బాలు, మెష్ సంచులలో విడివిడిగా నిల్వ చేయాలి. కలిపి ఉంచకూడదు. ఎందుకంటే కొన్ని పండ్లు త్వరగా పండుతాయి. కలిపి ఉంచడం ద్వారా ఇతర పండ్లు పాడైపోవచ్చు. ఫ్రిడ్జ్‌లో డబ్బాలు, సంచులు తడి లేకుండా పొడిగా ఉండేలా చూసుకోవాలి. ఈ కాలంలో ఆకుకూరలను ప్రత్యేకంగా నిల్వ చేయాలి. శుభ్రమైన గుడ్డలు లేదా టిష్యూలలో చుట్టాలి. దీని వల్ల అధికంగా తేమ వ్యాపించకుండా ఉంటుంది.

ఈ పొరపాట్లు వద్దు..
కూరగాయలు, పండ్లను శుభ్రంగా తుడిచి తడి లేకుండా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే ఫ్రిజ్‌లో నిల్వ చేయాలి. తడి ఉంటే తేమ వ్యాపించి పాడైపోతాయి. గాలి ప్రసరణ సరిగా ఆడేలా చూడాలి. ఇరుకుగా పెట్టకూడదు. లేదంటే గాలి సరిగా ప్రసరించక ఎక్కువ కాలం తాజాగా ఉండవు. పండ్లు, కూరగాయలను ప్లాస్టిక్ కవర్లలో నిల్వ ఉంచకూడదు. ఎందుకంటే వీటిలో గాలి చొరబడని కారణంగా తేమ పెరిగి పాడైపోయే అవకాశం ఉంటుంది.
ఇలా తనిఖీ చేయండి..
కొన్ని పండ్లు, కూరగాయలు పై నుంచి చూడటానికి బాగానే ఉన్నా లోపల నుంచి పాడైపోతాయి. వాటిని కోసిన తర్వాతే గుర్తించగలం. అలాంటప్పుడు వెంటనే వాటిని పడేయాలి. ఇక, వీటిపై బూజు పడినా, రంగు మారినా పాడైపోయాయని గమనించాలి. మెత్తగా అయిపోయినా లేదా వాటి నుంచి నీరు బయటకు వస్తున్నా పాడైపోయాయని గుర్తించి వాడటం మానేయాలి. మరికొన్ని వాడిపోతుంటాయి. వీటిని వంటల్లో లేదా తినడానికి ఉపయోగించలేం. ఆకుకూరలు వాడిపోయినట్లుగా ఉన్నా, జిగురుగా మారినా అవి పాడైపోయాయని భావించాలి. ఇటువంటి వాటిని తినడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్‌కి గురయ్యే ప్రమాదం ఉంది. పొట్ట ఇన్‌ఫెక్షన్లకి దారి తీస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
